
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోవడం వ్యర్థమని.. నేరుగా జీఓలే ఇచ్చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. సింగపూర్ పర్యటన అనంతరం గురువారం ఆయన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. లులుకు ఆర్టీసీ స్థలం ఇవ్వడంలోగానీ.. అలాగే, 99 పైసలకే భూమి కేటాయింపు చేయడంలోగానీ తప్పులేదన్నారు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు.