
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల కోసం మొత్తం 5,658 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 12.26 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. నేటి నుంచి ఈ పరీక్షలు వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఉదయం 9.30-12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఆరంభమయ్యే సమయానికంటే 45 నిమిషాల ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అరగంట ఆలస్యమైనా తొలి రెండు రోజులు పరీక్షలకు అనుమతిస్తారు. అదే పనిగా ఆలస్యంగా వస్తున్నట్లు గుర్తిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఒకే స్కూలు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.