పసికందుని నేలకేసి కొట్టి.. | 11 months infant killed by father | Sakshi
Sakshi News home page

పసికందుని నేలకేసి కొట్టి..

Feb 23 2014 11:54 PM | Updated on Jul 30 2018 8:27 PM

మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతుర్నే హతమార్చాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం చోటుచేసుకుంది.

కోమాలోకి వెళ్లి 11 నెలల చిన్నారి మృత్యువాత
 మద్యం మత్తులో కన్నతండ్రి కిరాతకం


 మార్కాపురం, న్యూస్‌లైన్: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతుర్నే హతమార్చాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. కొమరోలు మండలం ములకపల్లి గ్రామానికి చెందిన ఆర్ . కిరణ్‌కుమార్, మరియమ్మ దంపతులు గిద్దలూరులో నివాసం ఉంటున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న వీరికి 11 నెలల కుమార్తె సంజన ఉంది. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. వీరు నెల రోజుల క్రితం మార్కాపురం సమీపంలో ఉంటున్న మరియమ్మ తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కూడా కిరణ్ భార్యతో గొడవపడ్డాడు. సాయంత్రం కుమార్తె సంజనను ఇంటినుంచి బయటకు తీసుకొచ్చి నేలకేసికొట్టి పారిపోయాడు. చిన్నారిని ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే కోమాలోకి వెళ్లడంతో అక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి పట్టుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement