గ్యాస్ సిలిండర్ పేలుడు- పది మందికి తీవ్ర గాయాలు | 10 injured in gas cylendar blast | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలుడు- పది మందికి తీవ్ర గాయాలు

Nov 1 2015 8:08 PM | Updated on Aug 24 2018 2:36 PM

కొత్త గ్యాస్ కనెక్షన్ పేలడంతో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కొత్త గ్యాస్ కనెక్షన్ వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..  గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జీఐసీ కాలనీలో హుస్సేన్ అనే వ్యక్తి కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాడు.

బంధువులను పిలుచుకుని ప్రార్థనల అనంతరం గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా... సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు వీరిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement