breaking news
-
‘ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. జగన్ జెండా వదిలేదే లేదు’
పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. -
చంద్రబాబు వంద చెబితే.. లోకేష్ రెండొందలు చెబుతున్నాడు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు కచ్చింగా మోసపోతారని.. ఇలా మాయమాటలు చెప్పేవాళ్లను మోసగాళ్లు అనడంలో తప్పే లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం వంగా గీత అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అసలు సూపర్ సిక్స్ వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయ్యరా?. అడిగితే మక్కెలు విగకొడతాం, తాట తీస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు తేరగా ఉన్నారా?. ఒక్కసారి గ్రామాల్లో తిరగండీ.. ఎవరికి మక్కెలు విరగకొడతారో తెలుస్తుంది.మాయమాటలు చెప్పేవాళ్ళను మోసగాళ్ళని అనలా? వద్దా?. కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చిందా?. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు మోసపోతారు. చంద్రబాబు వంద అబద్దాలు చెబితే.. లోకేష్ రెండు వందల అబద్దాలు చెబుతారు. ఏప్రిల్.. మే మాసంలో రైతులు అన్నదాత సుఖీభవ ఇస్తామని లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇప్పుడు ఏ నెల నడుస్తుందో రైతులు,ప్రజలు గుర్తించాలి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళాలి అని బొత్స పిలుపు ఇచ్చారు. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీతా మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాకు వెన్నంటే ఉన్నారు. ఏలేరు వరదల సమయంలో జగన్ వెంట జనం ఉన్నారు అని చూపించారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక వీదికో రెండు బెల్టు షాపులు పెట్టారు. నాణ్యమైన గంజాయి వ్యాపారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. చంద్రబాబు మాటలకు విలువలు..విశ్వసనీయత ఉండదు. అందుకే బాబు హమీలకు నాది భాధ్యత అని గత ఎన్నికల్లో పవన్ చెప్పారు. ఇద్దరు మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ధాన్యాగారంగా ఉన్న పిఠాపురంలో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటీ?. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు కుప్పాన్ని...స్వర్ణ కుప్పం ఎందుకు చేయ్యలేదు. సుపరిపాలనలో తొలి అడుగుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు.జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అయిన తరువాత పిఠాపురం నియోజకవర్గం కు పవన్ ఎన్నిసార్లు వచ్చారు?. పిఠాపురం లో ప్రజల సమస్యల మీద ఒక్క క్షణం ఆలోచించే పరిస్ధితిలో లేరు. వాలంటీర్ల ద్వారా అదృశ్యమయ్యారని చెప్పిన పవన్.. మరి ఆ మహిళలను వెనక్కి తీసుకువచ్చారా?. కాపు సామాజిక వర్గంలో యువత పవన్ ను హీరోగా భావించి వెనుక తిరిగారు. వారంతా ఇప్పుడు తమను తాము ప్రశ్నించుకోవాలి. పవన్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టారా?. లేదంటే చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయ్యడానికి పార్టీని పెట్టారా? చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయ్యాలని తాపత్రాయ పడే పవన్ ను హీరోగా చూడడం ఖర్మ.వంగవీటి మోహన రంగా , ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను కాపులు హీరోలుగా చూడాలి. సినిమాలో నాలుగు స్టెప్పులు వేసి..బయటకు వచ్చి మైక్ పట్టుకున్న వ్యక్తిని హీరోగా చూడడం దౌర్భాగ్యం. రానున్న రోజుల్లో పవన్ కల్యాణ్‌కు, వంగా గీతా కు మధ్య ఉన్న వ్యత్యాసం పిఠాపురం ప్రజలకు కచ్చితంగా తెలుస్తుంది. రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురం లో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలి.తోట నరసింహం మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారు. మేనిఫెస్టోను భగవత్ గీత,బైబిల్,ఖురాన్ గా ఆరాధించారు. మరో 15-20 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని పవన్ అంటున్నారు. పిఠాపురం లోనే కూటమీకి బీటలు వారాయి. జెండాలతో.. కుర్చీలతో కూటమి నేతలు కొట్టుకుంటున్నారు. -
విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో.. వర్సిటీ ప్రధాన ద్వారం వద్దే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు, విద్యార్థులు, యువకులు గుణదల నుంచి హెల్త్ యూనివర్సిటీ దాకా భారీగా ర్యాలీకి వచ్చారు. అయితే ఈ సమాచారంతో అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ వద్దకు చేరుకోగానే వాళ్లను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి నాయకులు యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భైటాయించి నిరసన తెలుపుతున్నారు. -
ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ.. పవన్ కల్యాణ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ల ఈ మాటల వెనుక ఏదో నిగూఢ అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 2024 నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గెలిచిన తీరుపై ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి. టీడీపీ ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని సూపర్ సిక్స్ వాగ్ధానాల ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చునేమో కానీ.. వైఎస్సార్సీపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు ఈవీఎంల మహిమ వల్లేనని సామాన్యులతోపాటు మేధావులూ బహిరంగంగానే ప్రకటించారు. కూటమి నేతల మాటలిప్పుడు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఏడాది కూటమి పాలనలో జరిగిన పరిణామాలు, కూటమి నేతల దాష్టీకాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని తమను వేధిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కొన్నేళ్లు ఓపిక పడితే మళ్లీ అధికారం మనదే అని భరోసా కూడా ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జగన్‌కు రాష్ట్రం నలుమూలల్లోనూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరకమైన పట్టుదలతో ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎక్కడ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడో అన్న భయం పట్టుకుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ మధ్యే ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మళ్లీ గెలిచే పరిస్థితిలోకి వచ్చిందన్న అర్థంతో మాట్లాడారు. అలాగే జగన్‌ను ఒక భూతంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలూ చేశారు. మంత్రి లోకేశ్ కూడా పలు సందర్భాల్లో జగన్ మళ్లీ వస్తే ఏమిటని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని.. చెబతూండటం ప్రస్తావనార్హం. ఈ వ్యాఖ్యలన్నింటి ద్వారా స్పష్టమయ్యే విషయం ఒక్కటే.. ఓటమి ఎదురుదెబ్బ నుంచి జగన్ బాగా పుంజుకున్నట్లే అని! ప్రజాదరణ బాగా పెరిగిందీ అని! దీనికి కారణం ఏమిటో కూడా కూటమి నేతలకు బాగానే తెలుసు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూండటంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేతలు మాత్రం ఈ మాట చెప్పకుండా, జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అప్రమత్తంగా ఉంటామని అంటున్రాను. తాజాగా పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఆ దారిలోనే మార్కాపురం సభలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ వారు మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో తామూ చూస్తామని అన్నారు. అధికారంలో ఉన్న వారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పాలన చేస్తున్నామని, మానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నామని చెప్పగలగాలి. ఏడాది సమయంలో ఏమి సాధించారో చెప్పాలి. కాని ఈ ముగ్గురు నేతలు పెద్దగా వాటి జోలికి వెళ్లడం లేదు. పవన్ కూడా జగన్ టైమ్ లో అభివృద్ది జరగలేదని విమర్శించారు. పవన్‌కు నిజంగా అభివృద్దిపై శ్రద్ద ఉంటే మార్కాపురంలో జగన్ హయాంలో చేపట్టిన వైద్యకళాశాల భవనాలను చూసి ఉండాల్సింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భవనాల నిర్మాణం ఎందుకు ఆగిందో చెప్పి ఉండాలి.అంతేకాదు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎందుకు పూర్తి చేయలేదు? నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? వీటిపై మాట్లాడకుండా, వైఎస్సార్సీపీ వారు అనని మాటలను వారికి అంటకట్టి సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? పవన్ తరచు సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారట. కొత్త సినిమా ప్రచారం గురించి అప్పడప్పుడు కొన్ని సభలు పెట్టుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుత్తుకలు కోస్తామని, గూండాగిరి చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పవన్ చెబుతున్నారు. అబద్దాలు చెప్పడంలో టీడీపీ రికార్డును దాటిపోవాలని పవన్ అనుకుంటే ఎవరం ఏమీ చేయలేం. ఈ ఏడాదిలో కూటమికి చెందిన వారు ఎన్ని దాడులు చేశారు? వైఎస్సార్సీపీ వారు ఎంతమంది హత్యలు, దాడులకు గురయ్యారు? తప్పుడు కేసులలో పెట్టి ఎందరిని అరెస్టు చేశారు? అన్నవి పవన్ కు తెలియదా! అయినా.. అధికారంలో ఉన్నప్పుడు అంతా హాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు. రాజకీయ విమర్శల వరకు ఓకే. కాని వైఎస్సార్సీపీ వారు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామని అనడంలోనే అనుమానం కలుగుతుంది. బహుశా గత ఎన్నికలలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలు తమని గట్టెక్కిస్తాయన్న ధీమానా? ఒక రకంగా ఇది పవన్ కల్యాణ్ బెదిరింపుగానే చూడాలి. రఫ్పా, రఫ్పా అనే డైలాగుకు వక్రభాష్యం చెబుతున్న పవన్ కల్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్య పూరితంగా మాట్లాడింది.. అభ్యంతరకరంగా మాట్లాడింది గుర్తు లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఇంతవరకు ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎన్నడైనా స్పందించారా? ఏమీ చేయక పోయినా, ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉన్నా గెలవగలమని వారు భావిస్తున్నారంటే ఈవీఎంల మానిప్యులేషన్ తమ చేతిలో ఉందన్న అభిప్రాయమే కారణమా?. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు ఈవీఎంల అక్రమాలు, ఓట్ల పోలింగ్‌లో జరిగిన అవకతవకలను ఆధార సహితంగా ఎన్నికల కమిషన్‌కు వివరించి వచ్చారు. వారి లెక్కల ప్రకారం పోలింగ్ శాతంలో తేడా వల్ల 87 శాసనసభ నియోజకవర్గాలలో గెలుపు, ఓటములను నిర్దేశితమయ్యాయి. పోలింగ్ ముగిసే టైమ్ కు ఉన్న ఓట్ల శాతం, తదుపరి నమోదైన ఓట్ల శాతానికి ఉన్న తేడా ఏకంగా 12.54 శాతం ఉన్న సంగతిని వారు తెలియ చేశారు. హిందుపూర్, రాయచోటి వంటి నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి వ్యత్యాసాలను వివరించారు. అనూహ్యమైన రీతిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ మార్పులు, ఎన్నికల అధికారులు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా దాటవేసి, దగ్దం చేసిన తీరు మొదలైనవి చూసిన వారందరికి ఏదో మోసం జరిగి ఉంటుందన్న భావన ఏర్పడింది. ఎక్స్ అధిపతి ఎలన్ మస్క వంటి వారు కూడా ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని చెప్పడం కూడా గమనించాలి. ఎవరో ఎందుకు. టీడీపీ ఓటమి పాలైన ప్రతి సందర్భంలోను చంద్రబాబు నాయుడు ఈవీఎంలను తప్పుపట్టారు. వాటి ద్వారా మోసం చేయవచ్చని గతంలో ఆయన స్వయంగా ప్రదర్శనలు చేయించారు.ఇప్పుడు ఆయన మాట్లాడకపోతుండవచ్చు. అది వేరే సంగతి.ఒంగోలు లో వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని అప్పట్లో వైఎస్సార్సీపీలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు చేసిన ప్రయత్నాలను ఎన్నికల సంఘం, అధికారులు అంగీకరించకుండా డ్రామా నడపడం, వీవీప్యాట్ స్లిప్ లను పది, పదిహేను రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి పలు సందేహాలకు అవకాశం ఇచ్చాయి. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కూడా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించాయి. సీపీఎం నేత వి.శ్రీనివాసరావు కూడా ఏపీలో 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు, తాజాగా పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ఎలా గెలుస్తుందో తామూ చూస్తామంటూ చేసిన ప్రకటనలపై కూడా సందేహాలు కలుగుతాయి. ఈవీఓంల మహిమను తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే బాలెట్ పత్రాలనే వాడాలని వైఎస్సార్సీపీతో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించకపోతే ప్రజలలో ఈవీఎంలపై అనుమానాలు మరింతగా బలపడతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా!?: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ.. దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. అలాగే, రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా, ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) హోల్డర్లు ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మాండేట్ ద్వారా రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధిని పొందవచ్చనే వాస్తవాన్ని అంగీకరించి.. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ఖజానాను అప్పగించే స్థాయికి ఎందుకు దిగజారిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలు, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను జతచేస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో బుగ్గన ఏమన్నారంటే..ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్ల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలేదనే ఆరోపణలు నిరంతరం వస్తున్నప్పటికీ.. వాటిని ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. ఈ అంశంపై ప్రజలకు ఎటువంటి వివరణలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎన్సీడీ బాండ్ల జారీలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఆ తప్పును ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని లేదా వివరణ ఇస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ, ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయడంపై నోరుమెదపకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇది ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకపోవడానికి.. పారదర్శకతపై కరువైన చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. నిజానికి.. హైకోర్టులో ఈ అంశం విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రెండు విడతలుగా ఎన్సీడీ బాండ్లు జారీచేసి రూ.9 వేల కోట్లు అప్పుచేసింది. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తుల (రుణదాతలు)కు రూ.1,91,000 కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. అంతేకాదు.. ఆ అప్పును ఏపీడీఎంసీ కట్టలేకపోతే ఆర్బీఐలో రాష్ట్రానికి ఉన్న ఖాతా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్ర అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వారికి రావాల్సిన మొత్తాలను డ్రా చేసుకునే అధికారం కల్పించింది. ఇలా రాష్ట్రంలో ఇంతముందెన్నడూ లేని రీతిలో ప్రైవేటు వ్యక్తులకు ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై అజమాయిషీ ఇవ్వడం వాస్తవం కాదా? రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. -
‘మేనిఫెస్టోని అమలు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం’
తాడేపల్లి : ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇంటింటికి వెళ్లలేక టిడిపి, జనసేన నేతలు ముఖం చాటేస్తున్నారని, ఇప్పటికే కూటమీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘోరంగా విఫలమైందన్నారు. ఈరోజు(ఆదివారం, జూలై 06) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘రీకాల్ చంద్రబాబూ మేనిఫెస్టో' కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. దీన్ని మరింతగా గ్రౌండ్ లెవెల్‌కు తీసుకువెళ్లాలి. 13 నుంచి 20వ తేదీ వరకు మండలాల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. 21 నుంచి ఆగస్టు 4 వరకు గ్రామీణ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. చంద్రబాబు సహా కూటమి నేతలు చేసిన మోసాలపై మనం గట్టిగా జనంలోకి వెళ్లాలి. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో మంచి స్పందన వచ్చింది. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లడాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని సజ్జల సూచించారు. -
కూటమి ప్రభుత్వంపై బుగ్గన ఫైర్
సాక్షి,తాడేపల్లి: కూటమి నేతలకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సవాల్ విసిరారు. ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ, ప్రయివేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పించిన విషయాన్ని అంగీకరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, రాష్ట్ర ఆర్ధిక విధానాన్ని అస్తవ్యస్తం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై జాతీయ మీడియాలో సైతం వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఒక జవాబుదారీతనం, పారదర్శకత అనేదే లేకుండా పరిపాలన చేయటం దారుణం. హైకోర్టులో ఈ విషయమై కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్ల నిధులు సమీకరించటానికి బాండ్లు జారీ చేయించింది. రూ.లక్షా 91 వేల కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టారు. ప్రభుత్వం అప్పు తీర్చకపోతే ప్రయివేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించటం రాజ్యాంగ విరుద్దమని సూచించారు. -
‘అప్పుడు ఊగిపోయారు.. మరి ఇప్పుడేమైంది చంద్రబాబూ?’
తిరుపతి: ఎన్నికలకు ముందు 143 అబద్ధపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌లు కలిసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 06) నగరిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడారు.అమరావతిని దోచుకోవడానికి మాత్రమే అధికారాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఊగిపోతూ చంద్రబాబు మాట్లాడారని,, నేడు మహిళల పై అగాయుత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రోజా. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రశ్నించేందుకకే ఉన్నానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతుంటే.. అది ఆయనకు తెలియదా? అని నిలదీశారు రోజా. ఒకవేళ రైతుల సమస్యలు తెలియకుంటే సీఎం పదవికి రాజీనామా చేయడం మంచిదన్నారు. చిత్తూరు జిల్లాలో కిలోమీటర్ల మేర మామిడి రైతు రాత్రి, పగలు అనేది తేడా లేకుండా ఎదురుచూస్తున్నాడని, వారికి మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. -
‘ముసలమ్మ నొక్కిద్ది బటన్ అన్నారు..ఇప్పుడు బాబే బటన్ నొక్కలేకపోతున్నారు’
తణుకు(ప.గో.జిల్లా): సంపద సృష్టించి పేదవాడికి పంచుతామన్న చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, జూలై 6) తణుకులో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారుమూరితో పాటు, నరసాపురం వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణం రాజు, వైఎస్సార్సీపీ కన్వీనర్ గూడూరి ఉమా బాల, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా కారుమూరి మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు పాలనతో ప్రజల్లో ఇప్పటికే విసుగు మొదలైంది. మంచం మీద పడుకున్న ముసలమ్మ నొక్కిద్ది బటన్ విశేషమా అన్నారు... ఇప్పుడు ఆ బటన్ నొక్కలేక పోతున్నారు. సంపద సృష్టించి పేదవాడికి పంచుతా అన్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తా అన్నారు.. మర్చిపోయారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు దానిని p4కు మార్చేశామంటున్నారునిరుద్యోగ భృతి అడిగితే స్కిల్ డెవలప్మెంట్లో కలిపేశాం అంటున్నారు. లోకేష్ గాని చంద్రబాబు గానీ పీఫోర్లో ఎంత ఇచ్చారు తమ నియోజకవర్గాల్లో. వారి సొంత డబ్బు ఒక్క రూపాయిఅయినా ఇచ్చారా..?, ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామాలాడుతున్నారు. సంవత్సర కాలంలో 1 లక్ష76 వేల కోట్లు అప్పు చేశారు. ఈవీఎంల తో మోసం చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసం చేయలేదు కూటమినేతల్లా వెన్నుపోట్లు పొడవ లేదు. పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఓట్లు వేసిన వారికే కాదు వేయనివారికి సైతం మేలు చేయామని మా నాయకుడు జగన్ చెప్పారు. ైఎస్ఆర్ సీపీకి వారికి పథకాలు ఇవ్వద్దు అని అంటున్నారు చంద్రబాబు.. ఆయన బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నారా...?, ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ముందు.. అనేక వాగ్దానాలు చేశారు.. ఎన్ని నెరవేర్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేశారు’ అని ధ్వజమెత్తారు. -
9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్.. కూటమి సర్కార్‌లో అలజడి
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైఎస్ జగన్ ఈ నెల 9న బంగారుపాళెం మామిడి రైతులను పరామర్శించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలజడి రేగుతోంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కష్టాలు పడుతున్నారు. రైతులను జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. కిలో 3 నుంచి 4 రూపాయలకు కొనుగోలు చేస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నాయి.ఈ నెల 9న వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిలో ఆరు రూపాయలకు కొనేందుకు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. వైఎస్సార్సీపీ హయాంలో కిలో 26 రూపాయలకు మామిడి అమ్మకాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామిడి ధర తగ్గిపోయింది. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద క్యూలైన్లో టోకెన్లు ఇచ్చి తక్కువ ధరకే దోచుకుంటున్నాయి. చాలా చోట్ల 3 నుంచి 4 రూపాయలకే జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. వైఎస్ జగన్ పర్యటన ఇలా..ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారు. -
బాబు పాలనలో ఎన్ని విచిత్రాలో.. చనిపోయిన ఉద్యోగికి బదిలీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. చనిపోయిన ఉద్యోగిని కూడా చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తప్పుల తడకగా మారింది. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామంటున్నా ప్రభుత్వం.. చనిపోయిన వారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ లిస్టులో పేర్కొంది.మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగం మానేసిన వాళ్లని కూడా బదిలీల లిస్ట్‌లో పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కొంత మందిని పాత సచివాలయమే కేటాయించారు. ఇలా.. తమకు అనుకూలమైన వారికి ఉన్న చోటే పోస్టింగ్‌లు ఇచ్చారు.కొండ ప్రాంతాలకు దివ్యాంగులను బదిలీ చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలన్నీ రద్దుచేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న(శనివారం) విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ను సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. -
హవ్వ... బాబూ నవ్విపోతారు!
‘‘నేను, గాంధీజీ, అంబేద్కర్లు సామాన్య కుటుంబాల్లోనే పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాము’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలోనే కాదు.. దేశాద్యంతం ఈ వ్యాఖ్యలకు నివ్వెరపోయి ఉండవచ్చు. గాంధీజీ.. అంబేద్కర్లతో పోల్చుకోవడం ఎంతవరకూ సమజసం అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే చంద్రబాబు తీరే అంత. ఏమైనా అనగలరు. చేయగలరు. పోల్చుకోగలరు కూడా. వాస్తవం ఏమిటంటే... గాంధీజీ, అంబేద్కర్‌లో సామాన్య కుటుంబాల్లో పుట్టిన మాట నిజం. అయితే వారెవరూ అవకాశాలను అందిపుచ్చుకోలేదు.సామాజిక పరిస్థితులను ఎదిరించి ప్రజలకు ఒక దారి చూపడం ద్వారా నేతలుగా ఎదిగారు! దేశ స్వాతంత్ర్య సాధనలో అందరికంటే ముందున్న గాంధీజీ జాతిపితగా ఎదిగితే... అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశారు. ఇద్దరూ అసత్యాలు చెప్పడాన్ని నిరసించారు. తిరస్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచారు.చంద్రబాబు విషయానికి వస్తే... ఈయన కూడా సామాన్య కుటుంబంలో జన్మించారు. సీఎం స్థానానికి ఎదిగారు. వాస్తవమే. కానీ ఈయన రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే గాంధీజీ, అంబేద్కర్ల ఆలోచనలు, ఆదర్శాలకు ఎంతో దూరంగా.. విరుద్ధంగా ఎన్నో మరకలు కనిపిస్తాయి. కాంగ్రెస్(ఐ)తో రాజకీయ ఆరంగేట్రం చేసి గ్రూపులు కట్టి, పైరవీలతో మంత్రిపదవి సాధించిన చరిత్ర చంద్రబాబుది. తరువాతి కాలంలో పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పేరుతో పార్టీ పెడితే.. మామపైనా పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అక్కడ ఏకు మేకు అయినట్లు మామనే పదవి నుంచి లాగిపడేశారు. పదవుల కోసం ఆరాటపడకపోవడం గాంధీజీ, అంబేద్కర్ల నైజమైతే.. వాటి కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డ చరిత్ర బాబు గారిది!చంద్రబాబు నిజంగానే వారిని ఆదర్శంగా తీసుకోదలిస్తే ముందుగా అసత్యాలు చెప్పడం మానుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేష భావాన్ని వదిలించుకోవాలి. కుమారుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి. ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న హింసను నిలువరించాలి. ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలి. అయితే... గాంధీజీ, అంబేద్కర్లలతో పోల్చుకోవడానికి ప్రయత్నించిన సభలోనే ఆయన ఎంత పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడారో చూడండి.ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పుల గురించి స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పేశారే. వెయ్యి రూపాయల అదనపు పెన్షన్ ఇవ్వడం కోసం మంచినీళ్లలా లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో పర్యటిస్తూ సభలు పెడుతున్నారే! కార్యకర్త కారు కింద పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌పై ఎంత దారుణమైన ఆరోపణ చేశారు! కారు ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్యను పిలిచి అంబులెన్స్‌లో ఏదో జరిగిందని చెప్పించారని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపించడమా! చంద్రబాబు ఈ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఈనాడు దినపత్రిక దాన్ని బ్యానర్‌గా వండి వార్చడం చూస్తే వారు సింగయ్య మృతి విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని తెలిసిపోతోంది. ఏపీ హైకోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కవర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కుట్రల అమలుకు ఎల్లో మీడియాను ఒక టూల్‌గా వాడుతున్నారన్నమాట.నిజానికి ఈ కేసులో ఎన్నో సందేహాలున్నాయి. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్తునప్పుడు వచ్చిన జన సందోహాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న జగన్‌కు ఎందుకు తగిన భద్రత కల్పించలేదు? వాహనాల వెంట ఉండవలసిన రోప్ పార్టీ ఎందుకు లేదో తెలియదు. కారు తగిలి సింగయ్య అనే వ్యక్తి గాయపడినప్పుడు వచ్చిన వీడియోలు గమనించిన వారెవరికైనా ఆయనకేమీ ప్రమాదం లేదన్నట్టుగానే అనిపించింది. కాని అంబులెన్స్‌లోనే ఆయన మరణించడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.ఇవన్నీ ఒక ఎత్తైతే... ఏదో గుర్తు తెలియని వీడియో ఆధారంగా పోలీసులు జగన్‌తో పాటు కొందరు వైసీపీ నేతలను నిందితులుగా చేసేశారు. కారు ప్రమాదానికి డ్రైవర్ కాకుండా... అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టి కొత్త ట్రెండ్ సృష్టించారు. హైకోర్టు ఇదే ప్రశ్న లేవనెత్తడంతో సమాధానాలు చెప్పలేని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదాలు కోరారన్న భావన కలిగింది. దాంతో జగన్ తదితరులపై నేరారోపణకు ప్రాధమిక ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.అదే టైమ్ లో ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్య లూర్దు మేరి చేసిన ప్రకటన మరింత సంచలనమైంది.తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, లోకేష్ మనుషులు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె అంత ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు వచ్చిందంటే అందులో నిజం లేకపోతే అలా చేయగలుగుతుందా? అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీనియర్ నేత దానిపై స్పందించడం ఏమిటి? అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పించారని అనడం ఏమిటి? అదే జగన్ పై ఆమె ఏదైనా ఆరోపణ చేసి ఉంటే సీఎం ఎంత తీవ్రంగా ప్రచారం చేసి ఉండేవారు. ఎల్లో మీడియా ఎంతగా ఇల్లెక్కి అరిచేది. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యేవారు! ఇప్పుడేమో ఆ ఆరోపణలపై విచారణ కాకుండా, ఆమె జగన్‌ను కలవడంపై విచారణ చేస్తారట. ఇదేనా ప్రభుత్వం నడిపే పద్దతి?గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకునే వారు ఎంత నిజాయితీగా ఉండాలి? ఒక ప్రమాదాన్ని జగన్‌కు పులమడం ద్వారా కుటిల రాజకీయం చేయడం ఏ తరహా నీతి అవుతుంది. గతంలో గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ తీసేందుకు ఒక్కసారిగా గేట్లు తెరచి తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నారు? రోడ్డు ప్రమాదాలు జరగడం లేదా? పూరి జగన్నాథ ఉత్సవాలలో తొక్కిసలాటలు జరగడం లేదా? కొందరు మరణించడం లేదా అని ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాటలలో పదకుండు మంది మరణిస్తే, అదంతా పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేయలేదా?జగన్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే మాత్రం ఆయనను నిందితుడుగా చేర్చుతారా? ఇది చిల్లర రాజకీయం కాదా? పైగా రాజకీయాలు, రౌడీలు, అంటూ నీతి సూత్రాలు వల్లిస్తే సరిపోతుందా? వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాలు, పేకాట క్లబ్లులు నడుపుతారు.. అంటూ గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో వారిని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు ఎలా ఇచ్చారన్న దానికి జవాబు దొరుకుతుందా?అదెందుకు అంగళ్లు వద్ద గతంలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబే ఎంతగా రెచ్చగొట్టారో వీడియోలు చెబుతాయి. పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్‌ను దగ్దం చేయడం, రాళ్ల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరి కన్ను పోవడం ఇటీవలి చరిత్రే కదా? ప్రతిపక్షంలో ఉంటే ఏ అరాచకం చేసినా సమర్థించుకోవడం, అధికారంలోకి రాగానే శాంతి వచనాలు పలకడమే చంద్రబాబు ఇజమా! అని అంటే ఏమి చెబుతాం. ఏ నాయకుడైనా పదవుల కోసం సంకుచిత రాజకీయాలకు దిగకుండా ఉంటేనే మంచి పేరు వస్తుంది కానీ... రాజకీయ అవసరాలకు గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుని పోల్చుకుంటూ, స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజలు తెలుసుకోలేకపోతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా మరి.. శ్మశానాన్నీ వదల్లేదు
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో శ్మశాన వాటికలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. మచిలీపట్నంలో క్రైస్తవుల స్మశాన వాటికను టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ కబ్జా చేసేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు టీడీపీ నేత తాళం వేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక నిర్వహణను నగరపాలక సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.నగరపాలక సంస్థ నిర్వహణలో ఉన్న స్మశాన వాటికను తన చేతుల్లోకి తీసుకున్న టీడీపీ నేత.. స్మశాన వాటికను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. స్మశాన వాటికకు తాళం వేసి.. టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ తన గేదెలను పెంచుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతపై మున్సిపల్ కమిషనర్‌కు క్రైస్తవులు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఓటేసిన వారిని కాటేస్తారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబు. అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం రెండోది ప్రతి పక్షం, ప్రతి పక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం. ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రతి పక్షం బాద్యత. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు హామీలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరపున అడిగే హక్కు ఉంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం. ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి.. నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. ఈ ఏడాది నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?. మా ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారు.’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.‘‘పువ్వు పుట్టిగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్లు ఉంది. ఏడాది పుర్తి అయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైంది?. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి. వైద్య విద్యార్థులపై ఆడ పిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ ధర్మం కాదు. ఏమి చేసిన అడిగే వారే లేరని వ్యవహరించడం సరికాదు. మనిషికి ఉన్న ఆశపైనే మోసపురిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు...చంద్రబాబు ఎప్పుడూ రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన గిట్టుబాటు ధర కల్పించే బాద్యత ప్రభుత్వనిదే. వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాట తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా?. ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలల బకాయిలు చెల్లించకుండా ఉంచారా?. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడాని వారిని ఇబ్బందులకు గురి చేస్తారా?. మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు’’ అంటూ బొత్స నిలదీశారు.కూటమి సర్కార్ నయ వంచన: కన్నబాబుమాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. మోసపోయింది ప్రజలు తప్ప.. చంద్రబాబు కాదు. ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలు కాపీ కొట్టి.. పక్క రాష్ట్రాల్లో కొన్ని కాపీ కొట్టి నయవంచన చేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమయింది?. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసే గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. తల్లి వందనం కార్యక్రమంలో సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మహిళాలకు తల్లికి వందనం రాలేదు అన్నది నిజం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్నారు. గతంలో కూడా ఆనాడు చంద్రబాబు 89 వేల కోట్లు రుణ మాఫీ చేయ్యల్సి వస్తే 15వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారు. మీరు కనబడితే తొలి అడుగు కాదు తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం. మీరు చేసిన ప్రతి అరాచకాన్ని 2.0 లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు’’ అని కన్నబాబు చెప్పారు. -
అదంతా కూటమి కుట్రే.. జగన్ రైతులను కలవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. బిన్ లాడెన్‌పై అమెరికా దాడిచేసినట్లు.. మారుమూల గ్రామంలో ఉన్న రైతును కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు.. వారిని కలిసి కష్టాలను తెలుసుకుంటారు అని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల కోసమే బంగారుపాల్యం గ్రామానికి వైఎస్ జగన్ వస్తున్నారు. అందుకే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం.. అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్సీపీ నాయకులను భయపెడుతున్నారు. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని అంటున్నారు. జగన్ రావడం.. రైతులను కలవడం ఖాయం.కర్ణాటకలో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించింది. కానీ, చిత్తూరులో కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక, చెట్లు నరికేశాడు. దానికి ఫారెస్టు అధికారులు.. కుమార్‌ను నా ఇబ్బందులకు గురి చేశారు. అటవీశాఖ పవన్ కళ్యాణ్ అధీనంలో ఉంది. ఓ మామిడి రైతును ఎర్ర చందనం స్మాగ్లర్ గా చూపించారు. తన తోటలో తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుంది. వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారు.వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టే పద్దతి మారాలి. హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాము’ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలను మేము పట్టించుకోము. ఎవరో చెప్పారు. నేను లేస్తే మనిషి కాదని బెదించేవాడంటా.. ప్రజలు కూడా అతనికి భయపడేవారు.. వాస్తవానికి అతనికి కాళ్లే లేవు.. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయ్.. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఎద్దేవా చేశారు. -
గంటాను గెలిపించి తప్పు చేశాం..
విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న జీవీఎంసీ భీమిలి జోన్ 2, 3 వార్డు నాయకులు, భీమిలి మండల నాయకులు శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి ఫిర్యాదు చేశారు. గంటాను గెలిపించుకోవడం తమకు భస్మాసురహస్తం అయిందని వారు బాబ్జీ వద్ద వాపోయినట్లు తెలిసింది. ఈ నెల 7న తాళ్లవలసలో జరగనున్న ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం గురించి అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు డీఏఎన్ రాజుకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గంటా వెంట ఉన్న వ్యక్తి (స్వామి) ఇప్పుడు కూటమి నాయకుల నెత్తిన కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంటా శైలి మారకపోతే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం ఢిల్లీ నుంచి రానున్న ఎంపీ భరత్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం.. అమరావతి వెళ్లి పార్టీ అధిష్టానం దృష్టికి తమ సమస్యను వివరిస్తామని నాయకులు తెలిపారు. బాబ్జీకి ఫిర్యాదు చేసిన వారిలో డీఏఎన్ రాజు, యరబాల అనిల్ ప్రసాద్, పతివాడ రాంబాబు, సాగిరాజు రాంబాబు, గరికిన పరశురాం, మరగడ రఘురామిరెడ్డి, లక్ష్మణరావు, వివిధ పంచాయతీల నాయకులు ఉన్నారు. అంతకు ముందు వారంతా డీఏఎన్ రాజు ఇంటి వద్ద సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. -
బీజేపీ ఐదు శాతం పార్టీనే ఉండిపోతుందేమో!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ భాగస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్యాయానికి గురవుతోందా? నామ్ కా వాస్తే మాత్రమే ప్రభుత్వ భాగస్వామిగా మిగిలిపోతోందా? ఆ పార్టీ నేతలు స్వయంగా వాపోతున్న విషయాలివే. ఈ ఆవేదన కూడా అర్థం చేసుకోదగ్గదే. ఏదో పెద్దన్న పాత్ర పోషిద్దామన్న ఆలోచనతో తెలుగుదేశంతో జతకట్టిన ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఇప్పుడు కనీసం చిన్నతమ్ముడు పాత్ర కూడా లభిస్తున్నట్లు లేదు. కొందరు మిత్రపక్ష నేతలు ఇప్పటికే బీజేపీని ఐదు శాతం పార్టీగా అవహేళన చేస్తున్నారని వీరు వాపోతున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడుగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన సందర్భంగా జరిగిన సమావేశంలో కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తికి దర్పణం పడుతున్నాయి. మంత్రివర్గం కూర్పు నుంచి, నామినేటెడ్ పదవుల నియామకం వరకూ అన్నింటిలోనూ తమకు అన్యాయం జరుగుతోందన్నది వారి ఆవేదన. 2014-19 మధ్యకాలంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నా కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుల రూపంలో రెండు మంత్రి పదవులు దక్కాయి. 2024లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఒకే మంత్రి పదవి దక్కడం.. అది కూడా ఢిల్లీలో పలుకుబడి కలిగిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కావడం విశేషం. ఆ నియోజకవర్గానికి ఆయనకు సంబంధమే లేదట. సూట్ కేస్‌తో ధర్మవరం వెళ్లి ఎమ్మెల్యే అయిపోయారని, తదుపరి మంత్రి అయ్యారని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డట్టు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సభలో ఆయన తన బాధను వ్యక్తం చేసినట్లు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదని, బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండని రాజు వ్యాఖ్యానించారు. ఇది నిజం కూడా. ఎందుకంటే 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం నానా తంటాలు పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపింది. ఆ విషయాన్ని ఆయన ఆ రోజుల్లో బహిరంగంగానే చెబుతూ తాను టీడీపీ పొత్తు గురించి మాట్లాడితే బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారని అనేవారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు బతిమలాడి మరీ పొత్తు కుదిరేలా చేసుకున్నారు. పొత్తు కోసం చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో రెండు,మూడు రోజులు వేచి చూసిన సందర్భాలూ ఉన్నాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత లోకేష్ తన పెద్దమ్మ పురందేశ్వరిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ క్రమంలోనే పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు జరిగాయి. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడం కూడా కలిసి వచ్చింది. అంతేకాక వైఎస్సార్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపినా, వివిధ కారణాల వల్ల వైసీపీ ముందుకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో పొత్తుకు ఓకే చేసిందని చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాని మోడీని, భారతీయ జనతా పార్టీని ఎంత తీవ్రంగా విమర్శించారో గుర్తు చేసుకుంటే.. రాజకీయాలలో ఇంతగా దూషించుకుని మళ్లీ కలవగలుగుతారా అన్న సందేహం వస్తుంది. ఎలాగైతేనేం..పొత్తు కుదరడంతో బీజేపీ తన కార్డును ప్లే చేసినట్లే ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో కూటమి ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసిందన్న విమర్శలు వచ్చాయి. కొందరు పోలీసు అధికారులను బదిలీ చేసిన తీరు దీనికి దర్పణం పడుతుందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాక ఈవీఎంల మానిప్యులేషన్ జరగిందని కూడా చాలా మంది నమ్ముతారు. పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓట్ల శాతం, ఆ తర్వాత అర్దరాత్రికి పెరిగిన ఓట్ల శాతంపై పలు అనుమానాలు వచ్చాయి. అయినా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదు.ఎన్నికల తర్వాత వీవీపాట్ స్లిప్‌లను, ఈవీఎంలతో కలిపి లెక్కించాలని కొందరు అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో అనుమానాలు మరిన్ని పెరిగాయి. ఇదంతా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే జరిగిందన్నది పలువురి భావన. ఆ విషయం నేరుగా చెప్పకపోయినా, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మతలబు ఇదేనన్న సందేహాం వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యత నడుపుతూ, వారు కోరిన విధంగా రాజ్యసభ సీట్లు కేటాయిస్తూ, క్షేత్ర స్థాయి బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదన్నది ఒక అభిప్రాయం.ఈ నేపథ్యంలోనే తమను ఐదు శాతం పార్టీగా ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. అయినా బీజేపీ నేతల డిమాండ్లు ఎంతవరకు నెరవేరతాయన్నది అప్పుడే చెప్పలేం. గతంలో బీజేపీతోపాటు ఇతరత్రా వారు కూడా పురందేశ్వరిని టీడీపీ ప్రతినిధే అన్నట్లుగా పరిగణిస్తుండే వారు. ఒకప్పుడు చంద్రబాబుకు దగ్గుబాటి కుటుంబానికి మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పుగా ఉన్నా, తదుపరి వారి కుటుంబాల మధ్య రాజీ చేసుకున్నారు. దీంతో ఒరిజినల్ బీజేపీ నేతలు వెనకబడిపోయారు. ఆ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లు కూడా పలువురు మాజీ టీడీపీ నేతలకే దక్కాయని అంటారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలలో ఐదుగురు టీడీపీ మద్దతుదారులు కావడం విశేషం. ఇదేమి రహస్యం కాదు. వారిలో ఒకరైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారట. ఆయన కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది. నామినేటెడ్ పదవులకోసం చంద్రబాబుకు జాబితాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదట. తాజాగా కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒరిజినల్ బీజేపీ నేత కావడంతో ఆ పార్టీ క్యాడర్లో కాస్త ఆశ చిగురించినట్లయింది. ఆయన టీడీపీతో గొడవ పెట్టుకోకపోయినా, అవసరమైనప్పుడు గట్టిగానే నిలదీయవచ్చని అనుకుంటున్నారు. కొంతకాలం క్రితం రాజ్యసభ సీటును బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా సత్యానారాయణకు కేటాయించడం, ఇప్పుడు మాధవ్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడంలో కేంద్ర బీజేపీకి ఏమైనా వ్యూహం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్తులో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి కూడా సిద్దపడవచ్చన్న అభిప్రాయం ఉన్నా, టీడీపీ బీజేపీ కేంద్ర నేతలను ప్రసన్నం చేసుకుంటున్నంత కాలం కూటమి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీ క్యాడర్‌కు రాష్ట్రంలో పదవులు పెద్దగా దక్కకపోవచ్చు. వారు నిజంగానే ఐదు శాతం పార్టీగానే మిగిలిపోవచ్చు. అప్పుడప్పుడు మీటింగ్‌లలో తమ గోడు వెళ్లగక్కుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. కేంద్ర బీజేపీ పెద్దలే పలు అవమానాలను దిగమింగుకుని టీడీపీతో కలిసిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలుకాని, కార్యకర్తలు కాని ఏమి చేయగలుగుతారు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పవన్.. నీదే టెంట్‌హౌజ్ పార్టీ.. కనీసం నీ శాఖ గురించైనా తెలుసా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్నినాని. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బాబు రావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా?. టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా?. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు.. ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ర్టంలో నరరూప రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండాల్సిన ఖాకీలు సైలెంట్ అయిపోయాయి. ఒక ముఖ్యమంత్రి గా అందరికీ న్యాయం చేయాల్సిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయొద్దంటున్నారు. దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇలా చేయటం సబబేనా?. వైఎస్సార్సీపీ వారిపై దాడులు చేయండి, పోలీసులు అండగా ఉంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయిపొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కనుసన్నల్లోనే మల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబమే ఇరవై ఏళ్లుగా ఆ గ్రామంలో సర్పంచ్‌గా ఉంటున్నారు. మరి ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ కుటుంబమంతా రాక్షసులైతే జనం ఇన్నేళ్లుగా ఎలా గెలిపిస్తున్నారు?. ఎమ్మెల్యే మనుషులే నాగమల్లేశ్వర రావుపై హత్యాయత్నం చేశారు. బాబూరావు అనే ఎమ్మెల్యే మనిషితో గొడవల వలనే నాగ మల్లేశ్వరరావుపై దాడి చేశారని అంటున్నారు. నిజానికి బాబూరావుపై గతంలో దాడి జరుగుతుంటే ఆపిందే నాగ మల్లేశ్వరరావు. అలాంటి వ్యక్తిని ఈరోజు చంపేందుకు ప్రయత్నించారుమన్నవ గ్రామంలో వైఎస్సార్సీపీదే హవా. దాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఊర్లో గొడవలు పెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న వెల్లలూరు గ్రామంలో ఆరు హత్యలకు కారకులెవరో అందరికీ తెలుసు. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చేయాలని ధూళిపాళ్ళ కోరుకుంటున్నారు?. రప్పా రప్పా అని పోస్టర్ పట్టుకున్నోడిపై కేసులు పెట్టినవాళ్లు మరి నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నంపై ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఆడపిల్లలు కనపడకపోతే పోలీసులు పట్టించుకోవడం లేదు.పవన్ కళ్యాణ్ చెబితేనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మరి ఆయన దగ్గరకు వెళ్దామంటే సినిమా షూటింగ్ బిజీలో ఎక్కడో ఉంటారు . చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక తమ్ముడు, చెల్లెలు కలుగులో నుండి వస్తారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ. చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికే పవన్ పార్టీ పెట్టారు.వైఎస్ జగన్‌ని అధికారంలోకి రానీయను అనటానికి పవన్ ఎవరు?. 2019లో కూడా జగన్‌ని అధికారంలోకి రానీయనని పవన్ అన్నారు. మరి ఏమైంది?. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కాదు. సుగాలీ ప్రీతి అదృశ్యం కేసును పవన్ రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు వదిలేశారు. కనీసం కార్యకర్తలను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. హెలికాఫ్టర్‌లో పిల్లల్ని తీసుకుని తిరగటం తప్ప పవన్‌కి ఇంకేం తెలుసు?. కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్‌కి తెలియదు.పంచాయతీలకు రావాల్సిన రూ.2,800 కోట్లను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తే పవన్ ఎందుకు నోరు మెదపటం లేదు?. రేషన్ బియ్యం షిప్పుల కొద్దీ బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. తిరుమలలో రోజూ అపచారాలు జరుగుతుంటే పవన్ పోరాటం ఎందుకు చేయటం లేదు?. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించటం లేదు?. హెలికాఫ్టర్‌లో ప్రకాశం జిల్లాకు వెళ్లిన పవన్‌కి కరేడులో రైతుల సమస్యలు కనపడటం లేదా?. మీ ప్రభుత్వం 8 వేల ఎకరాలను మీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు?.రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగ లేవంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారు?. చంద్రబాబు, లోకేష్ లకు సిగ్గు లేదా?. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను మంత్రి వచ్చే వరకు సైకోగాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు సోదరుడు వేణు ప్రసాద్‌తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
‘బాబు, పవన్‌లు గ్రామాల్లోకి రండి.. ఎవరి తాటతీస్తారో చూద్దాం’
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయిందని, మరి సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ‘ చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకు మురళీ కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా బొత్స మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంవత్సరం దాటిపోయింది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయి..?, సూపర్ సిక్స్ హామీలు.. అన్ని ఇచ్చేసాను ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ నాలుక మందం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాటతీస్తాను మధ్యలో ఇరగ కొడతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగా కోరులు మోసగాళ్లు.. పేద ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమినేతల మెడలు వంచుతాం. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా మహిళలు రైతులు నష్టపోతు ఉంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రండి గ్రామాల్లోకి వెళదాం... ఎవరి తాటతీస్తారో తేలిపోతుంది. చంద్రబాబు వచ్చి 100 అబద్ధాలు చెబుతాడు..లోకేష్ వచ్చి... 200 అబద్ధాలు చెబుతాడు. అన్నదాత సుఖీభవ రూ. 20000 ఇస్తా అన్నారు సంవత్సరమైంది ఎవరికైనా ఇచ్చారా....?, ప్రజల సమస్యలపై పోరాడటం మా పార్టీ ధ్యేయం. రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా....?, సిండికేట్లుగా మారి ఆక్వా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ’ అని ధ్వజమెత్తారు బొత్స. జగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందిజగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. మన నాయకుడు మాటిస్తే మాట తప్పే పరిస్థితి లేదు.. తగ్గేదే లేదని ఈ సందర్భంగా తెలిపారు. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రజలందరిని వంచించి మోసం చేశాడు. సంపదల సృష్టి కరెంటు బిల్లులు పెన్షన్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు దుర్మార్గమైన మనిషి. ఒక పెద్ద మనిషి ప్రశ్నిస్తాను అన్నాడు. కాపు నేస్తమా అమలు చేయడం లేదు. దానిపై ప్రశ్నించడం లేదుచంద్రబాబు సంపద సృష్టించడంలో నెంబర్ వన్ కాదు అప్పులు చేయడంలో నెంబర్ వన్. సంవత్సరం తిరగకుండానే రూ. 1,50,000 కోట్లు అప్పులు చేశాడు’ అని మండిపడ్డారు. -
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్ జగన్ శుక్రవారం (జులై 4) ఎక్స్ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
‘ఈ ప్రభుత్వంలో అసలు పవన్‌కు భాగస్వామ్యం ఉందా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని అంబటి రాంబాబు చురకలంటిచారు. జగన మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు భయం పట్టుకుందని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్‌కు నచ్చదు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదవటమే పనిగా పెట్టుకున్నారు. పవన్‌కి ఇల్లు, ఆఫీసు కట్టిస్తున్నది చంద్రబాబు కాదా?, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పేరుతో దియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని చంద్రబాబు లెటర్ రాసిచ్చి మోసం చేశాడు. మరి పదవి ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు అడగటం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు.మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరి పరిపాలనఏపీలో చంద్రబాబు నేతృత్వంలో పరిపాలన మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా ఉందని అంబటి స్పష్టం చేశారు. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా?, ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు. రెడ్‌బుక్‌ని కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడటం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తాం. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా నేతలపై కేసులు పెట్టారు.సింగయ్యను ప్రయివేటు కారు ఢీకొట్టి చనిపోయాడని తొలుత ఎస్పీ చెప్పారు తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత జగన్ కారే ఢీకొట్టిందంటూ ఆయన మీద కూడా కేసు పెట్టారు. సింగయ్యను ఆస్పత్రికి తరలించటానికి 40 నిమిషాలు ఎందుకు ఆలస్యం చేశారు?, అంబులెన్స్ లో ఎక్కకముందు చక్కగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా చనిపోయారు?అని అంబటి నిలదీశారు. -
కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్.. పోలీసుల అత్యుత్సాహం
శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సాక్షాత్తూ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా.. హాస్టల్ నేలపైనే ఉన్న చికిత్స అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే విషయంపై ఆరా తీసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. బాలికలు గురువారం రాత్రి తిన్న ఆహారం కలుషితమవడంతో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో బాలికలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరుకుని వసతిగృహంలోనే వారికి చికిత్స అందిస్తున్నారు.అయితే,బాలికల ఆరోగ్యంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ బాలికల వసతి గృహానికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాలికల్ని పరామర్శించారు. బాలికలకు హాస్టల్లో కాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం చేశారు. హాస్టల్లో బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం, భద్రత వంటి వివరాల్ని ఆరా తీయగా.. మంత్రి సవిత బాలికల్ని పరామర్శించేందుకు వస్తున్నారంటూ మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలను బలవంతంగా బయటకు పంపారు. మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఓ విలేకరి సెల్ ఫోన్‌ను లాక్కొని పగులగొట్టారు. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఏరాసుపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహణపై పెద్ద రచ్చే జరిగింది. తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ బుడ్డా అనుచరులు రెచ్చిపోయారు.ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలను బుడ్డా వర్గీయులు ధ్వంసం చేశారు. బుడ్డా అనుచరులు.. ఏరాసుపై చేయి చేసుకున్నారు. ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.