breaking news
-
మంత్రి పదవులే ముద్దు!
సాక్షి, అమరావతి: చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి కోరుతుండడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కొత్తగా కొందరు సీనియర్లను క్యాబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని చాలా రోజులుగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పనితీరు మార్చుకోకపోతే పదవుల నుంచి తప్పిస్తానని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఏడాదిగానే ప్రతిపక్షం మరింత చురుగ్గా వ్యవహరిస్తోందని, వైఎస్సార్సీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నామని, ఈ విషయంలో మంత్రులు విఫలమవుతున్నారనే అభిప్రాయం చంద్రబాబులో బలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా రాయించడం, వ్యతిరేక వార్తలు ప్రసారం చేయించడం ద్వారా బురద చల్లడం మినహా మంత్రులెవరూ విపక్షాన్ని ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని భావించారు. అయితే ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. ఇక డిప్యూటీ స్పీకర్ హోదాలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన రఘురామ నేరుగా కొన్ని టీవీ ఛానళ్ల డిబేట్లలో పాల్గొంటూ తనకు ఆ రూలు వర్తించదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు లోకేష్ అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాది అని.. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చిని లాక్కోవాలని చూస్తున్నారనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయంటూ దెప్పి పొడిచారు.పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అంటూ ఎత్తిచూపారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరికొంత మంది పోలీసులు.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పన్నాగాన్ని సాక్ష్యాధారాలతో వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచి్చంది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.⇒ ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లి వారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.⇒ ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు.పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేరి్పంచారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.⇒ తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపైనే తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింత మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.⇒ ఆగస్టు 8న వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమ వైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని.. తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ⇒ అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు.. ఆగస్టు 8న వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4 వేల మంది ఓటర్లను, పక్కా వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు.వీళ్లు ఓటేయడానికి వెళ్లకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడటం.. ఈ మాదిరి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్నది టేబుల్లో పరిశీలించగలరు.)⇒ నల్లగొండువారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే ఆగస్టు 8వ తేదీ రాత్రి ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంత మంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెబుతున్న సమయంలో బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్‌లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు.అయినా వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వీరిని వదిలి పెట్టాల్సి వచి్చంది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.⇒ ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారు. వారిపైనా దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు..ఈసీ ఆదేశాలూ టీడీపీ బేఖాతర్
సాక్షి,వైఎస్సార్: జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్టవేశారు. హరిత హోటల్ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మకాం వేశారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు హరిత హోటల్ వేదికగా కుట్ర రాజకీయాల్ని నెరుపుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, హోటల్ యాజమాన్యం, స్థానిక పోలీసుల మద్దతుతో కూటమి నేతలు అక్కడే ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘జగన్ అంటే చంద్రబాబు ఎంత భయపడుతున్నారో అనడానికి ఇదే నిదర్శనం’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి సీఎం చంద్రబాబు ఎంత భయపడిపోతున్నారో ప్రస్తుతం ఓ చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చిన్న ఎన్నికకు జగన్ అంటే సీఎం చంద్రబాబు ఎంత భయపడుతున్నారో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. టీడీపీ నేతల దాడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. మా నేతలపై దాడి చేసినా ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదు. తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించటం లేదు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం. దాడులకు గురైన వారిపైనే రిటర్న్ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గం. పులివెందుల జెడ్పీటీసీ సెగ్మెంట్ లో గెలిచి ఆధిపత్య రాజకీయాలు చూపించాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలు జరుగుతుంది వైఎస్సార్సీపీకి కూటమికి మాత్రమే కాదు. వైసీపీకి పోలీసులకు.. వైసీపీకి ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది..సీఎం స్థాయిలో కూర్చున్న వ్యక్తి జెడ్పీటీసీ ఎన్నికను పర్యవేక్షించటం చంద్రబాబు హయంలోనే మొదలైంది..డీజీపీ కార్యాలయానికి వెళ్తే పోలీసులను పెట్టి ఆపిస్తున్నారు. డీజీపీ రాష్ట్రానికా.. టీడీపీ కా?, ప్రజా ప్రతినిధులు వస్తే ఔట్ వార్డులో ఇచ్చి వెళ్ళమంటారా?, ఎస్సీ నేతలమని మాపై డీజీపీ వివక్ష చూపిస్తున్నారు. కనీసం ఒక్క అధికారి కూడా రాలేదు. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్ళినా.. డీజీపీ కార్యాలయానికి వెళ్ళినా ఇదే తంతు జరుగుతుంది. చంద్రబాబు దృష్టిలో పడాలని అధికారులు పోటీలు పడుతున్నారు. మార్చిన పోలింగ్ కేంద్రాలు యధాస్థానంలో ఉంచాలి. మేము ఓడిపోతామనే భయంతో మాట్లాడటం లేదు.ఎన్నికల సంఘానికి ఇది శల్య పరీక్ష అని గుర్తుంచుకోవాలి. మా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి. హైకోర్టు ఆదేశాలు పాటించాలి’ అని సూచించారు. -
చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేసే వ్యక్తి కాదని జగన్ దుయ్యబట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘చంద్రబాబు కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్ను పోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు’ అని జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాల్ని వైఎస్ జగన్ ట్వీట్ రూపంలో ప్రస్తావించారు. .@ncbn అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే… pic.twitter.com/MaZrGo174C— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2025 1. పులివెందుల, ఒంటిమిట్ట ZPTCల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందలమంది వైయస్సార్సీపీ, నాయకులను కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్నవారిని, ప్రచారంచేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.2. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడిచేశాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికిదిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.3. ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ MLC రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్యచేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లెవద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు,రాళ్లు, రాడ్లతో దాడిచేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కార్ని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నంకూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్రగాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈరకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.4. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6, మధ్యాహ్నం 3.30గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడిచేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముసహా మరొక 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ మరియు హత్యాయత్నం కేసుపెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింతమంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.5. ఆగస్టు8, వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడ్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమవైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని, తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైయస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీచేశారు.6. ఆగస్టు8: అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైయస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు4వేల మంది ఓటర్లను, పక్కా వైయస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందినవారిని ఈ రకంగా ఇబ్బందిపెట్టి, వీళ్లు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడ్డం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డం, చంద్రబాబుగారు ఈమాదిరి కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్న టేబుల్‌ను అటాచ్ మెంట్లో ఉంది. పరిశీలించగలరు)7. ఆగస్టు8 రాత్రి, నల్లగొండువారిపల్లెవద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీకేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్లు బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్‌లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అయినా వారిమీదకూడా ఎస్సీ, ఎస్టీకేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వీరిని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.8. ఇక ఎన్నికల పోలింగ్ రోజున, ఓటింగ్ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడిచేస్తున్నారు. వారిపై దాడులకూ సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసంచేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి.అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
పులివెందులలో టీడీపీ అరాచకాలు.. డీజీపీ ఆఫీస్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై తక్షణం స్పందించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం ఆదివారం.. డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. గత నాలుగు రోజులుగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, అందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు.దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో పోలీసులు ఇంతగా అధికారపార్టీకి లొంగిపోయి, చట్టాలనే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీ ఇప్పటికైనా స్పందించి, ప్రజాస్వామ్య రక్షణకు, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా పార్టీ నేతలు వినతిపత్రంలో కోరారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా పోలీసుల తీరు: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉంది. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒకవైపు, కూటమి పార్టీలు మరోవైపు పోటీ చేస్తున్నాయి. కానీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు చూస్తుంటే, పోటీ కూటమి పార్టీలతో కాదు, పోలీసులతోనే అని అర్థమవుతోంది.పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారు. దాడులకు గురైన మా పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తారు. బైండోవర్ పేరుతో ప్రతిరోజూ స్టేషన్లో గంటల తరబడి నిర్బంధిస్తారు. దాడులకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకు పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు. ఇదీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిస్తే, అది పోలీసులు గెలిచినట్లుగా భావించాలి. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి గురించి వినలేదు.డీజీపీ ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి.. పోలీస్ విభాగం అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్లా పనిచేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్షంగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కూడా డీజీపీ నుంచి సమయం ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు? ఎవరి ఒత్తిడితో డీజీపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతినిధి బృందం నుంచి కనీసం స్వేచ్ఛగా వినతిపత్రంను కూడా తీసుకోలేని నిస్పహాయ స్థితిలో ఉన్నారు? మరోవైపు ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను కిలోమీటర్ల దూరంలోని వేరే గ్రామాలకు మార్చేశారు. ఓటర్లు ఏ ధైర్యంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? పోలీసులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకునే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును టీడీపీ గూండాలు కాలరాస్తుంటే, పోలీసులు వారికి అండగా నిలబడటం దారుణం. ఇప్పటికైనా డీజీపీ కళ్లు తెరవాలి.రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పోలీస్ టోపీపై కనిపించే మూడు సింహాలు నీతీ, నిజాయితీ, ధైర్యం కు మారుపేరు అని ఇప్పటి వరకు ప్రజలు భావిస్తూ వచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీతో పోలీసులు కుమ్మక్కై అరాచక శక్తులకు అండగా నిలుస్తున్న వైనంను చూసిన తరువాత వారి టోపీపై కనిపిస్తున్నవి టీడీపీ, జనసేన, బీజేపీలు మాత్రమే. ఖాకీ యూనిఫారం తీసేసి, పచ్చచొక్కాలతో పోలీసులు పనిచేస్తున్నారు. పులివెందుల్లో జరిగే చిన్న ఎన్నికల్లో ఒక పెద్ద యుద్దంగా మార్చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, పోలీసులు నిర్భందంలోకి తీసుకుంటున్నారు. మరోవైపు నేరుగా టీడీపీ గూండాలు నామినేషన్ వేసిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఒక ఎమ్మెల్సీగా ఉన్న నాపైనే నేరుగా దాడిచేసి, హతమార్చేందుకు ప్రయత్నించారంటేనే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న నాకే రక్షణ లేని పరిస్థితి ఉంటే, ఒక ప్రతిపక్షంలోని కార్యకర్తల పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీకి బీసీలంటేనే చాలా చులకనభావం. ప్రతిపక్షంకు చెందిన మాజీ మంత్రి విడతల రజిని, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక, ఇప్పుడు నాపైన జరిగిన దాడులే దీనికి నిదర్శనం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే దానికి కూడా సరైన విధంగా స్పందించకపోవడం దారుణం. చట్టాన్ని కాపాడే స్థానంలో ఉన్న వారే చట్టాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే మాటకే విలువ ఉండదు. రాజ్యాంగ స్పూర్తిని నీరుగారుస్తున్నారు: మేరుగు నాగార్జునపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నంచి టీడీపీకి చెందిన వారు దాడులు, దౌర్జన్యాలతో మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం పాలు చేసేలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పులివెందుల్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉప ఎన్నికలో స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను, కార్యకర్తలను కూడా భయబ్రాంతులకు గురి చేసేందుకు తెగబడ్డడారు.ఈ నెల అయిదో తేదీన ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులుపై కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్ళతో పది వాహనాల్లో వచ్చిన టీడీపీ అరాచక శక్తులు దాడికి పాల్పడ్డాయి. ఏకంగా వారి వాహనాలపై పదిలీటర్ల పెట్రోల్ కుమ్మరించి వారిని సజీవంగానే దహనం చేసే దారుణానికి సిద్ధపడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములు గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వద్దకు వెళితే ఆయన కూడా పట్టించుకోలేదు. దీనిపై చట్టప్రకారం పోలీసులు వ్యవహరించేలా చూడాలని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.ఆయన దీనిపై స్పందిస్తూ పత్తేపారం కోసం ఆ గ్రామానికి వెళ్ళారా... మేం ఉండబట్టే తలలు పగిలాయి, లేకపోతే తలలు తెగిపోయేవే' అంటూ చాలా హేళనగా మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ పచ్చచొక్కాలు వేసుకున్న వారిలా అధికారపార్టీకి అండగా నిలబడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని పోలీస్ వ్యవస్థే నీరుగారుస్తోంది. పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడా భయపడకుండా ముందుకు సాగుతుంటే, దానిని కూడా సహించలేక ఎవరైతే మాపైన దాడుల చేశారో వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని, బాధితులైన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ అరాచకానికి, పోలీస్ వ్యవస్థ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషంగా చంద్రబాబు పాలన సాగుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.పులివెందులలో టీడీపీ దౌర్జన్యం: మల్లాది విష్ణుమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పులివెందులలో టీడీపీ దౌర్జన్యం చేసి హింసను ప్రోత్సహిస్తోంది. మా నాయకులపై బైండోవర్లు పెట్టించారు. పోలింగ్ స్టేషన్లు నాలుగు కిలోమీటర్ల దూరానికి మార్చేశారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని టీడీపీ చూస్తోంది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ దిగజారిపోయి వ్యవహరిస్తోంది. కర్రలు, రాళ్లు, కత్తులు పట్టుకుని రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసుల తీరు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టంమవుతోందిటీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలపై రివర్స్‌లో కేసులు పెడుతున్నారు. ఈ మొత్తం తతంగానికి బాస్ డీజీపీనే. బాధితులపైనే తిరిగి కేసులు పడుతున్నారు. పోలీసుల తీరును న్యాయ స్థానాలు తప్పుపడుతున్నా వారు మారడం లేదు. పులివెందులలో మంత్రులకు,ఇతర ఎమ్మెల్యేలకు పనేంటి?. బయటి ప్రాంతాల నుంచి పులివెందులలో తిష్టవేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలను తక్షణమే పులివెందుల నుంచి బయటికి పంపించాలి. సత్వరమే డీజీపీ చర్యలు తీసుకోవాలి. డీజీపీ వాట్సాప్ నెంబర్‌కు కూడా మా ఫిర్యాదును పంపిస్తాం. టీడీపీ రౌడీయిజం, గూండాయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత డీజీపీ పైన ఉంది.చంద్రబాబు పతనానికి ఇది నాంది: మేయర్ భాగ్యలక్ష్మివిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మేమేమీ సంఘ విద్రోహ శక్తులం కాదు. మేం ప్రజాప్రతినిధులం. డీజీపీ కార్యాలయంలోకి మమ్మల్ని పంపించడానికి సమాలోచనలు చేయడమేంటి?. మేం చెప్పులరిగేలా ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నాం. మాట్లాడితే నేను 40 ఏళ్ల సీనియర్‌నంటూ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. పులివెందుల ఎన్నికల్లో ఇంతలా దిగజారిపోవాలా?. చంద్రబాబు పతనానికి ఇది నాంది గుర్తుంచుకోండి. -
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. చివరికి అరాచకానికి కూడా తెరలేపింది. ఉప ఎన్నిక గండం గట్టెక్కేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలు బట్టబయలవుతున్నాయి.ఓటర్ల జాబితా గందరగోళంగా తయారైంది. గతంలో వేసిన పోలింగ్ బూత్‌లను మార్చేసిన అధికారులు.. గ్రామాల్లో ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేయలేదు. మొత్తం 15 పోలింగ్ బూత్‌లలోనూ ఓటర్ల జాబితా జంబ్లింగ్ జరిగింది. ఓటింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ నేతలు కుట్రల చేస్తున్నారు.సరిగ్గా 8 ఏళ్ల క్రితం జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేతగా.. సీఎంగా చంద్రబాబు లెక్కలేనన్ని కుట్రలు పన్నారు. వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కారు. మోసపు హామీలెన్నో ఇచ్చారు. ఓటర్లకు తాయిలాల ఆశ చూపెట్టారు... వినకుంటే బెదిరించారు. తాజా గా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే ఫార్మూలాను అమలు చేస్తున్నారు. వందలాది మందికి ఉద్యోగ జాయినింగ్ లెటర్లు ఇస్తున్నారు. వేలాది మందికి ఏవేవో ఆఫర్లు ఇస్తున్నారు. అయినప్పటీకీ ఇవేవి పనిచేసేలా లేవని ఏకపక్ష పోలింగ్ కోసం చేపట్టాల్సిన చర్యలన్నీ ఎంచుకున్నారు. అదీ కూడా కుదరదంటే ఏకంగా బ్యాలెట్ బాక్సులే మారుస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు.పులివెందుల జెడ్పీటీసీ సీటు ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామంటూ .. టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉద్యోగం కావాలా? జాయినింగ్ లెటర్ రెడీ ఎన్నికల తర్వాత మీ బిడ్డల్ని ఉద్యోగంలో చేర్పించండి. లేదు డబ్బులు కావాలా? గుంప గుత్తగా ఎంతో చెప్పండి ఇస్తాం. అలా కాదంటారా...ఓటుకు వెళ్లొద్దు ఇదో ఇది ఉంచుకోండి. ఇంకా కాదు కూడదంటే బడితె పూజ తప్పదు.. ఇలా పులివెందులలో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో బరి తెగిస్తున్నారు. కుదిరితే ప్రలోభాలతో.. కాదంటే బెదిరింపులతో ముందుకు సాగుతున్నారు.వైఎస్సార్సీపీకి చెందిన క్రియాశీలక నేతలందర్నీ కట్టడి చేసే ఎత్తుగడను టీడీపీ ఎంచుకుంది. అందుకు వ్యవస్థలు అనుకూలంగా నిలుస్తున్నాయి. పోలింగ్ జనరల్ ఏజెంటు కూడా క్రియాశీలక నేతకు ఇవ్వకూడదనే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి పోలింగ్ జనరల్ ఏజెంటుగా నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. ఆమేరకు అనెగ్జర్–15, ఫారం–11కు ఒరిజనల్ ఆధార్, ఓటరు కార్డు జత చేశారు. శనివారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు లెటర్ పెట్టుకున్నారు.దీనికి కూడా టీడీపీ నేతల నుంచి క్లియరెన్సు వస్తే తప్ప ఇవ్వమనే దిశగా అధికారులు బాహాటంగా వ్యాఖ్యనిస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు, వ్యవస్థలు అండతో గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. వరుస హత్యాయత్నం ఘటనలతో ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న నేపఽథ్యంలో టీడీపీ కేవలం వ్యవస్థల ఆధారంగా పోలింగ్ నిర్వహించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
కూటమి అరాచకం.. ప్రజలే బుద్ధి చెబుతారు: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, తిరుమల: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు.. ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయబాంత్రులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.వైఎస్సార్సీపీ కడప అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలు కూడా పండటం లేదు. సూపర్ సిక్స్ దొంగ హామీలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలు ఆశపడి ఓట్లు వేశారు. 2029లో మళ్లి వైఎస్ జగన్ గెలవాలని కోరుకుంటున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్దంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు.. ప్రజలను, వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఓట్లు వేయడానికి లేకుండా, దొంగకేసులు పెట్టి భయబ్రాంతులకు చేస్తున్నారు.పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో 10,500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగు వేల ఓట్లకుపైగా నల్లపురెడ్డి పల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబల్లెకు సంబంధించి ఓట్లను తారుమారు చేస్తున్నారు. ఓ ఊరిలో 700 ఓట్లు ఉంటే నాలుగు.. ఐదు కిలోమీటర్ల దూరంలో బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లి ఓటు వేసే విధంగా చర్యలు తీసుకొన్నారు. ఓటింగ్ శాతం తక్కువ కావడానికి దారుణాలకు కూటమి ప్రభుత్వం ఒడిగడుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. వైఎస్ జగన్ గతంలో అనుకుంటే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే వాళ్లు కాదు. నామినేషన్ కూడా వేసి ఉండరు. కానీ, నేడు కూటమి పాలన అరాచక పాలన చేస్తుంది. కూటమి అరాచక పాలనపై కోర్టును ఆశ్రయిస్తాం. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. ఈ పద్దతి మార్చుకుంటే మంచిది. లేకుంటే చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
అనంతపురంలో ‘పచ్చ’ రౌడీల బీభత్సం..
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్‌లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.దుకాణం వద్ద అరాచకం..సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్‌లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్‌కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
కుట్రలందు కూటమి కుట్రలు వేరయా!
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో వైఎస్సార్సీపీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ కూటమి నాయకులు అన్ని రకాల కుట్రలూ పన్నుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా పులివెందులలో జరుగుతోంది ఎన్నికల కార్యక్రమం కాదని, దాడులు, హింస, రక్తపాతం జరుగుతోందన్నారు.పోలీసులతో తప్పుడు కేసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, చివరికి రిగ్గింగ్ కూడా ఉండబోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ నేతలు రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డిలతోపాటు మరో 50మందిపై అట్రాసిటీ, 307 సెక్షన్ కింద తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ ఉండకుండా చేయాలన్నదే టీడీపీ నేతల దురుద్దేశమన్నారు. పోలీసులు ఉన్నది టీడీపీకి ఓట్లు వేయించేందుకేనా అని ప్రశ్నించారు. వైఎస్ పేరు చెరిపేందుకు కుట్ర.. వైఎస్ పేరుకు పులివెందుల తాలుకాలో ఓటమి లేదని, దానిని చెరిపేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతుందన్నారు. పోలింగ్ బూత్‌లను మార్చి కుట్రపూరితంగా గెలిచేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ రిగ్గింగ్ చేసి గెలిచినా, వైఎస్ జగన్‌కు ఆవగింజంత అవమానాన్నిగాని, భయాన్నిగాని పరిచయం చేయలేరన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇప్పుడు ఉన్న జగన్ 2029–34 మధ్య ఉండరని, మరో జగన్‌ను చూస్తారని హెచ్చరించారు. ఈనెల 12న పోలింగ్ ప్రశాంతంగా జరిగితే పోలీసులను అభినందిస్తామని, ఆ ఒక్కటి కూడా సమర్థంగా చేయలేకపోతే ప్రజాస్వామ్యం పోలీసులను క్షమించదని అన్నారు. -
మరోసారి నోరు పారేసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి నోరు పారేసుకున్నారు. జిల్లాలోని ఎ. కొండూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడకల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి కొలికపూడి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎ. కొండూరు మండలంలో నీటి సరఫరాపై జరుగుతున్న ప్రచారంపై కొలికపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానంటూ అవాకులు చవాకులు పేలారు. అదే క్రమంలో స్థానిక టిడిపి ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ముఖ్య అనుచరుడిని టార్గెట్ చేశారు కొలికపూడి. గిరిజనులకు మరుగుదొడ్లు కట్టించేందుకు గతంలో కాంట్రాక్ట్ తీసుకున్న టీడీపీ నేత రమేష్‌రెడ్డిపై పరోక్షంగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. 320 మరుగుదొడ్లు కట్టించేందుకు బిల్లులు తీసుకున్నారన్నారు. అటువంటి వారి వెనుక తిరుగుతారా? అంటూ గిరిజనును నిలదీశారు. అసలు మీకు సిగ్గుందా? గిరిజనులపై సైతం నోరు పారేసుకున్నారు కొలికపూడి. -
హరిత హోటల్ వేదికగా ఎల్లో పాలిటిక్స్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన
కడప: ఒంటిమిట్టలో యధేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు మాత్రం పత్తా లేకుండా ఉన్నారు. హరిత హోటల్ వేదికగా తిష్ట వేసిన మంత్రులు.. ఎల్లో పాలిటిక్స్‌కు తెరలేపారు. హరిత హోటల్‌ను కూటమి కార్యాలయంగా మార్చేశారు మంత్రులు, టీడీపీ నేతలు. హరిత హోటల్లో మకాం వేసి మంత్రులు.. పచ్చదండు కార్యకర్తలతో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు మంత్రులుగా వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పార్టీ కోసం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా, అదే సమయంలో ప్రభుత్వ వాహనాలను సైతం ఉపయోగిస్తున్నారు. మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నికల కోడ్ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం, ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు మాత్రం పత్తాలేకుండా ఉన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్సార్సీపీకి అనుకూలమనే సంకేతాలతో టీడీపీ అధిష్టానం రాష్ట్ర కేబినెట్‌ను ఇక్కడికి పంపుతోంది . రోజుకొక మంత్రి వస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం కేబినెట్ కదిలిరావడం చూసి ఓటర్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. కులాలవారీగా మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఫరూఖ్‌లు ఒంటిమిట్టలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పోలింగ్ నాటికి ఎంతమంది మంత్రులు దిగుతారో చెప్పలేని పరిస్థితి. తమవంతుగా జనసేన నుంచి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,ఎమ్మెల్సీ అనురాధలు ఉన్నారు.కాగా, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కొన్ని పరిమితులతో కూడిన అంశం. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తమ అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయకూడదు. మరి మంత్రులు తమ హోదాలో ఇంత చేస్తున్నా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
‘వివేకా హత్య కేసు.. ఆ సమయంలో సీబీఐకి ఎందుకు అప్పగించలేదు?’
విశాఖ. వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వివేకానంద హత్య కేసులో లేనిపోని ఆరోపణలు చేసే బదులు.. ఆ కేసును సీబీఐతో విచారణ చేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని బొత్స నిలదీశారు. అసలు వివేకా హత్య కేసు చంద్రబాబు హయాంలో జరిగిందని, మరి ఆ సమయంలో ఎందుకు సీబీఐకి అప్పగించలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఆ కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు.మరి ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసును ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైందని, మరి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారన్నారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 9) విశాఖ నుంచి మాట్లాడిన బొత్స.. వివేకా హత్య కేసులో ఆధారాలుంటే బయటపెట్టొచ్చు కదా అని బాబును సూటిగా ప్రశ్నించారు. ‘14 నెలలు నుంచి చంద్రబాబు ఏమి చేస్తున్నారు. సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికలు కోసమే వివేకానంద హత్య గురించి మాట్లాడుతున్నారు. వచ్చే నాలుగు ఏళ్ళు ఇదే అంశం చంద్రబాబు మాట్లాడుతారు’ అంటూ మండిపడ్డారు. -
‘ఒక గ్రామంలో ఓట్లు మరో గ్రామంలో వినియోగించకోవడం ఏంటి?’
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ఒక గ్రామంలోని ఓట్లను మరో గ్రామంలోకి వెళ్లి ఓటేసేలా చేయడం వెనుకు ప్రభుత్వం కుట్ర దాగి ఉందని విమర్శించారు.ఒక గ్రామంలో ఓట్లు మరో గ్రామానికి వెళ్లి వినియోగించుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 9వ తేదీ) మాట్లాడిన రాచమల్లు.. ‘వింత పోకడలకు చంద్రబాబు ప్రేరేపిస్తే, ఎన్నికల కమిషన్ సహకరిస్తోంది. చంద్రబాబు ఇగోను సంతృప్తిని పరచడానికి పోలీస్ శాఖ పని చేస్తుంది. మేము శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు కోరుకుంటున్నాం. మాపై మేము దాడులు చేసుకోవడానికి మాకు పిచ్చి, వెర్రి లేదు. వైఎస్సార్సీపీకి సంబంధించిన చివరి కార్యకర్తలను అరెస్టు చేసినా మేము భయపడం. మా పార్టీ మహిళలు బూత్‌కు వెళ్లి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాడులు, విధ్వంసాలతో నెగ్గాలి అనుకోవడం కుటిల ఆలోచన. 12వ తేదీ పులివెందుల రూరల్ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టడం ఖాయం’ అని రాచమల్లు సృష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ నేత సతీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేయబోతున్నట్లు టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. ‘‘నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి. నాపై దాడి జరిగితే లోకేష్, బీటెక్ రవే బాధ్యత వహించాలి’’ అని సతీష్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘నాకు ఏమైనా జరిగితే సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదు. ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు’’ అంటూ సతీష్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి కల్గిస్తున్నాయి. పోలీస్, టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పెళ్లికి వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అది మరువక ముందే మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీ, వేల్పుల రాముపై హత్యాయత్నం చేశారు...దాడి చేసిన వారే వైఎస్సార్సీపీ నేతలపై ఎదురు కేసు పెట్టీ ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. ఒక డీఐజీ స్థాయి అధికారి పత్తి వ్యాపారానికి వెళ్లారా అని మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడే తీరు చూస్తే మీకు కానిస్టేబుల్‌కి ఇచే గౌరవం కూడా ఇవ్వరు. పోలీసులు 100 మీటర్ల దూరంలో ఉండి కూడా మీ పోలీసులు రాలేదు. మీరు లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అంటున్నారా?. ఇంత పనికిమాలిన వ్యవస్థ అండ చూసుకుని టీడీపీ చెలరేగిపోతోంది. ఇప్పుడు సాక్షి వాహనాలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తావా?. కొంత మంది వ్యక్తులు చేస్తున్న పైశాచికాన్ని మీ ప్రభుత్వం కాపాడుతున్నారు..నాకు కూడా భద్రత లేదు.. అయినా ఎన్నికలను జరిపిస్తాం. ఒక వైపు వీళ్లే దాడి చేయడం, ఆ నెపం మాపై నెట్టడం వాళ్లకి రివాజుగా మారింది. నిన్న రాత్రి మా వాళ్లను కొంత మంది అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వాళ్లు ఆ సమయంలో పోలీసు స్టేషన్లోనే ఉన్నారు. ఈ అరాచకాలు భరించలేక ఈ ఎన్నిక వదిలిపెడతాం అనుకుంటున్నారేమో.. మా మహిళలే ముందుండి ఎన్నికలు నడిపిస్తారు. చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి..? మాకు హై కమాండ్ నుంచి ఆదేశాలు అని చెప్తున్నారు..లోకేష్ ఎన్ని దౌర్జన్యాలు చేసైనా పులివెందుల గెలిచి తండ్రికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాడు. లోకేష్ మీరు అనుచితంగా మాట్లాడితే.. మేము అలానే మాట్లాడతాం. నేను మాట్లాడానని నాపై వేధింపులు చేస్తానంటే భయపడే వారు లేరు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాలు అన్నీ తీసుకెళ్లాం. మీకు ఎన్నిక నిర్వహించలేనప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం..?. ఒక గ్రామ ఓటర్లు వేరే గ్రామంలో ఓటు వేయాలా..?. ఈ అరాచకాలు ఆగేటట్లు లేవు...పులివెందుల ఆడబిడ్డలు ముందుండి నడపండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, లోకేష్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరు. దాని కోసం అక్రమ మార్గాలు, దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారు..ప్రజలు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, పిల్లలకు వస్తున్న కృష్ణా జలాలను చూడండి. స్వార్థంతో కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిండి. ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందులకు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో గమనించండి. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 మెడికల్ సీట్లు వెనక్కి పంపిన వాళ్లు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ నాయకులు, వారికి మద్దతు పలికే నాయకులను ప్రశ్నిస్తున్నా.. మీరు పులివెందులకు ఏమి చేశారు..?.అసలు మీరు ధైర్యంతో పులివెందుల ప్రజల ఓట్లు అడుగుతున్నారు?. ఏమి చూసి మీకు ప్రజలు ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నా.. పైగా అరాచకాలు, మీడియా వాహనాలు పగలగొడతాం అంటున్నారు. ఒక పెద్ద మనిషిగా ఇవన్నీ ఆపాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయడం లేదు. చివరి అంకంలో చంద్రబాబు ఇలాంటివి అనుమతించి మరింత చెడ్డపేరు తెచ్చుకుంటారు. మీరు దాడులు, అక్రమాలు చేసి గెలిచినా అది గెలుపు కాదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. డీఐజీ ఒక ఉన్నత అధికారిగా వ్యవహరించడం లేదు.’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి. బాబు తీరు మారదా?
నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నాటకీయంగా వ్యవహరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్! ప్రజా వ్యతిరేకత వస్తుందనుకుంటే.. ఆ నిర్ణయానికి తానూ అనుకూలం కాదన్న బిల్డప్ ఇస్తారు. ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తున్నట్లు ప్రచారం కల్పిస్తారు. కొన్ని రోజుల క్రితం టీవీ ఛానళ్లలో చంద్రబాబు పేరుతో వచ్చిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నట్లు ఛానెళ్ల స్క్రోలింగ్‌లలో కనిపించింది. ఎందుకబ్బా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనుకుంటూ ఉండగానే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు చంద్రబాబు స్టైల్! ప్రజా ఆరోగ్యం ముఖ్యమని అనుకుంటే పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తారా? ఇది ఏపీ ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో చంద్రబాబే చెప్పాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం షాపులను నిర్వహించి బెల్ట్ షాపులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే మద్యం అమ్మకాలు మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. అదనంగా వెయ్యి దుకాణాలు అనుమతించడంతోపాటు 99 శాతం టీడీపీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలకే దక్కేలా చేసింది. ఇక బెల్ట్ షాపులు సరేసరి. బెల్ట్ షాపు పెడితే తాట తీస్తానని, రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు కానీ.. ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం. అధికార కూటమి స్థానిక ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో వేలాది బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం పాటలు కూడా వేశారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూమ్‌లు తీసుకు వస్తున్నారు. చంద్రబాబు అంతకుముందు చేసిన ప్రకటనేమిటి? ఇప్పుడు జరిగిందేమిటి? ఆదాయం ముఖ్యం కాదంటూనే వాటిని పెంచుకునేలా మద్యం విధానాన్ని తయారు చేశారన్నది వాస్తవం. పర్మిట్ రూమ్‌ల ద్వారా సుమారు 180 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల ఆదాయం వస్తుంటే దానిని రూ.35 వేల కోట్లకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంత ఆదాయం పెరుగుతుందన్నది వేరే విషయం. కాని దీనికి ప్రభుత్వం కాని, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కాని ఇచ్చిన వాదన చూడండి. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమం చేసిన ఈనాడు దినపత్రిక ఇప్పుడు మద్యం వ్యాపారానికి అండగా ఉన్నట్లుగా కథనాలు ఇస్తుండడం విశేషం. రోడ్లపై మద్యం తాగకుండా పర్మిట్ రూమ్‌లు తెచ్చారట.బహిరంగ ప్రదేశాలలో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలో 2.7 లక్షల కేసులు నమోదు అయ్యాయట. దానిని నియంత్రించేందుకు పర్మిట్ రూమ్‌లు అనుమతిచ్చేలా నిర్ణయం చేశారట. అంతే తప్ప మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఇవ్వడం వల్ల మరింతగా మద్యపానం చేస్తారని, కుటుంబాలు నాశనం అవుతాయని వీరు రాయడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పర్మిట్ రూమ్‌లకు సంబంధించి హెడింగ్ కూడా పెట్టకుండా జాగ్రత్తపడింది.. కొత్త పాలసీలో 840 బార్లు వస్తున్నాయి. ప్రస్తుతం 3736 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఈ పర్మిట్ రూమ్‌లు వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే బహిరంగంగా మద్యం తాగడం వల్ల కేసులు వస్తున్నాయట. ఒకే. అది నిజమే అనుకుందాం. ఆ రకంగా శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఒప్పుకున్నట్లే కదా! పోనీ పర్మిట్ రూమ్‌లలో తాగిన మందుబాబులు రోడ్లపైకి వచ్చి మళ్లీ అల్లరి చేయరని ఎలా గ్యారంటీ ఇస్తారో తెలియదు. కాగా రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కూడా విఫలమైంది. బాటిల్‌పై ఉన్న ధరకన్నా రూ.పది ఇరవై అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు కూడా పట్టుకున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చిత్రమైన ప్రచారం చేసిన ఘనత కూడా చంద్రబాబు బృందానిదే. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరమని చెప్పవలసిన ప్రభుత్వం అలా చేయకపోగా, ఇప్పుడేమో ఊరూరికి బార్, వైన్ షాపు, పర్మిట్ రూమ్, బెల్ట్ షాపు అన్న చందంగా వ్యవహరించడం దురదృష్టకరం. మద్యం వల్ల కుటంబాలు నాశనం అవుతాయి. అందులోను మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. తాగిన మైంలోనే మహిళలపై అకృత్యాలు జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం విషయంలో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2014-19 మధ్యలోనూ ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామంటూ ఫైల్ పై సంతకం చేశారు. కాని ఆ తర్వాత మాత్రం వేలాది బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడిచిపోయాయి. అవి సుమారు 40 వేలకు పైగా అప్పట్లో చేరాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటిని దాదాపు లేకుండా చేయడమే కాకుండా, షాపులను తగ్గించి, ఊరికి బయట అవి ఉండేలా చర్యలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యథాప్రకారం మద్యాన్ని విస్తారంగా పారిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.రామారావు తన హామీ ప్రకారం మద్యాన్ని నిషేధించారు. ఆ టైమ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం చేస్తుంటే, వారిపై సైతం కేసులు పెట్టడానికి వెనుకాడవద్దని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆయన ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలుత తాము మరింత గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఆ తర్వాత అసలు సినిమా చూపించారు. టీడీపీ ఎమ్మల్యేలు ఇష్టం వచ్చినట్లు అక్రమ మద్య వ్యాపారం చేసినా చూసిచూడనట్లు పోయారు. పైగా దీనిపై అసెంబ్లీలో ఒక నివేదిక పెట్టారు. అక్రమ మద్యాన్ని అరికట్టలేక పోతున్నామని ప్రకటించారు.అలా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ తెలిపి కొందరి పేర్లు వెల్లడించడం సంచలనమైంది. తదుపరి మద్య నిషేధం ఉంచాలా ?వద్దా ? అన్నదానిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నిర్వహించారు. ఆ పిమ్మట మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. పైకి తనకు ఇష్టం లేకపోయినా మద్య వ్యాపారాన్ని అనుమతించాల్సి వస్తున్నట్లు పిక్చర్ ఇస్తారన్నమాట. అప్పట్లో మద్యం స్కామ్ లు జరిగాయని విపక్షం ఆరోపించేది. అది వేరే కథ. ఇంకో మాట చెప్పాలి. సంపూర్ణ మద్య నిషేధం చేయాల్సిందే అంటూ ఉద్యమం చేసిన ఈనాడు గ్రూప్ అదినేత రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసేసి చేతులు దులుపుకున్నారు. అందులో కూడా చంద్రబాబును పెద్దగా తప్పు పట్టుకపోవడంపై రామోజీని పలువురు విమర్శించేవారు. రామోజీ ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్ తదితర వ్యాపారాలు కలిగిన ఈనాడు మీడియా కూడా చంద్రబాబు మాదిరే డబుల్ గేమ్ ఆడిందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చేవి. అప్పటి మాదిరే ఇప్పుడు కూడా పర్మిట్ రూమ్‌లు, మద్యం షాపుల దందాను టీడీపీ మీడియా సమర్థిస్తున్న తీరు అసహ్యంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా తనకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డు పెట్టుకుని ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని పారించడం ప్రజల కోణంలో దుర్మార్గమే అవుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘జైలు అధికారుల ఓవరాక్షన్.. మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కడితే తప్పా?’
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరితో రాఖీ కట్టే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు డైరెక్షన్లను కూడా జైలు అధికారులు అమలు చేయడం లేదన్నారు. మిథున్‌రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన సోదరి శక్తి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ మార్గాని భరత్ కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు తీసుకు వెళుతున్న రాఖీలను జైలు అధికారులు వాటిని వెనక్కి పంపించారు. దీంతో, రాఖీలు లేకుండానే ఆమె ములాఖత్‌కు వెళ్లారు.అనంతరం, ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. చేదు అనుభవాలతో జైలులోకి వెళ్లాల్సి వచ్చింది. రక్షాబంధన్ రోజున సోదరితో రాఖీ కట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ను సైతం జైలు అధికారులు అమలు చేయడం లేదు. కేవలం ప్రతిపక్ష నేతలు ములాఖత్‌కు వెళితే జైలు ఎదుట ఇంత భారీ భద్రత అవసరమా?. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. కేబినేట్ అనుమతులు లేకుండా జీవోలు జారీ చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే. 2014-19 మధ్యలో వేల కొద్దీ బెల్డ్ షాపులు ఏర్పాటు చేశారు. పాదయాత్రలో మహిళలు కోరిన మీదట 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మద్యం నియంత్రణ చేసే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా, విచ్చలవిడిగా మద్యం చలామణి కాకుండా వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది అంటూ మండిపడ్డారు.మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ..‘కనీసం పోలీసుల సమక్షంలోనైనా రాఖీ కట్టడానికి మిథున్ రెడ్డి సోదరికి అవకాశం ఇవ్వకపోవడం దారుణం. కూటమిలో మిగిలిన పార్టీలకు వాయిస్ లేదు.. కూటమి అంటే కేవలం టీడీపీ మాత్రమే. ఏపీలో మద్యం పాలసీ దారుణంగా ఉంది. మందుబాబులు రోడ్లపైనే తాగేస్తున్నారు. ప్రతి మద్యం షాప్‌నకు అనధికార పర్మిట్ రూమ్ ఉంది. టీడీపీ నేతలు బందిపోటు ముఠాలా మారి ప్రజలపై రాబందుల్లా పడ్డారు. మద్యం పాలసీ రూపొందించిన తరువాత కమీషన్లు ఎలా పెంచారు. పెరిగిన కమీషన్లు కరకట్ట ప్యాలెస్‌కి వెళ్లాలా?. ఇది కదా స్కామ్ అంటే. డిస్టలరీలకు ప్రివిలైజ్ ఫీజు మీరు ఎందుకు మాఫీ చేశారు. రాష్ట్ర ప్రజలకు 3000 కోట్లు ఎందుకు నష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో 60 వేలకు తగ్గకుండా బెల్ట్ షాపులు ఉన్నాయి. 2019-24 వరకూ రాష్ట్రంలో ఒక్క బెల్ట్ అయినా ఉందా?. ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది’ అని అన్నారు. -
పులివెందులలో ఈసీ నిద్ర నటిస్తోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఎన్నికల కార్యాలయం ఎదుట బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. తర్వాత.. వారికి లోపలికి అనుమతి ఇవ్వడంతో పులివెందులలో పరిస్థితులపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక, ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు , కైలే అనిల్ కుమార్ , ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్, పూనూరు గౌతమ్ రెడ్డి, నారాయణ మూర్తి ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రశాంతంగా ఉన్న పులివెందులను రక్త చరిత్ర పులివెందులగా మార్చారు. పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రచారానికి వెళ్లిన మాపై దాడి చేశారు. మమ్మల్ని హతమార్చేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో నేను ప్రాణాలతో బయటపడ్డా. తాజాగా పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. దోచుకున్న డబ్బును పులివెందులలో పంచుతున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల కమిషనర్‌ను కలిసి పరిస్థితులను వివరించాం. ఎమ్మెల్సీనైన నాకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. టీడీపీ తరపున పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ కళ్లుమూసుకుని నిద్ర నటిస్తోంది. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు. నిద్ర నటించే వారిని ఏమీ చేయలేం. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది. ఓటర్‌కి దూరంగా పోలింగ్ స్టేషన్లను మారుస్తున్నారు. ఎన్నికల కమిషనర్ సీట్లో కూర్చునే ముందు చేసిన ప్రమాణాలను గుర్తుచేసుకోవాలని కోరాం. కేవలం జెడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చంద్రబాబు కాళ్ల వద్ద పడేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపారని, రమేష యాదవను హత్య చేయాలని చూశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈసీ మొద్దు నిద్ర వీడాలని ఆయన హెచ్చరించారు. -
చంద్రబాబు పర్యటన.. అల్లూరి జిల్లాలో ఉద్రికత్త
సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే ర్యాలీగా వెళ్లిన నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. -
టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్న పోలీసులు: రాచమల్లు
సాక్షి, పులివెందుల: టీడీపీ నేతలు పులివెందులలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోందన్నారు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోంది. అధికారం అండతో టీడీపీ అధికారులను విచ్చలవిడిగా వాడుకుంటుంది. పులివెందులలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరుకు పులివెందులలో ఓటమి లేదు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు. సాక్షి మీడియా సిబ్బందిపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. సాక్షి సిబ్బంది వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు’ అని చెప్పుకొచ్చారు. -
ఇష్టానుసారం పోలింగ్ బూత్‌లను మార్చేయొచ్చా?
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి ఈసీ కొమ్ము కాస్తోందని, అందుకు ఆధారాలూ ఉన్నాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మీడియా ముందుకు రావడం తెలిసిందే. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక కోసం ఎన్నికల అధికారులు ఉన్నపళంగా పోలింగ్ బూత్‌లను మార్చేయడం(జంబ్లింగ్) విమర్శలకు దారి తీసింది. ఇంతకీ ఇలా ఇష్టానుసారం మార్చేయొచ్చా?.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుపెన్నడూ లేని సంస్కృతికి అధికారులు తెర లేపారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిల్లో దాదాపు ఆరు(6, 7, 8 ,9 ,10 ,11) పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేశారు. అదీ రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండానే. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో అవాక్కు కావడం అందరి వంతు అయ్యింది. ఈ నిర్ణయంతో.. ఇంటి ప్రక్కనే పోలింగ్ కేంద్రం ఉన్న ఆ ఓటర్ మాత్రం తన ఓటును నాలుగు కిలోమీటర్ల వెళ్లి వేసుకోవాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. అదే సమయంలో రాజకీయ దుమారమూ చెలరేగింది.రాజ్యాంగం ఏం చెబుతోందంటే.. రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండా ఇలా పోలింగ్ బూత్‌లను మార్చేయడం తీవ్రమైన చర్యనే. తద్వారా పారదర్శకత, నిష్పాక్షికత రెండూ దెబ్బతింటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం..కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ (ఓటర్ల జాబితాల తయారీ సహా) అప్పగించబడ్డాయి. ఇందులో ఓటర్ల జాబితాల తయారీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌లను ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చొచ్చు. ఈ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు ముందుగా సమాచారం ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదు. కానీ అదే సమయంలో.. ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా, ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్న అంశం మాత్రం నొక్కి చెబుతోంది. పులివెందుల పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల పారదర్శకత, నిష్పాక్షికత ఈ రెండింటినీ దెబ్బ తీసే అంశాలేనన్న చర్చ నడుస్తోంది.వైఎస్సార్సీపీ అభ్యంతరాలుపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 10,601 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో 4,000 ఓట్లు ఉన్న ఆరు పోలింగ్ కేంద్రాలను ఆ ప్రాంతాలలో కాకుండా మరో ప్రాంతానికి మార్చడమే అసలు సమస్యగా మారింది. మొత్తం ఓట్లలో 65 శాతం ఓట్లున్న కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లోనే తమ పార్టీకి పట్టుందని, ఉద్దేశపూర్వకంగానే పోలింగ్ బూత్‌ల మార్పు జరిగిందని, అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి అధికారులు పోలింగ్ కేంద్రాలను మార్చారని వైఎస్సార్సీపీ అంటోంది. స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ టీడీపీ ఎత్తుగడగా కనిపిస్తోందని చెబుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకుండా చేయడం వల్ల పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని సైక్లింగ్ లేదంటే రిగ్గింగ్ చేసుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టులు ఏం చెబుతున్నాయంటే..1951 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఎన్నికల సంఘానికి పోలింగ్ ఏర్పాట్లు నిర్వహించేందుకు, బూత్‌ల స్థానాలను నిర్ణయించేందుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. అయితే 2018లో కమల్ నాథ్ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో పార్టీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈసీ ఈ తరహా చర్యలు తీసుకోవడం నిషేధించాలంటూ దిశానిర్దేశాలు కోరారు. ఈ క్రమంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు పట్ల రాజకీయ పార్టీల ఆందోళనలను సుప్రీం కోర్టు నిశితంగా పరిశీలించడం గమనార్హం. అంతేకాదు కోర్టులు గతంలో ఎన్నికల సంబంధిత నిర్ణయాల్లో పారదర్శకత, ప్రక్రియాత్మక న్యాయత అవసరాన్ని స్పష్టంగా హైలైట్ చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఎన్నికల సంఘానికి పరిపాలనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. పోలింగ్ బూత్ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకపోవడం, సహజ న్యాయం, ఎన్నికల న్యాయత సూత్రాలకు విరుద్ధమే. ఈ అభ్యంతరాలతో పార్టీలు న్యాయస్థానాలనూ ఆశ్రయించవచ్చు. -
గుంటూరు జైలు నుంచి తురకా కిషోర్ విడుదల
సాక్షి, గుంటూరు: జిల్లా జైలు నుంచి వైఎస్సార్సీపీ నాయకుడు, మాచర్ల మునిసిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిషోర్ శుక్రవారం విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్‌ను జైల్లో ఉంచిన కూటమి ప్రభుత్వం. ఆయనపై మొత్తం 12 అక్రమ కేసులు బనాయించింది. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్‌ను చంద్రబాబు సర్కార్ బనాయించింది.ఆరేళ్ల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కిషోర్‌పై కేసు నమోదు చేసి పీటీ వారింట్ ద్వారా అరెస్టు చూపించిన ప్రభుత్వం.. జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేసింది. కిషోర్‌పై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంట చింతల పోలీసులు నమోదు చేసిన కేసులో కిషోర్‌ది అక్రమ అరెస్టు అని హైకోర్టు తేల్చి చెప్పింది.తురకా కిషోర్‌పై కేసుల మీద కేసులు పెడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు మేజిస్ట్రేట్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆయన అరెస్ట్ సీఆర్పీసీ, బీఎన్ఎస్ఎస్ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదంది.కిషోర్ రిమాండ్ విషయంలో మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించలేదని ఆక్షేపించింది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొన్న మేజి్రస్టేట్, ఈ విషయంలో తన సంతృప్తిని ఎక్కడా రికార్డ్ చేయలేదని పేర్కొంది. కిషోర్ విడుదల ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో గుంటూరు జిల్లా జైలు నుంచి ఇవాళ(శుక్రవారం) తురకా కిషోర్ విడుదలయ్యారు. -
‘ఈసీ ప్రకటించిన పోలింగ్ బూత్ లిస్ట్ దారుణంగా ఉంది’
వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరలేపుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఎన్నికకు ఈసీ విడుదల చేసిన పోలింగ్ బూత్ లిస్ట్ చూస్తే దారుణంగా ఉందన్నారు. ‘ ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్రకు తెరతీసింది. నల్లపురెడ్డిపల్లె వారు ఎర్రబెల్లి వెళ్ళి ఓటేయాలి అంటున్నారు. గతంలో ఏ గ్రామంలో ఉండే బూత్ లో వాళ్ళు ఓటేసుకున్నారు. ఇప్పుడు మార్చిన తీరు ప్రకారం 4 కిలో మీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సి వస్తోంది. దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది. మొన్న నల్లగొండపల్లిలో ఎంత దాడికి దిగారో మీకు తెలుసు. మరి ఈ ఓటర్లు వేరే ఊరికి వెళ్లి ధైర్యంగా ఎలా ఓట్లు వేయగలరు. ఇది అర్థరహితం. కేవలం పోలింగ్ శాతం తగ్గించాలి అనే టీడీపీ ఈ ప్రయత్నం చేస్తోందా..?, ఎన్నికల కమిషన్ అందరూ ఓటేసేలా చూడాల్సిన బాధ్యత ఉంది. 6 పోలింగ్ బూత్ లపై ఈ ప్రభావం ఉంది. 3,900 ఓట్లు 36 శాతం మందికి ఈ సమస్య తలెత్తింది. ఎప్పుడైతే బూత్ ల లిస్టు విడుదలైందో అప్పుడు టీడీపీ కుట్ర బయటపడుతుంది. ఇప్పటికే దాడులు, బైండోవర్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజు మరో ఘనకార్యం చేసారు...బూత్ లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేసారు. ఎట్టిపరిస్థితుల్లో ఏ ఊర్లో వాటిని అదే ఊర్లో ఓటేసి అవకాశం కల్పించాలి. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలి. తప్పనిసరిగా పోలింగ్ బూత్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 2021లో ఏవిధంగా అయితే బూత్ లు ఉన్నాయో అలానే ఉంచాలని వినతి’ అని ఎంపీ అవినాష్ స్పష్టం చేశారు. -
‘దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?’
తాడేపల్లి: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల అంఃశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ప్రజలను భయపెట్టి ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారు.రెవిన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పని చేస్తుంది. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?, రెండు దశాబ్దాల క్రితం బిహార్‌లో ఉన్న పరిస్తితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకు వచ్చింది. కొంతమంది అధికారులు మితి మీరిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. పులివెందుల ఎన్నికలతోనే రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా?, ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారు.ప్రజలు ఓటు వేయాలి అనుకుంటున్నారా?, ఓటు వేయొద్దు అనుకుంటున్నారా?, మీరు ఎవరు ఓటుకు రావాల్సిన అవసరం లేదనే దురహంకారంతో మార్చారు. ప్రజా స్వామ్య బద్దంగా పులివెందుల ఎన్నిక నిర్వహించండి. ప్రజలు ఎవరి పక్షంగా ఉన్నారో తెలుస్తుంది. నిజంగా టిడిపి గెలిచే పరిస్తితి ఉంటే ఈ దాడులు ఏంటి?, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీత బయటకు వస్తారు. ప్రభుత్వాన్ని కాపాడటానికి మాట్లాడతారు. చంద్రబాబు మీ నాయకుడే కదా...ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. ఇంకా అధికారులను కలవడం ఎందుకు?’ అని ప్రశ్నించారు. -
ఓటమి భయం.. పులివెందులలో కూటమి కుతంత్రాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని గత కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ప్రశాంత వాతావరణంలో గనుక పోలింగ్ జరిగితే ఓటమి ఖాయమని భావిస్తున్న అధికార టీడీపీ.. ఎప్పటికప్పుడు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీస్తోంది. తాజాగా..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక భాగం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. ఇందులో అధికంగా ఓట్లు ఉన్న నల్లపురెడ్డిపల్లి, ఎర్రిబల్లి, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్‌లనే జబ్లింగ్ చేయడం గమనార్హం. ఎర్రిబల్లి ఓటర్లకు నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ బూత్, నల్లపురెడ్డిపల్లి ఓటర్లకు ఎర్రిబల్లిలో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల ఓట్లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. అయితే.. ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా చేసేందుకే టీడీపీ నేతలు ఈ కుట్ర పన్నారంటున్న వైఎస్సార్సీపీ అంటోంది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా నామినేషన్ల సందర్భంగా ఇచ్చిన పోలింగ్ బూత్‌ల లిస్టును మళ్లీ ఎలా మారుస్తారని ప్రశ్నిస్తోంది. బూత్‌లు మార్చేప్పుడు రాజకీయ పార్టీలతో సంప్రదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కి ఉంటుందని.. కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా బూత్‌లను మార్చారంటూ మండిపడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పోలింగ్ బూత్‌లను జంబ్లింగ్ చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు.