సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూటమి ప్రభుత్వ తప్పిదాలపై గతంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏడాది క్రితం కేసు నమోదు చేసి విచారణ కోసం తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల మధ్యలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. 352,353(D)(b),351(2),353(2) BNS కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులకు స్పందిస్తూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారణకు అప్పలరాజు హాజరయ్యారు.



