గాలింపు కోసం మరో 17 బోట్లు | 17 Boats Using For Dead Bodies Searching | Sakshi
Sakshi News home page

గాలింపు కోసం మరో 17 బోట్లు

Jul 18 2018 11:33 AM | Updated on Apr 3 2019 5:24 PM

17 Boats Using For Dead Bodies Searching - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద వృద్ధ గౌతమి పాయలో శనివారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం సహాయక బృందాల గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో నలుగురి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. మత్స్యకారుల సహయంతో గాలింపు బృందాలు నిరంతరం అన్వేషిణ కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 17 బోట్లతో సముద్రపు మొగలో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్లతో పాటు అవసరమైన చోట్ల పంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెయ్యికిపైగా లైఫ్‌ జాకెట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. స్కూలు పిల్లలతో పాటు ప్రజలు నది దాటేటప్పుడు లైఫ్‌ జాకెట్లు ఖచ్చితంగా ధరించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement