'కాకినాడ గ్రీన్ ఫీల్డ్' కేవీరావుకు 14 రోజుల రిమాండ్! | 14 days remand for KV Rao in Kakinada Green field incident | Sakshi
Sakshi News home page

'కాకినాడ గ్రీన్ ఫీల్డ్' కేవీరావుకు 14 రోజుల రిమాండ్!

Jul 22 2014 7:06 PM | Updated on Apr 3 2019 4:04 PM

గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాల కరస్పాండెంట్ కేవీరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

కాకినాడ: గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాల కరస్పాండెంట్ కేవీరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  ప్రిన్సిపల్ శ్రీనివాస్‌, కేవీరావులను తిమ్మాపురం పోలీసులు  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులపై ఐపీసీ సెక్షన్ 324, రెడ్‌ విత్ 34, సెక్షన్ 23 జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 
 
అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్‌ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సోమవారం సాక్షి టెలివిజన్ చానళ్ తోపాటు ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ దారుణానికి పాల్పడిన కేవీరావు, శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement