breaking news
Nandyala municipal council
-
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?.. కానిస్టేబుల్‌పై కూటమి మంత్రి సోదరుడి దాడి
సాక్షి,నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బంధువు బీసీ మదన భూపాల్‌రెడ్డి దాడి చేశారు.కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలంటూ బీసీ మదన భూపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.సెక్యూరిటీ రిత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదంటూ స్పెషల్ పార్టీ పోలీసులు మదన భూపాల్‌రెడ్డి, అతని అనుచరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు చెబితే లోపలికి పంపిస్తానని అన్నారు. అయితే తాను బీసీ జనార్ధన్‌రెడ్డి సోదరుడినని,నన్నే ఆపుతావా? అంటూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా,రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాల సంస్కృతి దేవాలయాలకు చేరడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. డ్యూటీలో ఉన్న పోలీసులపై అధికార పార్టీకి చెందిన నాయకుడి సోదరుడు నేరుగా దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. -
నల్లబ్యాడ్జీలతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల నిరసన
కర్నూలు: నంద్యాల మున్సిపల్ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై వేధింపులను ఖండిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు కౌన్సిల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గుర్తింపు కార్డులు లేనివారిని పోలీసులు సమావేశానికి అనుమతించలేదు. కౌన్సిల్ ఛైర్మన్ దేశం సులోచన హాజరయ్యారు. కాగా ఈ నెల 18న చైర్మన్‌పై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చైర్మన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారా...లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సులోచన, శిల్పా మోహనరెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు చేసినా, వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్యాయత్నం కేసులు ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయరని వారు ప్రశ్నిస్తున్నారు.