ఏయ్‌.. నేను ఎవర్నో తెలుసా?.. కానిస్టేబుల్‌పై కూటమి మంత్రి సోదరుడి దాడి | BC Janardhan Reddy Brother Slaps Constable | Sakshi
Sakshi News home page

ఏయ్‌.. నేను ఎవర్నో తెలుసా?.. కానిస్టేబుల్‌పై కూటమి మంత్రి సోదరుడి దాడి

Jul 31 2025 3:47 PM | Updated on Jul 31 2025 4:33 PM

BC Janardhan Reddy Brother Slaps Constable

సాక్షి,నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు.  ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బంధువు బీసీ మదన భూపాల్‌రెడ్డి దాడి చేశారు.కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలంటూ బీసీ మదన భూపాల్‌ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.

సెక్యూరిటీ రిత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదంటూ స్పెషల్‌ పార్టీ పోలీసులు మదన భూపాల్‌రెడ్డి, అతని అనుచరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు చెబితే లోపలికి పంపిస్తానని అన్నారు. అయితే తాను బీసీ జనార్ధన్‌రెడ్డి సోదరుడినని,నన్నే ఆపుతావా? అంటూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కాగా,రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాల సంస్కృతి దేవాలయాలకు చేరడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. డ్యూటీలో ఉన్న పోలీసులపై అధికార పార్టీకి చెందిన నాయకుడి సోదరుడు నేరుగా దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

కానిస్టేబుల్ పై మంత్రి జనార్ధన్ రెడ్డి బంధువు మదన భూపాల్రెడ్డి దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement