బాలికపై పక్కింటి అబ్బాయి అత్యాచారం | 12-yr-old raped by neighbourhood boy Nizamabad | Sakshi
Sakshi News home page

బాలికపై పక్కింటి అబ్బాయి అత్యాచారం

Nov 25 2013 1:30 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై పక్కింటి అబ్బాయి అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై పక్కింటి అబ్బాయి అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  నాగారం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న 12 బాలికను మాయామాటలు చెప్పి డాబాపైకి తీసుకు వెళ్లిన అత్యాచారానికి పాల్పడినట్లు నిజామాబాద్ పిప్త్ టౌన్ పోలీసులు సోమవారం తెలిపారు. గత రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాలుడుపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement