100 కిలోల గంజాయి పట్టివేత | 100 kgs of Cannabis seized | Sakshi
Sakshi News home page

100 కిలోల గంజాయి పట్టివేత

Aug 30 2015 10:34 AM | Updated on Sep 3 2017 8:25 AM

విశాఖ జిల్లా పాడేరు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు.

పాడేరు రూరల్ : విశాఖ జిల్లా పాడేరు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఇండిగో కారులో రూ.5 లక్షల విలువైన 100 కేజీల గంజాయిని తరలిస్తుండగా పాడేరు రూరల్ పోలీసులు దారి కాచి పట్టుకున్నారు.

పాడేరు మండలం పుండ్రుపొట్టు గ్రామానికి చెందిన పీతల రమేశ్, కండ్రి రవిబాబులను అరెస్ట్ చేసి, కారును, 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ గంజాయిని పాడేరు నుంచి విశాఖకు తరలిస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement