
తొలిదశలో 22 ప్రాంతాల్లోని 65 ఎకరాల గుర్తింపు
వాటి కేటాయింపునకు టెండర్లు పిలిచిన సంస్థ
సాక్షి, హైదరాబాద్: వివిధ జిల్లాల్లో ఉన్న భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి విలువైన ప్రాంతాల్లో భూములున్నాయి. వాటిల్లోంచి ప్రస్తుతం 22 ప్రాంతాల్లో ఉన్న 65 ఎకరాల భూములను తాజాగా లీజు కోసం టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నగర శివారులోని తుర్కయాంజాల్, శంషాబాద్ సమీపంలోని రషీద్‌పురా, శామీర్‌పేట, హకీంపేట, కరీంనగర్, ఖమ్మం, వనపర్తి, గద్వాల సహా మొత్తం 22 ప్రాంతాల్లో ఈ భూములున్నాయి.
నెలకు రూ.85 లక్షల ఆదాయం వస్తుందని అంచనా..
ముఖ్య ప్రాంతాల్లోని చిన్నచిన్న బిట్లను గతంలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు కేటాయించింది. కొన్ని పెద్ద భూములను షాపింగ్‌మాల్‌లాంటి వాటికి ఇచ్చింది. అయితే, అవి పరిమితంగానే ఉన్నాయి. మిగతా భూములను భవిష్యత్ అవసరాల దృష్ట్యా తన వద్దే ఉంచుకుంది. గతంలో ఓ పర్యాయం ప్రభుత్వం ఈ భూములను అమ్మి నిధులు సమీకరించబోతోందన్న వార్తలు వెలువడ్డాయి. భూములను అమ్మడమంటే, త్వరలో సంస్థను ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నట్టేనని ఆరోపిస్తూ కారి్మక సంఘాలు ఆందోళనకు దిగాయి. భూములను అమ్మే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశాయి. ఆర్టీసీ స్థలాలను అమ్మే ఆలోచన తనకు లేదని ఆ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఇంతకాలం తర్వాత ఆ భూముల్లో కొన్నింటిని లీజుకు ఇవ్వాలని టెండర్లు పిలిచింది.
ఈ లీజు ద్వారా ఆర్టీసీకి నెలకు రూ.65 లక్షల నుంచి రూ.85 లక్షలు సమకూరుతాయని అంచనా వేస్తోంది. ఆర్టీసీకి ప్రస్తుతం రోజువారీ ఆదాయం బాగా పెరిగింది. మహాలక్ష్మి పథకం రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం ఠంచన్‌గా సంస్థకు చెల్లిస్తే, సంస్థ కొంతమేర లాభాల్లోకి చేరుకుంటుంది. గతంలో ఉన్న నష్టాలను దాదాపు అధిగమించినట్టయ్యింది. అయితే, పెద్దమొత్తంలో పేరుకుపోయిన బకాయిలు, అప్పులు, వాటిపై వడ్డీలు చెల్లించేందుకు మాత్రం ఈ ఆదాయం సరిపోదు. ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో కూడా ఎలాంటి కేటాయింపులు లేనందున కచ్చితంగా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంద
ఇటీవల రూ.400 కోట్ల అప్పు తీసుకుంది. ఈ తరుణంలో అదనపు ఆదాయం సమకూరితే కొన్ని బకాయిలు తీర్చేందుకు కొంతమేర ఉపయోగంగా ఉంటుందని సంస్థ భావి స్తోంది. ఈ భూములకు ఎంత ధర నిర్ణయించవచ్చో తేల్చేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యత అప్పగించింది. ఆ సంస్థ ఇచ్చిన ధరలనే ఖరారు చేస్తూ టెండర్లు పిలిచింది. దానికంటే ఎక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలు, వ్యక్తులకు ఆ భూములను కేటాయించనున్నారు.
రాజకీయ నేతల చేతుల్లోకి చేరితే..
గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత కీలక ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ భూమిని లీజుకు తీసుకొని బడా షాపింగ్ మాల్ నిర్మించి ఆదాయాన్ని పొందుతూ సంస్థకు మాత్రం లీజు మొత్తాన్ని చెల్లించకుండా బకాయిపెట్టారు. ఎన్నిమార్లు నోటీసులు జారీ చేసినా లీజు చెల్లించకుండా మొండికేశారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ ప్రయతి్నంచగా రాజకీయంగా ఉ న్న పలుకుబడితో అది కుదరకుండా చేశారు.
చివరకు ఇటీవల సంస్థ దూకుడుగా వ్యవహరించటంతో దిగివచ్చాడు. ఇప్పుడు లీజుకు ఇచ్చే భూములను అలాంటి నేతల చేతుల్లోకి చేరకుండా సంస్థ జాగ్ర త్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాటి వల్ల ఆదాయం రాకపోగా, తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవటం కూడా ఆ ర్టీసీకి కష్టంగా మారుతుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.