breaking news
rtc lands
-
లీజుకు ఆర్టీసీ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ జిల్లాల్లో ఉన్న భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి విలువైన ప్రాంతాల్లో భూములున్నాయి. వాటిల్లోంచి ప్రస్తుతం 22 ప్రాంతాల్లో ఉన్న 65 ఎకరాల భూములను తాజాగా లీజు కోసం టెండర్ నోటిఫికేషన్లో పేర్కొంది. నగర శివారులోని తుర్కయాంజాల్, శంషాబాద్ సమీపంలోని రషీద్పురా, శామీర్పేట, హకీంపేట, కరీంనగర్, ఖమ్మం, వనపర్తి, గద్వాల సహా మొత్తం 22 ప్రాంతాల్లో ఈ భూములున్నాయి. నెలకు రూ.85 లక్షల ఆదాయం వస్తుందని అంచనా.. ముఖ్య ప్రాంతాల్లోని చిన్నచిన్న బిట్లను గతంలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు కేటాయించింది. కొన్ని పెద్ద భూములను షాపింగ్మాల్లాంటి వాటికి ఇచ్చింది. అయితే, అవి పరిమితంగానే ఉన్నాయి. మిగతా భూములను భవిష్యత్ అవసరాల దృష్ట్యా తన వద్దే ఉంచుకుంది. గతంలో ఓ పర్యాయం ప్రభుత్వం ఈ భూములను అమ్మి నిధులు సమీకరించబోతోందన్న వార్తలు వెలువడ్డాయి. భూములను అమ్మడమంటే, త్వరలో సంస్థను ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నట్టేనని ఆరోపిస్తూ కారి్మక సంఘాలు ఆందోళనకు దిగాయి. భూములను అమ్మే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశాయి. ఆర్టీసీ స్థలాలను అమ్మే ఆలోచన తనకు లేదని ఆ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఇంతకాలం తర్వాత ఆ భూముల్లో కొన్నింటిని లీజుకు ఇవ్వాలని టెండర్లు పిలిచింది.ఈ లీజు ద్వారా ఆర్టీసీకి నెలకు రూ.65 లక్షల నుంచి రూ.85 లక్షలు సమకూరుతాయని అంచనా వేస్తోంది. ఆర్టీసీకి ప్రస్తుతం రోజువారీ ఆదాయం బాగా పెరిగింది. మహాలక్ష్మి పథకం రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం ఠంచన్గా సంస్థకు చెల్లిస్తే, సంస్థ కొంతమేర లాభాల్లోకి చేరుకుంటుంది. గతంలో ఉన్న నష్టాలను దాదాపు అధిగమించినట్టయ్యింది. అయితే, పెద్దమొత్తంలో పేరుకుపోయిన బకాయిలు, అప్పులు, వాటిపై వడ్డీలు చెల్లించేందుకు మాత్రం ఈ ఆదాయం సరిపోదు. ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో కూడా ఎలాంటి కేటాయింపులు లేనందున కచ్చితంగా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందఇటీవల రూ.400 కోట్ల అప్పు తీసుకుంది. ఈ తరుణంలో అదనపు ఆదాయం సమకూరితే కొన్ని బకాయిలు తీర్చేందుకు కొంతమేర ఉపయోగంగా ఉంటుందని సంస్థ భావి స్తోంది. ఈ భూములకు ఎంత ధర నిర్ణయించవచ్చో తేల్చేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యత అప్పగించింది. ఆ సంస్థ ఇచ్చిన ధరలనే ఖరారు చేస్తూ టెండర్లు పిలిచింది. దానికంటే ఎక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలు, వ్యక్తులకు ఆ భూములను కేటాయించనున్నారు. రాజకీయ నేతల చేతుల్లోకి చేరితే.. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత కీలక ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ భూమిని లీజుకు తీసుకొని బడా షాపింగ్ మాల్ నిర్మించి ఆదాయాన్ని పొందుతూ సంస్థకు మాత్రం లీజు మొత్తాన్ని చెల్లించకుండా బకాయిపెట్టారు. ఎన్నిమార్లు నోటీసులు జారీ చేసినా లీజు చెల్లించకుండా మొండికేశారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ ప్రయతి్నంచగా రాజకీయంగా ఉ న్న పలుకుబడితో అది కుదరకుండా చేశారు.చివరకు ఇటీవల సంస్థ దూకుడుగా వ్యవహరించటంతో దిగివచ్చాడు. ఇప్పుడు లీజుకు ఇచ్చే భూములను అలాంటి నేతల చేతుల్లోకి చేరకుండా సంస్థ జాగ్ర త్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాటి వల్ల ఆదాయం రాకపోగా, తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవటం కూడా ఆ ర్టీసీకి కష్టంగా మారుతుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. -
ఆర్టీసీ స్థలం ఇవ్వడం తప్పుకాదు: నారా లోకేశ్
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోవడం వ్యర్థమని.. నేరుగా జీఓలే ఇచ్చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. సింగపూర్ పర్యటన అనంతరం గురువారం ఆయన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. లులుకు ఆర్టీసీ స్థలం ఇవ్వడంలోగానీ.. అలాగే, 99 పైసలకే భూమి కేటాయింపు చేయడంలోగానీ తప్పులేదన్నారు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. -
మంత్రి గంటాపై మరో మంత్రి అయ్యన్న చిందులు
-
ప్రభుత్వ స్థలాలను అప్పనంగా కొట్టేస్తున్న ఎమ్మెల్యే
-
కబ్జా కోరల్లో..
సాక్షి, కామారెడ్డి: ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్టీసీకి అక్షరాలా రూ. వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 19 బస్టాండ్లకు 54 ఎకరాల స్థలం ఉంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ. 4 వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అలాగే నిజామాబాద్ జిల్లాలో 28 బస్టాండ్లకు 83.09 ఎకరాల స్థలం ఉంది. దీని విలువ రూ. 600 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. తమకు రవాణా సౌకర్యం కోసం ప్రజలు కొన్నిచోట్ల ఉదారంగా భూములు ఆర్టీసీకి అందివ్వగా, మరికొన్ని చోట్ల కొనుగోలు చేసి ఇచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మండలానికో బస్టాండ్ నిర్మించారు. అప్పుడు ప్రజలు బస్టాండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను సమకూర్చారు.దీంతో 1985 నుంచి 1990 మధ్య కాలంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం’ పేరుతో ప్రభుత్వం బస్టాండ్లను నిర్మించింది. అయితే ప్రజలు ఆర్టీసీకి అప్పగించిన భూములకు సంబంధించి రికార్డుల నిర్వహణలో ఆర్టీసీ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా చాలా చోట్ల ఆ స్థలాలు వివాదాల్లోకి వెళ్లాయి. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని బస్టాండ్ల స్థలాలు ఆర్వోఆర్లో రికార్డు కాలేదని తెలుస్తోంది. అడ్డగోలుగా ఆక్రమణలు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పక్కా నిర్మాణాలు చేసుకుని దర్జాగా నివాసం ఉంటున్నారు. మరికొన్ని చోట్ల దుకాణాలు ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. కామారెడ్డి పట్టణంలో రూ. కోట్ల విలువైన డిపో స్థలంపై కొందరు కన్నేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణలు చేయడానికి పలుమార్లు ప్రయత్నించారు. ఇప్పటికే కొంత భూమి ఆక్రమణకు గురైంది. రూ. కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి రాజకీయ అండతో కొందరు కోర్టులను ఆశ్రయించారు. బస్టాండ్కు సంబంధించిన స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేశారు. నిజామాబాద్ నగరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి పట్టణాల్లో విలువైన ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. స్థలాలకు ప్రహరీ నిర్మించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి. లింగంపేట, తాడ్వాయి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, జక్రాన్పల్లి, సదాశివనగర్, గాంధారి, పిట్లం, నవీపేట్, నందిపేట్, కమ్మర్పల్లి, మోర్తాడ్, భీంగల్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి తదితర మండల కేంద్రాల్లో ఆర్టీసీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. పట్టించుకోని అధికారులు తమ పరిధిలోని ఆర్టీసీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువైన ఆస్తులను కాపాడాలన్న కనీస ప్రయత్నమూ చేయడం లేదు. డిపో మేనేజర్లు తమ పరిధిలోని ఆర్టీసీ ఆస్తులకు రక్షకుడిగా నిలవాలి. స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరైనా కబ్జా చేస్తున్నారా, వాటిని ఎలా రక్షించుకోవాలన్న విషయాలను కార్మిక సంఘాల నేతలతో అవసరం అయితే ప్రజాప్రతినిధులతో, ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏ అధికారి కూడా స్థలాలను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. ప్రహరీలతో రక్షణ పట్టణాలు, మండల కేంద్రాల్లో ఊరి మధ్యలో ఉన్న ఆర్టీసీ స్థలాలకు ప్రహరీలు నిర్మిస్తే స్థలాలను కాపాడుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 47 చోట్ల ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయి. ఒక్కో చోట ప్రహరీ నిర్మాణానికి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు చేస్తే రూ. కోట్ల విలువైన భూములను కాపాడుకోవచ్చు. కబ్జాల చెరనుంచి ఆర్టీసీ స్థలాలను విడిపించి, వాటికి రక్షణగా గోడలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. బస్టాండ్లకు విలువైన స్థలాలు జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో అప్పట్లో ఊళ్లకు దూరంగా బస్టాండ్లను నిర్మించారు. పట్టణాలు, గ్రామాలు విస్తరించడంతో ఇప్పుడు అన్నిచోట్ల బస్టాండ్ల చుట్టూ ఇళ్లు నిర్మితమయ్యాయి. దీంతో అక్కడ భూముల విలువ అడ్డగోలుగా పెరిగింది. కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో గజం భూమి విలువ రూ. లక్షన్నరకు పైమాటే.. నిజామాబాద్ నగరంలో గజం విలువ రూ. 2 లక్షలు పలుకుతోంది. గాంధారిలో బస్టాండ్ ప్రాంతంలో గజానికి రూ. లక్షకుపైనే.. ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర పట్టణాల్లో గజం భూమి విలువ రూ. 50 వేలపైనే పలుకుతోంది. మారుమూల మండలాల్లో సైతం గజం భూమి విలువ రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. నిజామాబాద్ జిల్లాలో... నిజామాబాద్ 10.35 ఆర్మూర్ 11.16 బోధన్ 12.12 నవీపేట 2.04 నందిపేట 7.16 కమ్మర్పల్లి 2.02 భీంగల్ 7.31 జలాపూర్ 5 డిచ్పల్లి 1.35 జాన్కంపేట 1.23 మాక్లూర్ 1.39 ఇందల్వాయి 2.03 మోర్తాడ్ 2.01 ఎడపల్లి 1.16 వర్ని 1.20 కోటగిరి 1.20 బాల్కొండ 1.07 వేల్పూర్ 1.19 సిరికొండ 1.36 ధర్పల్లి 2 రెంజల్ 1.07 జక్రాన్పల్లి 1.27 పడకల్లో 4 గుంటలు, రుద్రూర్లో 10 గుంటలు, పెర్కిట్లో 26 గుంటల భూమి ఉంది. -
లీజుకు ఆర్టీసీ స్థలాలు
హైదరాబాద్: ఆర్టీసీ సంస్థకు చెందిన ఖాళీగా ఉన్న 69 స్థలాలను ఆయిల్ కంపెనీలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. 357 బస్ స్టేషన్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆర్టీసీకి చెందిన మరో 150 స్థలాలను గుర్తించి అదనపు ఆదాయం కోసం కృషి చేస్తున్నామన్నారు.