కుడితిపాలెం(ఇందుకూరుపేట): మండలంలోని కుడితిపాలెంలో రొయ్యల గుంతల వద్ద ఏరియేటర్లకు సంబంధించిన 10 మోటార్లు, పది గేర్‌బాక్సులతోపాటు సుమారు వెయ్యి మీటర్లు వరకు విద్యుత్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.
10 మోటార్ల చోరీ
Jul 24 2016 12:31 AM | Updated on Sep 4 2017 5:54 AM
కుడితిపాలెం(ఇందుకూరుపేట): మండలంలోని కుడితిపాలెంలో రొయ్యల గుంతల వద్ద ఏరియేటర్లకు సంబంధించిన 10 మోటార్లు, పది గేర్‌బాక్సులతోపాటు సుమారు వెయ్యి మీటర్లు వరకు విద్యుత్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి కథనం మేరకు నిడిముసలి గ్రామానికి చెందిన ఎరటపల్లి భాస్కర్‌రెడ్డి కుడితిపాలెంలో రొయ్యల గుంతలు సాగు చేస్తున్నారు. పంట పూర్తవడంతో గుంతలలో ఉపయోగించే ఏరియేటర్లుకు సంబంధించిన మోటార్లు, విద్యుత్ వైరును తీసి గదిలో ఉంచి భద్రపరిచాడు. రోజులాగే శుక్రవారం సాయంత్రం గుంతల వద్ద పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చి చూసే సరకి గదికి వేసిన తలుపులు తెరుచుకుని ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై షరీఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


