గోల్డ్‌స్కీం పేరుతో రూ.కోటి టోకరా | 1 crore cheated with name of gold scheme | Sakshi
Sakshi News home page

గోల్డ్‌స్కీం పేరుతో రూ.కోటి టోకరా

Mar 29 2015 9:47 AM | Updated on Sep 2 2017 11:33 PM

వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం సిద్దవటం రోడ్డులోని ఓ నగల దుకాణం యజమాని గోల్డ్‌స్కీం పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు.

బద్వేలు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం సిద్దవటం రోడ్డులోని ఓ నగల దుకాణం యజమాని గోల్డ్‌స్కీం పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. స్కీం చివరి వాయిదా పూర్తి కావటంతో చందాదారులకు రూ.కోటి చెల్లించాల్సి ఉండగా బోర్డు తిప్పేసి నిర్వాహకుడు పరారయ్యాడు. పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా(27) ఆఫ్రిది జువెలరీ ఏర్పాటు చేశాడు. 2013లో అతడు ఆఫ్రిది మెగా గోల్డ్ బంపర్ స్కీం మొదలుపెట్టాడు.

ఈస్కీంలో నెలకు రూ.1500 చొప్పున 24 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఇందులో 300 మంది సభ్యులుగా చేరారు. ఈనెల 10వ తేదీకి చివరి వాయిదా కూడా పూర్తయింది. దీంతో సరిగా చెల్లించని 24 మందికి మినహాయించి 276 మందికి రూ.36 వేలు వంతున రూ.కోటి మేర పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే బాషా పది రోజులుగా అందుబాటులో లేకుండా పోయాడు. అతడు పరారైనట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement