15 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల సస్పెన్షన్‌

15members Field Assisstance Suspended - Sakshi

కర్నూలు(అర్బన్‌) :  ఉపాధి హామీ అమలులో  నిర్లక్ష్యంగా వ్యవహరించిన 15 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల(సీనియర్‌ మేటీలు)ను సస్పెండ్‌ చేసినట్లు డ్వామా పీడీ ఎం.వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన పనిదినాలను పూర్తి చేయడంలో   ఫీల్డ్‌ అసిస్టెంట్లు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభం కాని విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయాన్నారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదోని మండలం బసాపురం, చిన్నహరివాణం, ఆత్మకూరు మండలం సున్నిపెంట, చాగలమర్రి మండలం నేలంపాడు, హొళగుంద మండలం పెద్దగోనేహాల్, కోసిగి మండలం జంబులదిన్నె, మిడుతూరు మండలం కలమందలపాడు, ఓర్వకల్లు మండలం మీదివేముల, అవుకు మండలం చెర్లోపల్లి, రామాపురం, పాణ్యం మండలం కొత్తూరు, ప్యాపిలి మండలం మెట్టుపల్లి, ఎన్‌.రంగాపురం, పెద్దపూదిర్ల, వెల్దుర్తి మండలం అల్లుగుండు ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేశామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top