తణుకులో భారీ అగ్ని ప్రమాదాలు | 2 fire accidents in tanuku | Sakshi
Sakshi News home page

తణుకులో భారీ అగ్ని ప్రమాదాలు

Mar 26 2016 1:46 PM | Updated on Sep 5 2018 9:45 PM

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేల్పూరు రోడ్డులోని నరేష్ క్లాత్‌షోరూంలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మూడంతస్తుల భవనంలో ఓ ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం స్థానికంగా ఉన్న పాత బెల్లం మార్కెట్ సమీపంలోని గోనె సంచుల గొడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడటంతో.. రూ. 50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది.

Advertisement
 
Advertisement
Advertisement