breaking news
-
ఆర్టీసీ స్థలం ఇవ్వడం తప్పుకాదు: నారా లోకేశ్
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోవడం వ్యర్థమని.. నేరుగా జీఓలే ఇచ్చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. సింగపూర్ పర్యటన అనంతరం గురువారం ఆయన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. లులుకు ఆర్టీసీ స్థలం ఇవ్వడంలోగానీ.. అలాగే, 99 పైసలకే భూమి కేటాయింపు చేయడంలోగానీ తప్పులేదన్నారు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. -
మీ ఇంటి ఆడపిల్లకు ఇలాగే న్యాయం చేస్తారా?: వరుదు కల్యాణి
చిలకలపూడి(మచిలీపట్నం): టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేస్తే మంత్రి కొల్లు రవీంద్ర రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ ఇంటి ఆడపిల్లకు కూడా ఇలాగే న్యాయం చేస్తారా?’ అని మంత్రిని ఆమె ప్రశ్నించారు. మచిలీపటా్ననికి చెందిన ఓ యువతిని టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో గోవా తీసుకువెళ్లి మోసం చేసిన విషయం తెలిసిందే. తమ బిడ్డకు న్యాయం జరగదనే వేదనతో ఆ యువతి తల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం వరుదు కల్యాణి పరామర్శించారు. అనంతరం వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ బాధితులను హైదరాబాద్‌కు మంత్రి పిలిపించుకుని రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. బాధిత యువతిని ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయకుండా హోమ్‌లో నిర్బంధించడం దుర్మార్గమన్నారు. తాము ఏం చేసినా మంత్రులు, ఎమ్మెల్యేలు చూసుకుంటారనే ధైర్యంతో టీడీపీ మూకలు చెలరేగిపోతున్నాయని, ఇందుకు రాప్తాడు, రాజమండ్రి, తిరుపతి ఘటనలతోపాటు తాజాగా మచిలీపట్నం ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, చిటికిన వెంకటేశ్వరమ్మ, పేర్ని కిట్టు పాల్గొన్నారు. మచిలీపట్నం టీడీపీ నేత కుమారుడిపై కేసుకోనేరు సెంటర్ (మచిలీపట్నం): ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతిని బలవంతంగా తీసుకువెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. స్థానిక పీకేఎం కాలనీకి చెందిన యువతిని అభినవ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి గోవా తీసుకెళ్లి నాలుగు రోజులు గడిపాడు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుమారుడిని కాపాడేందుకు సుబ్రహ్మణ్యం విశ్వప్రయత్నాలు చేశారు. యువతిని బెదిరించి వెనక్కితగ్గేలా చేసేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవటంతో రెండేళ్ల తరువాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తానంటూ మాట మార్చారు. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, జనసేన నేతలను స్టేషన్‌కు పంపి పంచాయితీ పెట్టించి బెదిరించాలని చూశారు. పోలీసులనూ పావుగా వాడుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చేసేది లేక ఏకంగా స్టేషన్ బయటనే యువతి కుటుంబసభ్యులను మరింత బెదిరించేందుకు ప్రయత్నించారు. బిడ్డ జీవితం నాశనం అవుతుందని ఆందోళన చెందిన యువతి తల్లి స్టేషన్ ఎదుట పురుగుమందు తాగింది. వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు, యువతి పక్షాన నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలు, యువతి స్టేట్మెంట్ మేరకు అభినవ్‌పై సెక్షన్లు మారుస్తూ చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై అభినవ్ గోవాలో లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభినవ్‌పై పోలీసులు కేసు నమోదు చేయటం పట్ల మచిలీపట్నం కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
పాలనలో విఫలం.. బాబులో భయం: వైఎస్ జగన్
నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తే పోలీసులను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఇంతగా ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? సందుల్లోంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన పరిస్థితిని సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికీ ఉండదేమో. తన పాలన చూసి తనే ఇంతగా భయపడుతున్నాడు. అందుకే ఈ నిర్బంధాలు, అక్రమ కేసులు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదు. -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి.. పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు మోసాలేనని నిప్పులు చెరిగారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయన్నారు. ‘నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికే దక్కుతుంది. ఈ రోజు 2 వేలకు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గొంతు నొక్కేందుకే రెడ్‌బుక్ ⇒ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు–నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈ రోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. ⇒ మా ప్రభుత్వ హయాంలో ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4,200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు. ⇒ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగ¯Œ పథకాలన్నీ రద్దు చేయడంతో పేదలు అల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం.వైఎస్సార్సీపీ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు.. కిందపడిపోయిన మహిళ వీటికేం చెబుతారు? ⇒ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్నగాక మొన్న నగరిలో మాజీ మంత్రి రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు?⇒ మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? మా మాజీ మంత్రి రజినమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు? దానికి ఏం చెబుతారు?అంతులేని అవినీతి, ఎక్కడికక్కడ దోపిడీ ⇒ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అంతటా లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్‌గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టు షాప్‌లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.⇒ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా, క్వార్ట్ ్జ యథేచ్చగా దోచుకుంటున్నారు. సిలికా ఓనర్లంతా కోర్టుకెళ్లారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేశ్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మై¯Œన్లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి. ⇒ ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్‌లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ఉత్పత్తి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం భూమి కట్టబెడుతున్నారు. మా హయాంలో యూనిట్ విద్యుత్‌ను రూ.2.47తో కొనుగోలు చేస్తే.. ఇదే మనుషులు నానా రచ్చ చేశారు. వీరేమో రూ.4.50తో కొనుగోలు చేస్తున్నారు. మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది.. ⇒ అయ్యా చంద్రబాబూ.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఇదే చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తిన తప్పుడు అధికారులు.. ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్కలు తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.⇒ ఇప్పటికైనా మేలుకోమని చెబుతున్నా. మీ నైజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారులందరికీ చెబుతున్నాను.⇒ కొంత మంది అధికారులు రిటైర్ అవుతాం.. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. ప్రతి ఒక్కరినీ పిలిపించి, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయి.మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్న ఇంటిపై దాడి చేసి.. ఆయనపైనే కేసా?నా పక్కనే ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎదుటి వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80–100 మందిని ప్రసన్న ఇంటి మీదకు పంపించారు. వారంతా తప్ప తాగి రాడ్లతో, కర్రలు, మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి.. 83 ఏళ్ల మహిళనూ బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇంతగా దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.కాకాణిపై చిత్ర విచిత్ర కేసులు ⇒ నా పక్కనే గోవర్ధన్‌రెడ్డి కూతురు ఉంది. ఏం తప్పు చేశాడని గోవర్ధన్‌రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెడుతున్నారు. ఆయన్ను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆయన న్యూస్ ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్‌లో ఫార్వార్డ్ చేస్తే, అది కేసు.⇒ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వార్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరో వైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?⇒ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ గోవర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఎంత దారుణం? కావలి నియోజకవర్గం కోళ్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టితే దానిపైనా కేసు పెట్టారు. ⇒ 2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు రాష్ట్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. వారి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్‌షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ చార్జ్షీట్లోకి వెళ్లి, గోవర్ధన్‌రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?⇒ అక్రమంగా క్వార్ట్ ్జతవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాంటి కేసులో గోవర్ధన్‌రెడ్డి ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గత నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దీంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా మైనింగ్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.⇒ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనే ఎంపీ.. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, మీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణం?⇒ గోవర్ధన్‌రెడ్డి అన్న ఇల్లు రూ.100 కోట్ల రాజ భవనం అని తప్పుడు ఆరోపణలు చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను కూడా పంపించి ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరిగా దాడి చేయించే కార్యక్రమం మొదలు పెడితే రేప్పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? చంద్రబాబూ.. నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటు వైపు, అటు వైపు స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం. వైఎస్సార్సీపీ నాయకులపై కేసుల పర్వం ⇒ ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతూ వినిపించకూడదని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్‌ను 190 రోజులు జైల్లో పెట్టారు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తర్వాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.⇒ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటనను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్‌గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డన్న కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలో విషం, రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. ఇదే చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి జారిపోయిందని భాస్కర్‌ను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిపై కూడా కేసు పెట్టాడు.⇒ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసులు పెట్టి చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్మెంట్లు తీసుకున్నారని సాక్షి.. జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.⇒ మరో బీసీ నాయకుడు జోగి రమేష్, మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డినీ వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇవి కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ధైర్యంగా ఉండండి..సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. సుమారు అరగంట పాటు కాకాణితో ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకాణికి సూచించారు. జగన్ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఉన్నారు. అనంతరం సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ చేరుకున్నారు. మీకు మరో కొడుకుగా నేనున్నా.. ‘అధికార కూటమి నేతల దాడులకు భయపడాల్సిన పని లేదు. మీకు మరో కొడుకు లాగా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై, ఆనాటి పరిస్థితులను ప్రసన్నను, ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కేవలం విమర్శలను తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన రౌడీలు ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. విధ్వంసం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని ప్రసన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. -
‘స్థానిక’ ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ గురువారం కలిశారు.గత అనుభవాల దృష్ట్యా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమరి్పంచారు. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించాలని, నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషన్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులను బెదిరిస్తున్నారు: గడికోట స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నిజాయితీపరులు, సమర్థులైన అధికారులను నియమించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరామని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పటినుంచే అభ్యర్థులను ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పులివెందులలో బీటెక్ రవి అనే నాయకుడు ‘ఎవరు నామినేషన్ వేస్తారో చూస్తా’మంటూ నేరుగా ప్రెస్మీట్లో బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నామినేషన్లు ఆన్లైన్లో దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించాలి: మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన పోలీసు బందోబస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని కుట్రలు చేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల కమిషనర్‌ను కోరామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వంపై ఓట్ల రూపంలో వ్యతిరేకత ప్రతిబింబించకుండా అడ్డుకోవడానికి కూటమి నాయకులు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారన్నారు. అభ్యర్థులు కనీసం నామినేషన్ కూడా వేయకుండా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపించకుండా కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే పూర్తి అధికారం ఇస్తే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు ఉండవని చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ కలగజేసుకుని పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరామన్నారు. నామినేషన్ వేసిన ప్రతి అభ్యరి్థకి పోలీసులతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశామనితెలిపారు. ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరాం: దేవినేని అవినాశ్ ఇటీవల తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కారో రాష్ట్ర ప్రజలంతా చూశారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని గుర్తు చేశారు. లొంగని వారిని బెదిరించి, కిడ్నాప్ చేసి కూటమి వైపు తిప్పుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఇలాగే అడ్డదారులు తొక్కి చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్, ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. -
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతల బృందం
విజయవాడ: ఆగస్టు 10వ జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ నేతల బృందం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది. రాష్ట్ర ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతల్లో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లు ఉన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని ఈసీకి వినతిపత్రం సమర్పించారు. ఈసీని కిలిసిన అనంతరం గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. తిరుపతి,తిరువూరు,కుప్పం వంటి మున్సిపల్ బై ఎలక్షన్స్ లో దుర్మార్గంగా వ్యవహరించారు. ఆగస్ట్ 10న జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలి. ఎన్నికలకు పటిష్టమైన భద్రత కల్పించాలి. సిసి కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలి. నామినేషన్లు వేయకుండా టిడిపి నేతలు బెదిరిస్తున్నారు. ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరాం’ అని ఆయన స్పష్టం చేశారు. 10, 12 తేదీల్లో ‘స్థానిక’ ఉప ఎన్నికలు -
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?.. కానిస్టేబుల్‌పై కూటమి మంత్రి సోదరుడి దాడి
సాక్షి,నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బంధువు బీసీ మదన భూపాల్‌రెడ్డి దాడి చేశారు.కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలంటూ బీసీ మదన భూపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.సెక్యూరిటీ రిత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదంటూ స్పెషల్ పార్టీ పోలీసులు మదన భూపాల్‌రెడ్డి, అతని అనుచరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు చెబితే లోపలికి పంపిస్తానని అన్నారు. అయితే తాను బీసీ జనార్ధన్‌రెడ్డి సోదరుడినని,నన్నే ఆపుతావా? అంటూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా,రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాల సంస్కృతి దేవాలయాలకు చేరడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. డ్యూటీలో ఉన్న పోలీసులపై అధికార పార్టీకి చెందిన నాయకుడి సోదరుడు నేరుగా దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. -
బాబు విషబీజాలు.. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు: వైఎస్ జగన్
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని.. పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.. సాక్షి, నెల్లూరు: రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి?.. పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా.. అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు?. ఇవాళ వేల మంది పోలీసులు.. లెక్కలేనంత మంది డీఐజీలు, డీఎస్పీలు ఉన్నారు. వీళ్లంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా.. అభిమానులను ఆపడం కోసం ఉన్నారు. సూపర్‌సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారు. నాడు నేడు ఆగిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది. అన్ని పథకాలు ఆపేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్ రాజ్యాంగం. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ప్రసన్న ఇంటిపైకి 80 మందిని పంపి దాడి చేయించారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంపి ఉండేవారేమో. ఇళ్లపై దాడులేంటి.. మనుషుల్ని చంపాలని చూడడమేంటి?. మనిషి నచ్చకపోతే చంపేస్తారా?.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదు. మా పార్టీ మహిళా నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజిని లాంటి వాళ్లను ఉద్దేశించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో అంతా చూశారు. రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటారు.. కాకాణి గోవర్ధన్‌పై 14 కేసులు పెట్టారు. కావలిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే.. దానిని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా?. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు?. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనం అని జగన్ అన్నారు.టీడీపీ కార్యకర్త సాక్ష్యం చెబితే కాకాణిపై కేసు పెడతారా?. మాగుంట శ్రీనివాసులు ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు కోసం కాకాణిపై కేసు పెడతారా?. టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించినా కేసులు పెడతారా?. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపించినా కేసులు పెడతారా?. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా?.. అని జగన్ ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాకు డాన్ చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ పర్మిట్ రూంలో మద్యం అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారు. సిలికా, క్వార్ట్జ్ను విచ్చలవిడిగా దోచేస్తున్నారు. మైన్స్ కమీషన్లు చంద్రబాబు, లోకేష్‌కే చేరుతున్నాయి. పరిశ్రమలు నడుపుకోవాలన్నా.. ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలు.నందిగం సురేష్‌ను జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీని చిత్రహింసలు పెట్టారు. కాలేజీ రోజుల నాటి గొడవ.. పెద్దిరెడ్డితో కోపంతోనే మిథున్‌రెడ్డిపై చంద్రబాబు లిక్కర్ కేసు పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతోనే చంద్రబాబు కేసు పెట్టించాడు. కొడాలి నాని, పేర్ని నాని.. పేర్ని నాని భార్యను, అనిల్ కుమార్ యాదవ్‌ను వేధిస్తున్నారు. ఇలా ఎంతో మంది(పేర్లు చదివి వినిపించారు) అన్యాయాలను ప్రశ్నిస్తున్నవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు అని జగన్ అన్నారు.చంద్రబాబూ.. మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడుస్తుంది. అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతాం. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా అది గుర్తించండి.. అని జగన్ మరోసారి హెచ్చరించారు. -
‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ జగన్ కోసం జన సునామీ
మూడు వేల మందికిపైగా పోలీసుల మోహరింపు. ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లతో కాపల. వాహనాలు తిరగకుండా రోడ్లు తవ్వేసిన పరిస్థితులు. ఆఖరికి.. ఆర్టీసీ బస్సులను సైతం ఆపేసి జనాల ఫోన్లను తనిఖీలు చేయడం లాంటి పరిస్థితులు గత రెండు రోజులుగా నెల్లూరులో కనిపించాయి. అయితే ఆ ఆంక్షల చెరను తెంచుకుని జగన్ కోసం జనప్రవాహం ఇవాళ తరలి వచ్చింది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన కోసం దేశంలో ఎక్కడా లేని ఆంక్షలను, ఎన్నడూ వినని షరతులను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి జగన్ పర్యటనను విఫలం చేయాలని అన్ని విధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. జనసమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జగన్ పర్యటన వైపే రావొద్దంటూ హెచ్చరికలూ జారీ చేశారు. తమ బలం, బలగంతో వైఎస్సార్సీపీ నేతలనైతే ఆపగలిగారు. కానీ.. జన ప్రభంజనాన్ని మాత్రం ఏ పోలీసు చట్టం ఆపలేకపోయింది. జగన్ రాకతో గురువారం ఉదయం నెల్లూరు రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసుల వలయాన్ని దాటుకుని.. జగన్ కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. పార్టీ శ్రేణులు, అభిమానుల జేజేలతో అడుగడుగునా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా అభివాదం చేసి అందుకున్నారాయన. జై జగన్ నినాదాలతో సింహపురి గర్జించింది. ‘‘మనల్ని ఎవడ్రా ఆపేది’’ అంటూ వచ్చిన ఆ జన సునామీని ఆపడం పోలీసుల వల్ల కాలేకపోయింది.ఇదీ చదవండి: పులివెందుల ఎమ్మెల్యే కాదు.. సింహం -
నెల్లూరు: పోలీసుల అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా ప్రసన్నకుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తోసివేయడంతో ఆయన చేతికి గాయమైంది. మహిళలను కూడా పోలీసులు చితకబాదారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షల వలయంలో నెల్లూరు నగరాన్ని పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. గుంటూరు రేంజ్, తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలు తరలివచ్చాయి. చెవుడు గుంట జైలు నుంచి సుజాతనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడుగడుగునా భారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వైఎస్ జగన్ రానున్నారు. మెయిన్ రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందులో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై నగర వాసులు అసహనం వ్యక్తం చేశారు.రోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం మండిపడ్డారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే నిలబడి నిరసన తెలిపారు.తమ కార్యకర్తలను అన్యాయంగా కొట్టారంటూ ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారు. ప్రజలపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జనం రాకుండా రోడ్లు తవ్వేశారు. వైఎస్ జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు’’ అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
జనం రాకుండా రోడ్లు తవ్వేశారు.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందన్న అంబటి.. రోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా? అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్‌ని చూసేందుకు వస్తారు. జగన్ పర్యటనపై పోలీసులు, కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై ఉండే అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు. నెల్లూరు నగరాన్ని పూర్తిగా పోలీసులతో అష్ట దిగ్బంధనం చేసారు. చుట్టుపక్కల ఉన్న పల్లెలను పోలీసులతో చుట్టుముట్టారు. అయినా అభిమానులు, కార్యకర్తలు వస్తారని దారులను జేసీబీలతో గుంతలు తవ్వుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలా గుంతలు తవ్వడం ద్వారా ప్రజలకు అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుంది...నెల్లూరు లో ప్రధాన రహదారులు, దారులలో ముళ్ల కంచెలు వేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ తరంగాలు చూస్తే మంచి హాస్య నాటకం పోలీసులతో వేయిస్తున్నట్లు ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వస్తుంటే ఇన్నీ ఆంక్షలా.. అందరికీ నోటీసులు ఇచ్చి, అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు. ఎక్కడ ప్రజలు జగన్ కోసం వస్తారోనని ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులు, నిబంధనలు పెట్టిన జగన్ చూడటానికి సునామీలా వస్తారని బంగారుపాళ్యంలో రుజువైయింది. కూటమీ ప్రభుత్వం గుంతలు తవ్విన, ముళ్ల కంచెలు వేసిన జగన్ పర్యటన విజయవంతం అవ్వడం ఖాయం. ఆపడం ఎవరితరం కాదు’’ అని భూమన అన్నారు.రోడ్లను తవ్వడం దారుణం: అప్పలరాజురాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రోడ్లను తవ్వడం దారుణమన్నారు.వైఎస్ జగన్ అంటే భయమెందుకు?: అనంత వెంకటరామిరెడ్డివైఎస్ జగన్ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. సింహాన్ని చూసి భయపడినట్లు ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్. పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మంత్రులు... జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.సునామీని ఆపగలిగే శక్తి ఉందా?: ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషావైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మండిపడ్డారు. ప్రజలను, సునామీని ఆపగలిగే శక్తి ఉందా? అన్న ఇస్సాక్ భాషా.. ముందే నీ ఓటమిని ఒప్పుకుంటున్నవా? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే వైఎస్ జగన్ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు. ప్రజలను రాకుండా మీరు చేస్తున్న పనులు హేయమైనవి, దుర్మార్గమంటూ ఆయన విమర్శించారు. మీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టిన భయపడం’’ అని ఇస్సాక్ భాషా తేల్చి చెప్పారు.ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు: వైఎస్ అవినాష్రెడ్డివైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కార్యకర్తలను అడ్డుకుంటుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం పెరిగిపోతోందన్నారు. నెల్లూరు పర్యటనకు కార్యకర్తలను రాకుండా లాఠీ ఛార్జ్ చేయడం దారుణం. మా ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డుకున్నామా..?. చంద్రబాబు స్వేచ్ఛగా తిరిగి ఎన్నెన్నో విమర్శలు చేశారు. ఏ హోదా లేని పవన్ కళ్యాణ్‌కి కూడా అన్నాడు మేము భద్రత ఇచ్చాం. వీళ్ళని మేము ఎక్కడా అడ్డుకున్నది లేదు. కానీ ఇప్పుడు జగన్‌ను అడ్డుకోవాలని చూడటం దారుణం.ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఎవరు రాకూడదని 5 వేల మంది పోలీసులను వినియోగించారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. గుంటూరు, సత్తెనపల్లి, పొదిలి, బంగారుపాళ్యం.. ఇలా రోజు రోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం ఎక్కువవుతోంది. మీరు ఎంత అపాలనుకున్నా.. వైఎస్ జగన్ కోసం వచ్చే జనాన్ని మీరు ఆపలేరు. జగన్ భద్రతపై ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆందోళన ఉంది. భద్రతపై కేంద్రాన్ని, సుప్రీం కోర్టును, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. -
అయిపాయె.. రెంటికీ చెడ్డ జనసేనాధిపతి!
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల కష్టం చూస్తే జాలేస్తుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ప్రమోషన్ కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే సినిమా చూడాలని ప్రేక్షకులను బతిమలాడుతున్నట్లు ఉంది. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక షోలు నిర్వహించి జనాన్ని తరలించే యత్నాలు చేయడం, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సినిమా సక్సెస్ చేయాలని కోరడం పవన్ కల్యాణ్‌కు సహజంగానే అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సినిమాపై ప్రేక్షకుల ఆదరణ విషయంలో సందేహాలు కలిగాయి. మొత్తం పరిణామ క్రమం అంతా పార్టీని డ్యామేజీ చేశాయనిపిస్తోంది.సినిమా బాగుందా? లేదా? అనేదానితో ఇక్కడ నిమిత్తం లేదు. మొదటి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయా? అనేది చర్చనీయాంశం కాదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ సినిమా కోసం అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాగా బిజీగా ఉండే పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి అయినప్పటికీ, ఆ విధులను పక్కనబెట్టి సినిమా షూటింగ్లలో పాల్గొనడాన్ని ప్రజలు గమనించారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ వంటివారు చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఏ రకంగా పవన్ తన పదవిని ఈ సినిమా గురించి వాడుకున్నారో తెలియచేస్తూ వీడియోలు విడుదల చేశారు. పవన్ తాను గతంలో ఎప్పుడూ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పారు. కాని హరిహర వీరమల్లు కోసం నాలుగు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ కోసం పవన్‌తోపాటు పార్టీ నేతలంతా కష్టపడాలని నిర్ణయించుకున్నారు అన్నమాట. అయినా.. సినిమా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫంక్షన్ కోసం విశాఖలో యూనివర్శిటీ హాల్‌ను వాడుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల్లో నటించవచ్చా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నటించకూడదన్న చట్టం ఏమీ లేదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఒకట్రెండు సినిమాలలో నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమా ఫెయిల్ అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నటించిన సినిమా సఫలమైంది. ఎన్టీఆర్ సినిమాలలో నటించడంపై ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. టీడీపీ కూడా ఏదో సమాధానం చెప్పేది. అంతే తప్ప ఏ పార్టీ అదేదో వ్యక్తిగత వివాదంగా తీసుకోలేదు. కానీ.. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే తన సినిమా గొడవలోకి వైఎస్సార్సీపీని లాగి విమర్శలు చేశారో, అప్పుడు ఇది రాజకీయ రగడగా మారింది. సినిమాను బాయ్‌కాట్ చేసుకోండని ఒకసారి, ఎవరూ దీనిపై గొడవ పడవద్దని ఇంకోసారి, అవసరమైతే దాడి చేయండని మరోసారి ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. తణుకు వంటి కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రౌడీల మాదిరి అల్లరి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన వాహనం బాయినెట్ పై ఎక్కి గంతులు వేశారు. వీటిపై అసంతృప్తి చెందిన వైసీపీ అనుకూల సోషల్ మీడియా సీరియస్‌గా తీసుకున్నారు. కొందరు బాయ్‌కాట్ అంటూ ప్రచారం చేశారు. అయినా సినిమా బాగుంటే ఇలాంటివి పెద్దగా పనిచేయవని అంతా భావించారు.ఏపీలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ మరీ రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. బహుశా వైసీపీ వారు ఎటూ చూడరులే అన్న భావనతో జనసేన, టీడీపీ క్యాడర్‌ను బాగా యాక్టివ్ చేసేందుకు ఈ వ్యూహం అనుసరించారో, ఇంకే కారణమో తెలియదు కాని ఒక రాజకీయ పార్టీ క్యాడర్‌ను తన సినిమాకు తానే దూరం చేసుకున్నట్లయింది. సినిమా పరంగా తనను అభిమానించే వారు ఇతర పార్టీల్లోనూ ఉంటారన్న సాధారణ స్పృహ లేకుండా ఆయన మాట్లాడారు. ఇప్పుడే కాదు. గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ అతడి వర్గీయులు కొందరు సినీ ప్రముఖులు అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. ఉదాహరణకు రిపబ్లిక్, మట్కా, లైలా, భైరవం వంటి సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్.. ఆయన మనుషులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేశారు. ఆ ప్రభావం సినిమాలపై పడి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకత్వం ముందుగానే ఈ పరిణామాలను ఊహించి కార్యకర్తలతో సినిమా చూడాలని కోరుతూ ర్యాలీలు తీయించింది. ఇలాంటివి గతంలో జరగలేదనే చెప్పాలి. జనసేన మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాకు జనాన్ని ఎలా తరలించాలో చెప్పడం, సంబంధిత ఆడియో లీక్ అవడంతో పార్టీ పరువు పోవడమే కాకుండా, సినిమాపై కూడా నెగిటివ్ టాక్‌కు అవకాశం ఏర్పడింది. సినిమా బాగుంటే ఇలా ఎందుకు చేస్తారన్న ప్రశ్న వచ్చింది. దానికి తగినట్లే సినిమా రివ్యూలు కూడా ఆశాజనకంగా రాలేదు. సినిమా మొదటి సగం కాస్త ఫర్వాలేదు కాని, రెండో హాఫ్ ఏవో ఒకటి, రెండు చోట్ల తప్ప, అసలు బాగోలేదని టాక్ వచ్చింది. అంతేకాక ఒకసారి ఇది చరిత్ర అని, మరోసారి ఇది కల్పిత పాత్ర అని ప్రచారం చేశారు. కోహినూర్ వజ్రం పేరుతో సినిమా తీసినా, ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు పెట్టడంపై పలువురు ఆక్షేపించారు. ఒకవైపు సినిమా కథ అంతంత మాత్రంగా ఉండడం, ప్రేక్షకులకు గ్రాఫిక్స్ నచ్చకపోవడం, రాజకీయ దుమారం సృష్టించుకోవడం వంటి కారణాలతో హరిహర వీరమల్లు సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న భావన ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి వైసీపీ అభిమానులలో ఒక స్పష్టత ఉండగా, టీడీపీ అభిమానులు మాత్రం దాగుడుమూతలు అడినట్లు అనిపిస్తుంది. నిజంగా టీడీపీ క్యాడర్ అంతా సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఇలా ఫెయిల్ అయ్యేది కాదన్న అభిప్రాయం లేకపోలేదు. పైకి శుభాకాంక్షలు చెబుతూ, లోపల మాత్రం సినిమా ఇలా దెబ్బతినడంపై సంతోషం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. జనసేన ర్యాలీలలో టీడీపీ వారు పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. పవన్ సినిమా సక్సెస్ కాకపోతేనే ఆయన టీడీపీని ధిక్కరించకుండా ఉంటారని ఆ పార్టీ వారు భావించి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా అటు వైసీపీని దూరం చేసుకుని, ఇటు టీడీపీ నుంచి సరైన ఆదరణ పొందలేకపోవడంతో పాటు స్వయంకృతాపరాధాల కారణంగా ఈ సినిమా నష్టపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇకనైనా రాజకీయాలు వేరు..సినిమాలు వేరు అనే సూత్రాన్ని వపన్ చిత్తశుద్దితో పాటిస్తే మంచిదేమో!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వివాదంలో సినీ నటుడు రోలర్ రఘు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సినీ నటుడు రోలర్ రఘు వివాదంలో చిక్కుకున్నారు. మడకశిర మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి రోలర్ రఘు హాజరయ్యారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కలిసేందుకు రోలర్ రఘు మడకశిర వెళ్లారు. ఆయన్ను.. మడకశిర నగర పంచాయతీ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీసుకెళ్లారు.మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై సినీ నటుడు రోలర్ రఘు కనిపించారు. మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే అర్హులు. అయితే, యాక్టర్ రోలర్ రఘు హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను అభాసుపాలు చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. -
Updates: నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
జగన్ నెల్లూరు పర్యటన.. ఎప్పటికప్పటి అప్డేట్స్నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటనఅక్రమ కేసుల్లో అరెస్టై నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్అనంతరం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి జగన్ప్రసన్న కుమార్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ఏపీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులంటూ ఫైర్ 👉నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి నేను వెళ్ళకూడదా? - వైఎస్ జగన్ నా వెనుక జనం రాకుండా , నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు..?జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రజలను రాకుండా ఆపడానికి 2 వేల మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది ?బాబు గారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే... ఎందుకు ఇంత భయపడుతుంది..?తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడువిద్య వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారుఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి , రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదుఅన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందిమా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారురోజా , విడుదల రజిని పై కారు కూతలు కూస్తున్నారుమా పార్టీ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడులు చేశారుతప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారుఏ తప్పు చేశాడని కాకానిని జైల్లో పెట్టారు ?రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారుపోలీసుల ద్వారా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు👉ఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుకాకాణిపై ఏకంగా 14 తప్పుడు కేసులు పెట్టారుప్రెస్మీట్లోని తన క్లిప్పింగ్‌లను వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసు పెట్టారురాజకీయ నాయకుడు ప్రెస్‌మీట్ పెడితే దాన్ని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా? 👉ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారుఏ ఉచితంగా ఇసుక ఎక్కడ ఇస్తున్నారుఇసుక పేరుతో అడ్డంగా దోపిడీకి తెరతీశారు👉నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారుసూపర్ సిక్స్,సూపర్ సెవన్ అంటూ వెన్నుపోటురాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందిచంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించేవారిని గొంతు నొక్కేస్తున్నారు.జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారునాడు నేడు ఆగిపోయింది.. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయిందిరైతన్న పంటకు గిట్టుబాటు ధర లేదుచంద్రబాబు రాజ్యంలో రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం👉ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి: వైఎస్జగన్రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందినా పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు?జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారు👉ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్టీడీపీ గుండాల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ప్రసన్న కుమార్రెడ్డిఇంటిని, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన పచ్చ మూక.. దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ కుటుంబ సభ్యులుప్రసన్న కుమార్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఇంటిని పరిశీలిస్తున్న వైఎస్ జగన్👉నెల్లూరులో జన ప్రభంజనంవైఎస్ జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతంవైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివచ్చిన ప్రజలుదారి పొడవునా వైఎస్ జగన్‌కు ఉప్పొంగిన జనాభిమానంజనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రహదారులునెల్లూరులో ఎక్కడ చూసినా జన ప్రవాహంపోలీసుల ఆంక్షలను లెక్క చేయని ప్రజలు 👉ఆంక్షల ఆటంకాలను దాటుకుని తరలివస్తున్న కార్యకర్తలుజగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న గవర్నమెంట్ ఆస్పత్రి సెంటర్రోడ్ల పైకి వస్తున్న వాహనాలను, వైసీపీ కార్యకర్తలను వీడియో రికార్డ్ చేస్తున్న పోలీసులుపోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, భయబ్రాంతులకు గురి చేసిన వైఎస్ జగన్‌ని కలుస్తామంటున్న కార్యకర్తలు👉జైల్లో మాజీ మంత్రి కాకాణిని పరామర్శించిన వైఎస్ జగన్ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి బయల్దేరిన వైఎస్ జగన్👉ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసుల అరాచకంవైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేసిన పోలీసులునిరసనగా రోడ్డుపై బైఠాయించిన ప్రసన్నకుమార్రెడ్డిపోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంపోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలుపోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలుమా కార్యకర్తలను అన్యాయంగా కొట్టారు: ప్రసన్నకుమార్రెడ్డిస్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారుప్రజలపై కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారుజనం రాకుండా రోడ్లు తవ్వేశారువైఎస్జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు 👉నెల్లూరు జైల్లో కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న కాకాణికి వైఎస్ జగన్ పరామర్శవైఎస్ జగన్ వెంట కాకాణి కూతురు, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుఅనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్న వైఎస్ జగన్ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు👉నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్హెలిప్యాడ్ వద్ద పోలీసుల ఓవరాక్షన్హెలిప్యాడ్ దగ్గర జనాన్ని తరిమేస్తున్న పోలీసులుపొలాల గట్ల మీద నుంచి తరలివచ్చిన కార్యకర్తలుహెలిప్యాడ్ దగ్గర అనుమతి లేదంటూ తరిమేసిన పోలీసులుఅక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉నెల్లూరు నగరం అష్ట దిగ్బంధం.. అణువణువునా ఆంక్షల వలయంగుంటూరు రేంజ్ తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలుచెవుడుగుంట జైలు నుంచి సుజాతనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలుఅడుగడుగునా బారీకేడ్లు, ముళ్లకంచెలుఅయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి రానున్న వైఎస్ జగన్మెయిన్రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందుల్లో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటుపోలీసుల తీరుపై నగరవాసుల అసహనంరోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం ఆగ్రహంనల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తతతన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆగ్రహంఅక్కడే నిలబడి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి👉మరికాసేపట్లో నెల్లూరుకు వైఎస్ జగన్‌మరికాసేపట్లో నెల్లూరుకు చేరుకోనున్న వైఎస్ జగన్అక్రమ కేసులలో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి సర్కార్ ఆంక్షలుమూడు వేలమందికి పైగా పోలీసుల మోహరింపుప్రజలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లు తవ్వేసిన అధికారులు ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లునెల్లూరు జైలు వద్దకు జగన్‌తో పాటు కేవలం 10 మందికే అనుమతికోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటి వద్ద 100 మందికి మించి ఉండకూడదని ఆంక్షలు113 మందికి మించి ఉంచితే కేసులు పెడతామని వార్నింగ్👉 నెల్లూరులో మీడియాపై పోలీసుల దౌర్జన్యంమీడియాపైనా పోలీసుల ఆంక్షలుమీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్న పోలీసులు కవరేజ్‌కు అనుమతి లేదంటూ రిపోర్టర్లను నెట్టేస్తున్న పోలీసులు👉రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: సీదిరి అప్పలరాజురోడ్లను తవ్వడం దారుణంరాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది👉 నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు ఓవరాక్షన్వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులునెల్లూరు సెంట్రల్ జైలు వద్ద మీడియాపైనా ఆంక్షలురోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసిన పోలీసులుస్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులు👉 నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం: అంబటి రాంబాబుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదుప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందిరోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా?ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది👉నెల్లూరు బయలుదేరిన వైఎస్ జగన్‌కాసేపట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించనున్న జగన్అనంతరం టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్న జగన్👉వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కొనసాగుతున్న పోలీస్ ఆంక్షలుజగన్ ప్రయాణించే రూట్స్ లో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను గుర్తించడమే టార్గెట్సీసీ కెమెరా రికార్డు అయిన వ్యక్తులపై కేసులు నమోదుకు ప్రయత్నాలువైఎస్ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలునడక దారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్న పోలీసులుబైకులు, నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులుఇనుప కంచెలు, బారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు👉వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు.. చంద్రబాబు సర్కార్ కుట్రలువైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు సర్కార్ ప్రధాన ఏజెండానగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటుచెన్నై-కోల్ కతా హైవేలో సైతం తనిఖీలువైఎస్ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను సైతం నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులుఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులిచ్చిన పోలీస్ శాఖవార్డు లీడర్స్ దగ్గర నుండి మాజీ మంత్రుల వరకూ నోటీసులుజగన్ పర్యటనకు జన సమీకరణ చేయకూడదు అంటూ హెచ్చరికలునిబంధన ఉల్లంఘిస్తే కేసులు తప్పవంటూ బెదిరింపులుపోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కుట్రలకు దిగుతున్న చంద్రబాబు సర్కార్👉మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు భారీగా నిర్భంధనలుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, అభిమానులను అడ్డుకోవడానికి వ్యూహంభారీగా పోలిసుల మోహరింపు, పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుప్రధాన కూడళ్ల దగ్గర నుండి చిన్న సర్కిల్స్ వరకూ అన్నింటా చెక్ పోస్టులుపోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని కుట్రలకు పూనుకున్న చంద్రబాబు సర్కార్👉నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా..మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. అక్రమ కేసులతో జిల్లా కేంద్ర కారాగారం రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అక్కడి నుంచి సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు బయలు దేరుతారు10.40 గంటలకు జిల్లా డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు11 గంటలకు జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్11.30 గంటలకు రోడ్డుమార్గాన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయలుదేరుతారు11.50 గంటలకు చేరుకుని ప్రసన్నకుమార్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారుమధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు1.25 గంటలకు హెలిప్యాడ్ నుంచి బెంగళూరు బయలు దేరుతారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం (నేడు) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.వైఎస్ జగన్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. హెలిప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. -
వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకో?
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలంటే కూటమికి భయమెందుకు? అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ చంద్రబాబు సర్కార్ విధిస్తున్న ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకు?. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి సర్కార్ ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడో వదిలేసింది.ప్రజలను వదిలేసి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. రేపు నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి జనం తరలి వస్తారు. ప్రజాభిమానాన్ని ఆపాలంటే కొత్త జైళ్లు కట్టుకోండి. ప్రజల హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు లేదు. నాయకుడికి మద్దతు తెలపడం ప్రజల హక్కు. ఇబ్బంది పెట్టినవారెవరనీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. -
ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్‌ను నిలువరించలేరు: ఎస్వీ సతీష్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు ఇప్పటికే జిల్లాలో రెండు వేల మందికి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.మహిళా నేతల ఇంటికి అర్థరాత్రి సమయాల్లో వెళ్ళి నోటీసుల పేరుతో వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పర్యటనకు ఎవరూ వెళ్ళకూడదంటూ ప్రభుత్వమే అడ్డుకోవడం చూస్తుంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలనుకునే అవివేకమే కనిపిస్తోందని అన్నారు. ఇంకా వారేమన్నారంటే..ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఎస్పీ సెలవుపై వెళ్లిపోయారు: సతీష్రెడ్డివైఎస్ జగన్ గురువారం నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమ కేసుల్లో జైలుపాలైన మా పార్టీ నాయకులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించడానికి రావాలని నిర్ణయించుకుంటే పోలీసుల ఆంక్షల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. హెలిప్యాడ్‌కి స్థలం కేటాయింపు దగ్గర నుంచి నాయకులను అడ్డుకోవడం వరకు అడుగడుగునా వైఎస్ జగన్‌ని రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరులో 2 వేల మందికి పైగా నోటీసులిచ్చారు.పట్టాభిరామిరెడ్డి అనే 75 ఏళ్ల వృద్ధుడికి కూడా నోటీసులిచ్చారు. అర్ధరాత్రి 1.26 గంటలకు టూటౌన్ ఎస్సై ఒక మహిళ కార్పొరేటర్‌ను నిద్రలేపి నోటీసులిచ్చి వెళ్లారు. వారితో కనీసం ఒక మహిళా కానిస్టేబుల్‌ను కూడా తీసుకురాలేదు. జగన్ కార్యక్రమానికి వెళితే మీ వాహనాలను సీజ్ చేస్తామని కిరాయి వాహనాల యజమానులకు నోటీసులిచ్చారు.ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చూడలేక, వాటిలో భాగంకాలేక, అధికార పార్టీ పెట్టే ఒత్తిడిని తట్టుకోలే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రేపటి వైయస్ జగన్ పర్యటను ఆపలేరు. వైయస్ జగన్ కోసం వచ్చే జన ప్రభంజనాన్ని అడ్డుకోలేరు. వైయస్ పర్యటనలకు జనాన్ని రాకుండా అడ్డుకోవడమంటే అరచేతితో సూర్యకిరణాలను ఆపాలనుకోవడమే అవుతుంది.ప్రశాంతమైన నెల్లూరులో ప్రతీకార రాజకీయాలకు తెరదీశారు:దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలకు తెరదీస్తున్నారు. సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాలు దాడి చేసి ఫర్నీచర్ పగలగొట్టి కారు మీద పెట్రోల్ పోసి తగలబెడితే, ఇంటిని ధ్వంసం చేస్తే నిందితుల మీద పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. మరీ విచిత్రంగా దాడి జరిగిన సమయంలో పోలీసులే అక్కడే ఉండి కూడా గూండాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామయంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.ప్రజా సమస్యల మీద వైయస్ జగన్ బయటకొచ్చి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. గుంటూరు, పొదిలి, సత్తెనపల్లి, బంగారుపాళ్యెం పర్యటనలకు వెళితే అక్కడి నాయకులను అక్రమంగా నిర్బంధించారు. పర్యటన తర్వాత వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆఖరుకి ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని కూడా వైఎస్ జగన్ మీదకి నెట్టి క్షుద్ర రాజకీయం చేశారు.ప్రజా సమస్యలను వినిపిస్తున్న సాక్షి ఛానెల్ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎంతసేపటికీ వైయస్ జగన్‌ని అడ్డుకోవాలని, వైఎస్సార్సీపీని లేకుండా చేయాలనే ఆరాటం తప్ప, ఓటేసిన ప్రజలకు న్యాయం చేద్దామని, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామన్న ఆలోచన చంద్రబాబుకి, లోకేష్‌కి ఉన్నట్టు కనిపించడం లేదని ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు: ఎమ్మెల్సీ పర్వతరెడ్డిగత వారం పది రోజులుగా నెల్లూరులో నెలకొన్న పరిస్ధితులు చూస్తే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది రాక్షస పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. నెల్లూరులో జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి నాయకులు చేయని ప్రయత్నం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి కార్యక్రమానికి రాకుండా చేయాలని చూస్తున్నారు. హెలిప్యాడ్‌కి అనుమతుల విషయంలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్‌ను కలవనివ్వకండా జనాన్ని ఆంక్షల పేరుతో కట్టడి చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. ప్రజలు స్వచ్ఛందంగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారనేందుకు గతంలో జరిగిన పర్యటనలే నిదర్శనం. ప్రశాంతంగా జరిగే పర్యటనలను కావాలనే రెచ్చగొట్టి, కార్యకర్తలను, అభిమానులు ఇబ్బందిపెట్టి విఫలం చేయాలని పోలీసులను పావులుగా చంద్రబాబు, లోకేష్‌లు వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. -
మహిళా హోంమంత్రిగా అనిత ఫెయిల్: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళ మానప్రాణాలను, వారి ఆత్మగౌరవాన్ని హరిస్తున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అనుచరుడి కుమారుడు ఒక యువతిని మోసం చేస్తే, సదరు యువతికి న్యాయం చేయకుండా ఆమె జీవితానికి వెలకట్టేందుకు మంత్రి సెటిల్ మెంట్ చేయడం దారుణమని మండిపడ్డారు.చివరికి తన కుమార్తెకు న్యాయం జరగడం లేదంటూ బాధిత యువతి తల్లి ఆత్మహత్యయత్నం చేసినా కూడా కూటమి నేతల మనస్సు కరగడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..మచిలీపట్నంలో టీడీపీ నాయకులు, మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విలువలతో కూడిన విద్య నేర్పిస్తాను అంటూ హరేకృష్ణ పేరుతో ఒక స్కూల్ నడిపిస్తున్నారు. తన స్కూల్లో పనిచేస్తున్న యువతిని సుబ్రహ్మణ్యం కుమారుడు ప్రేమించానంటూ, పెళ్ళి చేసుకుంటానని తీసుకుని వెళ్ళి, నాలుగు రోజుల పాటు బయట తిప్పి, తరువాత తిరిగి ఇంటికి తెచ్చి వదిలేశాడు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరితే దానిపై పంచాయతీ చేయాలని మంత్రి కొల్లు రవీంద్రను ఆశ్రయించాడు.చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన మంత్రి కొల్లు రవీంద్ర బాధిత మహిళ జీవితానికి వెలకట్టే ప్రయత్నం చేశాడు. ఇదేనా మహిళల పట్ల సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రి కొల్లు రవీంద్రకు ఉన్న గౌరవం. తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నారంటూ సదరు యువతి తల్లి పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించడం వల్ల ఆమె ప్రాణాలతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదని భావించి ప్రాణం తీసుకునే పరిస్థితి కల్పించారు.కొల్లు రవీంద్ర ఒక మంత్రిగా ఉండి బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహిరంచడం దారుణం. సదరు యువతకి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? మహిళలకు అన్యాయం జరిగితే బాదితులకు అండగా నిలబడాల్సిన స్థానంలో ఉండి, దోషులకు కొమ్ముకాయడం కూటమి ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి న్యాయం చేయకపోతే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు.హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి, మహిళలపై జరిగే అరాచకాలను పట్టించుకోవడం లేదు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని గొప్పగా ప్రకటించారు. నేడు నిత్యం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాష్టికాలను చూస్తే ఏ మహిళ ప్రశాంతంగా నిద్రపోతోందో చెప్పాలి. తెలుగుదేశంకు చెందిన నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారి మహిళలను వేధిస్తున్నంటే హోంమంత్రిగా ఉండి కూడా అనిత స్పందించడం లేదు.మాజీ సీఎం వైఎస్ జగన్‌ను దూషించడానికే ఆమె పరిమితమయ్యారు. ప్రతిచోటా పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. మహిళల మానప్రాణాలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు లేవు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే పరిమితమయ్యారు. దీనివల్ల తప్పుడు పనులు చేసే వారిలో ఎటువంటి భయం కనిపించడం లేదు. అందువల్లే ఈ రాష్ట్రంలో రోజుకు డెబ్బై నుంచి ఎనబై సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఎవరైనా మహిళలపై చేయి వేస్తే, అదే వారికి చివరి రోజు అంటూ సీఎం చంద్రబాబు, మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో హెచ్చరించారు. అయితే వారి మాటలు ఎక్కడైనా కార్యరూపంలోకి వచ్చాయా అంటే ఒక్కటీ కనిపించడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగేళ్ళ దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా పోలీసులు కనీసం వారిపై కేసు కూడా నమోదు చేయలేదు. చివరికి వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దీనిపై ఆందోళలు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిందట రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్ధినిపై టీడీపీకి చెదిన నాయకుడి బంధువు దీపక్ అనే వ్యక్తి చేసిన వేధింపులకు తాళలేక సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ కుటుంబానికి నేటికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అలాగే తిరువూరులో టీడీపీ నాయకుడు రమేష్ అనే వ్యక్తి ఒక గిరిజన మహిళను లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ఆడియో కూడా వెలుగుచూసినా, అతడిపై ఎటువంటి చర్య లేదు. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక దళిత యువతిని టీడీపీ రౌడీషీటర్ నవీన్ దారుణంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. సీఎం నివాసం ఉంటున్న జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన చంద్రబాబు కనీసం స్పందించలేదు.తిరుపతిలో లక్ష్మీ అనే బాధితురాలిని జనసేన నాయకుడు కిరణ్‌రాయల్ ఎలా వేధింపులకు గురి చేశాడో మీడియా ద్వారా ప్రజలంతా చూశారు. దీనిపైనా ఎటువంటి చర్యలు లేవు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తన దగ్గర పనిచేసే మహిళను లైంగికంగా వేధిస్తే, ఆమె హైదరాబాద్‌కు వెళ్ళి ప్రెస్‌మీట్ పెట్టి ఈ దారుణాన్ని వెల్లడించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపుల వల్ల ఒక మహిళా వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం చేసింది.కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులు మహిళా ఫీల్డ్ అసిస్టెంట్‌ను ముడుపులు ఇవ్వాలి, లేదా తమ కామవాంఛలు తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపై ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత సంఘాలు ఆదోళనలు చేశాయి. కర్నూలు జిల్లా ముచ్చిమర్రిలో ఒక తొమ్మిదేళ్ళ బాలికను గ్యాంగ్ రేప్ చేసి, ముక్కలుగా చేసి విసిరేశారు. ఆ బాలిక మృతదేహం నేటికీ లభించలేదు. హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ప్రేమోన్మోది నీరబ్ శర్మ ఒక యువతిపై హత్యాయత్నం చేశాడు. ఇతడి వల్ల తనకు హాని ఉందని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సదరు దుండగుడు ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలన్నీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను చాటుతున్నాయి. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. చంద్రబాబు సర్కార్ మరో కుట్ర
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. గురువారం వైఎస్ జగన్ తన నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. అయితే వైఎస్ జగన్ నెల్లూరు రానున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది.గురువారం కాకాణిని వైఎస్ జగన్ పరామర్శించనుండగా.. అదే సమయంలో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. రేపటి నుంచి ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా,వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను దృష్టిలో ఉంచుకొని కాకాణిని కస్టడీ కోరడంపై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వివరాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు గుత్తా లక్ష్మీనారాయణ బుధవారం కలిశారు. సామాజిక వర్గం పేరిట ఆయన్ని టీడీపీ గుండాలు ఓవైపు.. మరోవైపు పోలీసులు సైతం వేధించగా.. భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారాయన.పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ తొలి నుంచి వైఎస్సార్సీపీ అభిమాని. అయితే ఆ పార్టీలో కొనసాగడం జీర్ణించుకోలేక పోతున్న పెదనెమలిపురి టీడీపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనను తీవ్రంగా వేధించడంతో పాటు, ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగ్గొట్టారు. ఇదే విషయాన్ని ఆయన జగన్‌కు తెలిపారు. మరో వైపు స్థానిక డీఎస్పీ ఒకరు, ఏకంగా కులాన్ని ప్రస్తావించి.. కమ్మ కులంలో పుట్టి.. రెడ్డిలకు చెందిన పార్టీలో ఎందుకున్నావని దూషించారని, దీంతో తీవ్ర మనస్థాపం చెందిన తాను, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. దీర్ఘకాల చికిత్స అనంతరం కాస్త కోలుకున్నాకే జగన్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారాయన. లక్ష్మీనారాయణ యోగక్షేమాలు విచారించిన వైఎస్ జగన్.. ఆయనకు ధైర్యం చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం కార్యదర్శి పి.శివారెడ్డి తదితరులు జగన్‌ను కలిసినవాళ్లలో ఉన్నారు. -
లిక్కర్ కేసులో అన్నీ కట్టుకథలే.. బాబు ఒంటి నిండా అవినీతి మరకలే
సాక్షి, తాడేపల్లి: లిక్కర్ కేసులో సిట్ కట్టు కథలకు అడ్డే లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాల అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీఛానళ్ల, మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండి వారుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న రూ.11 కోట్లను వైయస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫాంహౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఇదే ఎల్లో మీడియా చెప్తోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా?. లిక్కర్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వారికి బెయిల్ వచ్చే సమయంలో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఈ నగదును 2024 జూన్‌లో రాజ్ కేసిరెడ్డి దాచాడని చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి 100 రోజులు దాటింది. ఆయన్ని లిక్కర్ డాన్ అని ఎల్లోమీడియా అరెస్టు సమయంలో రాసింది. ఆయనో మేధావని, క్రిమినల్ అని, సూత్రధారి, పాత్రధారి అని ఏవేవో రాశారు. మరి అలాంటి వ్యక్తి.. రూ.11 కోట్లను నగదును పెట్టెల్లో దాచాడని ఇప్పుడు రాస్తున్నారుముదురు క్రిమినల్ అయితే గోవానుంచి హైదరాబాద్‌కి విమానంలో వస్తాడా?. తప్పించుకునే ఆలోచనలు ఉన్నవాళ్లు ఇలా చేస్తారా?. మరి అలాంటి ముదురు 2024 జూన్ నుంచి అట్టపెట్టెల్లో డబ్బు పెడతాడా?. కథలు తప్ప.. లిక్కర్ కేసులో ఇప్పటివరకూ సిట్ కొత్తగా చెప్పేదేముంది. మొత్తం.. 375 కోట్ల పేజీల డేటా మాయం అని ఈనాడు రాసింది. కాని అది అబద్ధమని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈకేసు మొదలైన నాటినుంచి ఇలాంటి కథలు ఈ కేసులో చెప్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలు. లేని లిక్కర్ స్కాంను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారులిక్కర్ వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతి అన్నారు.. ఇప్పుడేమో.. 3వేల కోట్లు అంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో ఒక్క పైసా అవినీతి లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రతి బాటిల్ మీద క్యూర్ కోడ్ ఉంటుంది, అమ్మగానే ఆ డబ్బును బ్యాంకుల్లో జమచేశామని వారే బయటకొచ్చి మాట్లాడుతున్నారు.. .. అక్రమాలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉంది. చంద్రబాబుకు తనకు జారీ అయిన ఐటీ నోటీసులో ఏముందో తెలియదా?. లెక్కలు చూపని రూ.2వేలు కోట్లు గుర్తించామని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ చెప్పలేదా?. తాను దొరక్కుండా తన పీఎస్ శ్రీనివాస్‌ను చంద్రబాబు దేశం దాటించలేదా?. అధికారంలోకి రాగానే ఆ పీఎస్‌ను రప్పించి తిరిగి పోస్టింగ్ ఇప్పించలేదా?. ఏ పాపం చేయలేదు కాబట్టే వైఎస్ జగన్ ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు చరిత్ర పాపాల పుట్ట.. .. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సంతకాలతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకుండా.. సాక్ష్యం లేకుండా తప్పుడు లిక్కర్ కేసును సృష్టించారు. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్‌కు ఓ రూల్.. చంద్రబాబు,పవన్, లోకేష్‌కు ఓ రూలా?. నెల్లూరులో 40 శాతం మందికి నోటీసులు ఇసస్తున్నారు. వైఎస్సార్, జగన్ ఫొటోలు ఉన్న ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. చివరకు.. జగన్ ఫొటో స్టేటస్ పెట్టుకున్నా నోటీసులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు సహా అందరికీ అర్థమైంది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి నోటీసులు ఇస్తారా?. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరు. జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఆయన్ని చూడగానే ప్రజలకు ఓ ధైర్యం వస్తుంది’’ అని పేర్ని నాని అన్నారు.ఇదీ చదవండి: జగన్ అడుగులే.. పిడుగులయ్యాయా? -
అంత అర్జెంటుగా కిషోర్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రెంటచింతల పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారంటూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తురకా కిషోర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి వాదనను వినిపించారు. తురక కిషోర్‌పై ఇప్పటికీ 12 అక్రమ కేసులు బనాయించారని ఆయన కోర్టుకు తెలిపారు.‘‘ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే మరొక కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి తురకా కిషోర్ విడుదల కాగానే రెంటచింతల పోలీసులు జైలు బయటినుంచి తీసుకువెళ్లారు’’ అని కిషోర్ తరపు న్యాయవాది వివరించారు.సంఘటన ఎప్పుడు జరిగిందంటూ ధర్మాసనం.. పోలీసులు తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. 2024 ఏప్రిల్ 8వ తేదీన సంఘటన జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన 13 నెలల తర్వాత కేసు ఎలా రిజిస్టర్ చేశారు? అంత అర్జెంటుగా తురకా కిషోర్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.తురకా కిషోర్‌పై నమోదైన 12 కేసులు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తురక కిషోర్‌పై ఫిర్యాదులు ఎప్పుడు ఇచ్చారు..? సంఘటన ఎప్పుడు జరిగింది...? ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు.? ఎప్పుడు బెయిల్ వచ్చింది అనే పూర్తి అంశాలతో ఒక టేబుల్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని పల్నాడు ఎస్పీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. -
Jagan Tour: మునుపెన్నడూ చూడని ఆంక్షల చెర ఇది!
సాక్షి, నెల్లూరు: నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆయన ఆ పని స్వేచ్ఛగానే చేశారు. ఏనాడూ.. ఏ పర్యటనకు ఆటంకాలు ఎదురైంది లేదు.. ఆంక్షలు విధించింది లేదు. అలాంటిది జగన్ జనాల్లోకి వస్తున్నారంటే మాత్రం.. సింగపూర్ పర్యటనలో ఉన్నాసరే చంద్రబాబు ఎందుకనో వణికిపోతున్నారు!. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షల విధింపు కనిపిస్తోంది. జగన్ పర్యటన హైలైట్ కావొద్దని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులతో బెదిరింపులు చేయించింది. జనసమీకరణ జరగొద్దని మైకులతో ప్రచారం చేయిస్తోంది. పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది.ఇప్పటికే జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా నేతలకూ పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు చేరాయి. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందజేశారు. జగన్ పర్యటనకు రాకూడదంటూ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో.. కేసులు పెడతామంటూ కార్యకర్త స్థాయి వాళ్లకూ పోలీసు బెదిరింపులు వెళ్తుండడం గమనార్హం. మాజీ మంత్రి కాకాణితో ములాఖత్‌తో పాటు టీడీపీ గుండాల చేతిలో తృటిలో దాడి నుంచి తప్పించుకున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సి ఉంది. సాధారణంగానే.. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా తరలి వస్తారు. అందునా కూటమి ప్రభుత్వ వ్యతిరేకత అనేది జగన్ పర్యటన రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పర్యటనలకు జనాన్ని దూరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా.. జగన్ నెల్లూరు పర్యటనకి 113 మందికి మించకూడదని వింత ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీ, రోడ్ షోకి అనుమతి లేదంట. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే అనుమతి ఉందట. అంతకు మించి గుమిగూడితే.. కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. అలాగే.. జగన్ పర్యటన హెలిప్యాడ్ అనుమతి విషయంలో తాత్సారం చేసిన పోలీసులు చివరాఖరికి 10 మందికే అనుమతి ఉందంటూ చెప్పడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా షరతులు పెడుతున్న ఏపీ పోలీసులపై, వాళ్ల బెదిరింపులపై, నోటీసుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ.. అని ప్రశ్నిస్తున్నారు. -
కూటమి నేతల అరాచకం.. పరిశ్రమలు విలవిల: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్ట్‌లు, కమీషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీపైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్ట్‌లన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఇప్పుడు కియా ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో, ఇక్కడి నుంచి తరలించుకుని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తానంటున్న విజనరీ చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే..పెట్టుబడులు తెచ్చే విధానం ఇదేనా?కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదను విచ్చలవిడిగా పంచుకుని తింటున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, లిక్కర్, ఉద్యోగాలు, కాంట్రాక్టులు.. ఏదీ వదలకుండా దోచేస్తున్నారు. ఇవి చాలదంటూ పరిశ్రమలపైన కూడా కూటమి నేతలు దృష్టి సారించారు. అన్ని పరిశ్రమల్లోనూ తమకే కాంట్రాక్ట్‌లు, కమిషన్లు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు.రాయలసీమలో పలువురికి ఉపాధిని కల్పిస్తున్న కియా కంపెనీపైనా ఇదే తరహాలో వేధింపులు ప్రారంభించారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా బెదిరించి, బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం మారగానే గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, తమకు చెందిన వారికే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి కియాను కూడా తరిమేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తమ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దుర్మార్గాలు మాత్రం ఆయనకు కనిపించడం లేదు.పథకాలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తులు:పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అనేది గత మూడు దశాబ్దాలుగా వింటున్నదే. కొత్తగా ఇంకో 'పీ' ని చేర్చి ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తెరదీశారు. అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు సాధికారత కల్పించడమే ఎజెండాగా ఉండాలే కానీ వారిని రాజకీయ పార్టీల వారీగా వర్గీకరించడం, కేవలం తన పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తానని, ఎవరిపైనా పక్షపాతం చూపించను అని రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడటం ద్వారా తన పదవికే మచ్చ తెచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినెలా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్త పింఛన్ కోసం టీడీపీ నాయకుల ఇళ్లకు కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, డీలర్లను తొలగించేశారు. ఏడాదికి 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ నాయకులు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను వరుసపెట్టి పీకిపారేస్తున్నారు.నాడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు:వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సీఎంగా సంక్షేమ పథకాల కోసం కేటాయించిన ప్రతి రూపాయి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ప్రజలను ఆత్మగౌరవంతో బతికేలా వెన్నుదన్నుగా నిలిచారు. పావర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ (పీఐపీ), పావర్టీ రూరల్ అప్రైజల్ (పీఆర్ఏ)ల ద్వారా పేదరికంలో ఉన్న నిజమైన లబ్దిదారులను గుర్తించి సామాజిక అసమానతలు లేకుండా చేశారు. కులాలు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. -
‘జగన్ పర్యటనపై ఇన్ని ఆంక్షలా?.. ఎందుకంత భయం?’
సాక్షి, వైఎస్సార్: కూటమి ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను, జనాన్ని వేరు చేయలేరని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్వేచ్ఛగా తిరగారు అని గుర్తు చేశారు.మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి, సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైళ్లో పెట్టారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. ఈ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. జిల్లా మొత్తాన్ని అష్టదిగ్భందనం చేస్తున్నారు.. మా జిల్లా అధ్యక్షుడికి నోటీసులిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్వేచ్ఛగా తిరగారు. మా ప్రభుత్వంలో వీళ్లెవరికీ మేం నోటీసులు ఇవ్వలేదు.. ఇబ్బంది పెట్టలేదు.పది మందికి అనుమతా?.జగన్ హెలిపాడ్ వద్దకు పది మందికే అనుమతి అంటున్నారు.. మూడు వాహనాలు మాత్రమే అనుమతి అంటున్నారు. కాకాణి పరామర్శకు ముగ్గురు, నల్లపురెడ్డి ఇంటి వద్ద వంద మందికి మాత్రమే అనుమతి అంటూ షరతులు పెడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు ఒకటే సూటి ప్రశ్న. ఇదే ఆంక్షలు గత ఐదేళ్లు మేమూ పెట్టుంటే మీరు తిరిగేవారా?. చంద్రబాబూ.. నువ్వు రాష్ట్రమంతా పర్యటన చేసేవాడివా?. లోకేశ్.. నువ్వు యువగళం అంటూ తిరగగలిగేవాడివా?. పవన్ కల్యాణ్.. ఇవే ఆంక్షలు మేం పెట్టి ఉంటే కారు టాప్‌పై కూర్చుని సినిమా యాక్షన్ చేయగలిగేవాడివా?. జగన్ ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, జగన్ అంటేనే జనం. ఆయన ఎక్కడ పర్యటనకు వచ్చినా ఏ వైఎస్సార్సీపీ నేత జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ ఎక్కడ ఉంటే జనం అక్కడ ఉంటారు.. జగన్ వెంటే జనం. ఈ విషయం ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలుసు. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే ప్రజలు జగన్ పరిపాలనే మేలు అంటూ ఆయన వెంటే నడుస్తున్నారు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, ఇబ్బందులు చెప్పుకునేందుకే జనం జగన్ వద్దకు వస్తున్నారు. మీరు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, అడ్డుకున్నా.. జగన్ నుంచి జనాన్ని వేరు చేయలేరు. ఎవరూ నెల్లూరు నగరంలోకి రాకూడదని ఆంక్షలు పెట్టడం సమంజసమేనా?.జగన్ పేరంటే భయమా?మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడికైనా పర్యటనకు వెళితే మీరెందుకు ఇంతగా భయపడుతున్నారు?. ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కడికి వెళ్లినా.. ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు?. ఎందుకు పేరు వింటే భయపడిపోతున్నారు?. వైఎస్సార్సీపీ నుంచి 11మంది గెలిచినా.. 40 శాతం ప్రజాభిమానాన్ని పొందింది. మీరు అవునన్నా కాదన్నా వైఎస్సార్సీపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు. మీరు ఆయనకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే ప్రతిపక్ష నేత. ఆయనకు 40శాతం ఓట్లు ఇచ్చి ప్రజలే ప్రతిపక్ష హోదా కల్పించారు. అలాంటి నేత పరామర్శలకు వెళితే ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదు.చంద్రబాబు, లోకేష్‌లకు రాని జనం జగన్‌కు వస్తున్నారని ఇలా ఆంక్షలు పెడుతున్నారా?. మీరు డబ్బులు, బిర్యానీ, మందు ఇచ్చినా మీ పర్యటనలకు జనాలు రావడం లేదు. కానీ, జగన్ కాలు బయటపెడితే ఇవేమీ అవసరం లేదు.. స్వచ్ఛందంగా ప్రజలే స్వాగతం పలుకుతారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత పరిపాలనలో ఉన్నామా?. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల అభిమానాన్ని అడ్డుకోలేరు.. కచ్చితంగా నాలుగింతలు ప్రజలు వస్తారు. ఈ సంప్రదాయాన్ని మీరు ప్రారంభించారు.. భవిష్యత్తులో మీరు ఎక్కడా తిరగలేరని గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని అడ్డంకులు, ఆంక్షలు పెట్టినా జగన్ నెల్లూరు వస్తారు.. పర్యటన చేస్తారు. ఇలాంటి ఆంక్షలను ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి’ అని హితవు పలికారు.