Updates: నెల్లూరులో ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan Nellore Tour Updates | Sakshi
Sakshi News home page

నెల్లూరులో ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన

Jul 31 2025 7:31 AM | Updated on Jul 31 2025 3:20 PM

YS Jagan Nellore Tour Updates

జగన్‌ నెల్లూరు పర్యటన.. ఎప్పటికప్పటి అప్‌డేట్స్‌

నెల్లూరులో ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన

  • అక్రమ కేసుల్లో అరెస్టై నెల్లూరు  జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్‌
  • అనంతరం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి జగన్‌
  • ప్రసన్న కుమార్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్‌ పరామర్శ
  • అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌
  • ఏపీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులంటూ ఫైర్‌

 

👉నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి నేను వెళ్ళకూడదా? -  వైఎస్  జగన్ 

  • నా వెనుక జనం రాకుండా , నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు..?
  • జనం రాకుండా రోడ్లను తవ్వేశారు
  • ప్రజలను రాకుండా ఆపడానికి 2 వేల మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది ?
  • బాబు గారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే... ఎందుకు ఇంత  భయపడుతుంది..?
  • తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడు
  • విద్య వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారు
  • ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి , రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు
  • అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసింది
  • మా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారు
  • రోజా , విడుదల రజిని పై కారు కూతలు కూస్తున్నారు
  • మా పార్టీ జెడ్‌పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై దాడులు చేశారు
  • తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారు
  • ఏ తప్పు చేశాడని కాకానిని జైల్లో పెట్టారు ?
  • రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారు
  • పోలీసుల ద్వారా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు

👉ఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారు

  • ఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారు
  • కాకాణిపై ఏకంగా 14 తప్పుడు కేసులు పెట్టారు
  • ప్రెస్మీట్లోని తన క్లిప్పింగ్‌లను వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసు పెట్టారు
  • రాజకీయ నాయకుడు ప్రెస్‌మీట్‌ పెడితే దాన్ని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా? 

👉ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు 

  • ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారుఏ 
  • ఉచితంగా ఇసుక ఎక్కడ ఇస్తున్నారు
  • ఇసుక పేరుతో అడ్డంగా దోపిడీకి తెరతీశారు

👉నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు

  • సూపర్‌ సిక్స్‌,సూపర్‌ సెవన్‌ అంటూ వెన్నుపోటు
  • రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాజ్యమేలుతోంది
  • చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించేవారిని గొంతు నొక్కేస్తున్నారు.
  • జనం రాకుండా రోడ్లను తవ్వేశారు
  • ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
  • నాడు నేడు ఆగిపోయింది.. ఇంగ్లీష్‌ మీడియం ఆగిపోయింది
  • రైతన్న పంటకు గిట్టుబాటు ధర లేదు
  • చంద్రబాబు రాజ్యంలో రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం

👉ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి: వైఎస్‌జగన్‌

  • రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది
  • నా పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు?
  • జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారు

👉ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటికి వైఎస్‌ జగన్‌

  • మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • టీడీపీ గుండాల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ప్రసన్న కుమార్‌రెడ్డి
  • ఇంటిని, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన పచ్చ మూక.. దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ కుటుంబ సభ్యులు
  • ప్రసన్న కుమార్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్‌ పరామర్శ
  • ఇంటిని పరిశీలిస్తున్న వైఎస్‌ జగన్‌

👉నెల్లూరులో జన ప్రభంజనం

  • వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం
  • వైఎస్‌ జగన్ పర్యటనకు భారీగా తరలివచ్చిన ప్రజలు
  • దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు ఉప్పొంగిన జనాభిమానం
  • జనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రహదారులు
  • నెల్లూరులో ఎక్కడ చూసినా జన ప్రవాహం
  • పోలీసుల ఆంక్షలను లెక్క చేయని ప్రజలు
     

👉ఆంక్షల ఆటంకాలను దాటుకుని తరలివస్తున్న కార్యకర్తలు
జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న గవర్నమెంట్ ఆస్పత్రి సెంటర్
రోడ్ల పైకి వస్తున్న వాహనాలను, వైసీపీ కార్యకర్తలను వీడియో రికార్డ్ చేస్తున్న పోలీసులు
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, భయబ్రాంతులకు గురి చేసిన వైఎస్‌ జగన్‌ని కలుస్తామంటున్న కార్యకర్తలు

👉జైల్లో మాజీ మంత్రి కాకాణిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌
ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయల్దేరిన వైఎస్‌ జగన్‌

👉ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసుల అరాచకం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్‌
మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులు
నిరసనగా రోడ్డుపై బైఠాయించిన ప్రసన్నకుమార్‌రెడ్డి
పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల నినాదాలు
పోలీస్‌ జులుం నశించాలంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నినాదాలు
మా కార్యకర్తలను అన్యాయంగా కొట్టారు: ప్రసన్నకుమార్‌రెడ్డి
స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారు
ప్రజలపై కూడా  పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు
జనం రాకుండా రోడ్లు తవ్వేశారు
వైఎస్‌జగన్‌ అభిమానులను ఎవరూ ఆపలేరు
 

👉నెల్లూరు జైల్లో కాకాణితో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌
అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న కాకాణికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
వైఎస్‌ జగన్‌ వెంట కాకాణి కూతురు, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
అనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్న వైఎస్‌ జగన్‌
ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు

👉నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్

హెలిప్యాడ్‌ వద్ద పోలీసుల ఓవరాక్షన్‌
హెలిప్యాడ్‌ దగ్గర జనాన్ని తరిమేస్తున్న పోలీసులు
పొలాల గట్ల మీద నుంచి తరలివచ్చిన కార్యకర్తలు
హెలిప్యాడ్‌ దగ్గర అనుమతి లేదంటూ తరిమేసిన పోలీసులు

అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి
కాకాణితో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌
టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూక
ప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

👉నెల్లూరు నగరం అష్ట దిగ్బంధం.. అణువణువునా ఆంక్షల వలయం
గుంటూరు రేంజ్ తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలు
చెవుడుగుంట జైలు నుంచి సుజాతనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి  ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలు
అడుగడుగునా బారీకేడ్లు, ముళ్లకంచెలు
అయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి రానున్న వైఎస్‌ జగన్
మెయిన్‌రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందుల్లో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటు
పోలీసుల తీరుపై నగరవాసుల అసహనం
రోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు  విధిస్తున్నారంటూ జనం ఆగ్రహం
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్‌లో ఉద్రిక్తత
తన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆగ్రహం
అక్కడే నిలబడి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి

👉మరికాసేపట్లో నెల్లూరుకు వైఎస్‌ జగన్‌

  • మరికాసేపట్లో నెల్లూరుకు చేరుకోనున్న వైఎస్‌ జగన్‌
  • అక్రమ కేసులలో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి
  • కాకాణితో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌
  • టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
  • ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూక
  • ప్రసన్న కుమార్‌ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

👉జగన్‌ నెల్లూరు పర్యటనపై కూటమి సర్కార్‌ ఆంక్షలు

  • మూడు వేలమందికి పైగా పోలీసుల మోహరింపు
  • ప్రజలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లు తవ్వేసిన అధికారులు 
  • ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లు
  • నెల్లూరు జైలు వద్దకు జగన్‌తో పాటు కేవలం 10 మందికే అనుమతి
  • కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ ఇంటి వద్ద 100 మందికి మించి ఉండకూడదని ఆంక్షలు
  • 113 మందికి మించి ఉంచితే కేసులు పెడతామని వార్నింగ్‌

👉 నెల్లూరులో మీడియాపై పోలీసుల దౌర్జన్యం

  • మీడియాపైనా పోలీసుల ఆంక్షలు
  • మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్న పోలీసులు 
  • కవరేజ్‌కు అనుమతి లేదంటూ రిపోర్టర్లను నెట్టేస్తున్న పోలీసులు

👉రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: సీదిరి అప్పలరాజు

  • రోడ్లను తవ్వడం దారుణం
  • రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది

👉 నెల్లూరు సెంట్రల్‌ జైలు సమీపంలో పోలీసులు ఓవరాక్షన్‌

  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు
  • నెల్లూరు సెంట్రల్‌ జైలు వద్ద మీడియాపైనా ఆంక్షలు
  • రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసిన పోలీసులు
  • స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు
  • ఆర్టీసీ బస్సులను నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులు

👉 నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం: అంబటి రాంబాబు

  • స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదు
  • ప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోంది
  • రోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా?
  • ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

👉నెల్లూరు బయలుదేరిన వైఎస్ జగన్

  • కాసేపట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని‌ పరామర్శించనున్న జగన్
  • అనంతరం టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్న జగన్

👉వైఎస్‌ జగన్ నెల్లూరు పర్యటనపై కొనసాగుతున్న పోలీస్ ఆంక్షలు

  • జగన్ ప్రయాణించే రూట్స్ లో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు
  • స్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను గుర్తించడమే టార్గెట్
  • సీసీ‌ కెమెరా రికార్డు అయిన వ్యక్తులపై కేసులు నమోదుకు ప్రయత్నాలు
  • వైఎస్‌ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు
  • నడక దారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్న పోలీసులు
  • బైకులు, నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులు
  • ఇనుప కంచెలు, బారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు

👉వైఎస్‌ జగన్‌ పర్యటనకు అడ్డంకులు.. చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

  • వైఎస్‌ జగన్‌ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు సర్కార్‌ ప్రధాన ఏజెండా
  • నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు
  • చెన్నై-కోల్ కతా హైవేలో సైతం తనిఖీలు
  • వైఎస్‌ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు
  • ఆర్టీసీ బస్సులను సైతం నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులు
  • ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు నోటీసులిచ్చిన పోలీస్ శాఖ
  • వార్డు లీడర్స్ దగ్గర నుండి మాజీ మంత్రుల వరకూ నోటీసులు
  • జగన్ పర్యటనకు జన సమీకరణ చేయకూడదు అంటూ హెచ్చరికలు
  • నిబంధన ఉల్లంఘిస్తే కేసులు తప్పవంటూ బెదిరింపులు
  • పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కుట్రలకు దిగుతున్న చంద్రబాబు సర్కార్

👉మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు భారీగా నిర్భంధనలు

  • స్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, అభిమానులను అడ్డుకోవడానికి వ్యూహం
  • భారీగా పోలిసుల మోహరింపు, పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు
  • ప్రధాన కూడళ్ల దగ్గర నుండి చిన్న సర్కిల్స్ వరకూ అన్నింటా చెక్ పోస్టులు
  • పోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని కుట్రలకు పూనుకున్న చంద్రబాబు సర్కార్

👉నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన  ఇలా..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. అక్రమ కేసులతో జిల్లా కేంద్ర కారాగారం రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్‌ అవుతారు. అక్కడి నుంచి సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

  • ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు బయలు దేరుతారు

  • 10.40 గంటలకు జిల్లా డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు

  • 11 గంటలకు జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్‌

  • 11.30 గంటలకు రోడ్డుమార్గాన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయలుదేరుతారు

  • 11.50 గంటలకు చేరుకుని ప్రసన్నకుమార్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు

  • మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు

  • 1.25 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బెంగళూరు బయలు దేరుతారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీక­ర­ణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రు­లు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారు­లు నోటీసులు జారీ చేశారు. 

జగన్‌ పర్యటనలో పా­ల్గొ­నడానికి ఎవరికీ అనుమతి లేదని, అందు­వల్ల ఎవ­రూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నా­రు. వైఎస్‌ జగన్‌ గురువారం (నేడు) నెల్లూరులో పర్య­టించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 

అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగా­రం వద్దకు వెళతారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్‌ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

వైఎస్‌ జగన్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్‌ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. 

హెలిప్యాడ్‌ వద్ద 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement