ఏకధాటిగా14 గంటలు విద్యుత్ కోత! | 14 hours power cut in Srikakulam District! | Sakshi
Sakshi News home page

ఏకధాటిగా14 గంటలు విద్యుత్ కోత!

Nov 3 2014 10:47 PM | Updated on Sep 2 2017 3:49 PM

జిల్లాలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది. గడచిన మూడు దశాబ్ధాలలో ఎప్పుడూ విధించనంతసేపు విద్యుత్ కోత విధించారు.

శ్రీకాకుళం: జిల్లాలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది. గడచిన మూడు దశాబ్ధాలలో ఎప్పుడూ విధించనంతసేపు విద్యుత్ కోత విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి దాదాపు 14 గంటల సేపు ఏకధాటిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ కోసం అర్ధగంట సేపు మాత్రం సరఫరా చేశారు. అదీకూడా ఎమ్మార్వో కార్యాలయాలు ఉన్న ప్రాంతాలలో మాత్రమే సరఫరా చేశారు.

విద్యుత్ అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. సమాచారంలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. జిల్లాకు 250 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 40 మెగావాట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దాంతో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement