breaking news
-
పేర్ని నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
కృష్ణాజిల్లా: మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నేత పేర్ని నానిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. టీడీపీ నేతల ఫిర్యాదులతో పేర్ని నానిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై కేసులు నమోదు చేశారు.టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. జీరో ఎఫ్ఐఆర్ కింద పేర్ని నానిపై 353(2), 196(1) సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు.అంతకుముందు పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పెడనలో ‘‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పేర్ని నానిపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిన్న(శనివారం) కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనివ్వకుండా పోలీసులు నిర్భంధం విధించారు. కూటమి నేతల ఒత్తిడితో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.పెడన నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంపై ఆంక్షలు విధించిన పోలీసులు.. పెడన ఇంఛార్జి ఉప్పాల రాముకి నోటీసులిచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, బయటి వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. -
కృష్ణా జిల్లా ఎస్పీని కలిసిన జడ్పీటీసీలు
సాక్షి, కృష్ణా జిల్లా: జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి కృష్ణా జిల్లా జడ్పీటీసీలు ఫిర్యాదు చేశారు. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి సమాజం తలదించుకునేలా ఉందని జడ్పీటీసీలు అన్నారు. హారికపై దాడిని తీవ్రంగా ఖండించారు.కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు, గౌరవం లేదు. ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం.. సామాన్య ప్రజలకు, మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని కోరామని జడ్పీటీసీలు తెలిపారు.ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జడ్పీటీసీలు మండిపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ పదవిలో ఉన్న మహిళకే రక్షణ లేకుండా పోయింది. జిల్లా ప్రథమ పౌరురాలికే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?. ఆడపిల్లకు కష్టం కలిగితే తాట తీస్తామని చంద్రబాబు, పవన్ కబుర్లు చెబుతున్నారు. అయ్యా పవన్ ఎక్కడున్నావ్?. గుడివాడలో ఇంత జరిగితే ఏం చేస్తున్నావ్? ఎందుకు తాట తీయడం లేదు?’’ అంటూ జడ్పీటీసీలు ప్రశ్నించారు.గుడివాడలో ఉప్పాల హారిక కారు పై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి. రక్షించాల్సిన పోలీసులు టీడీపీ భటుల్లా మారారు. గంటన్నర పాటు టీడీపీ, జనసేన గూండాలు హారిక కారును నిర్భంధిస్తే పోలీసులు చోద్యం చూశారు. కృష్ణాజిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జడ్పీటీసీలు డిమాండ్ చేశారు. -
మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పెడనలో ‘‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పేర్ని నానిపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిన్న(శనివారం) కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనివ్వకుండా పోలీసులు నిర్భంధం విధించారు. కూటమి నేతల ఒత్తిడితో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.పెడన నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంపై ఆంక్షలు విధించిన పోలీసులు.. పెడన ఇంఛార్జి ఉప్పాల రాముకి నోటీసులిచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, బయటి వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. సమావేశంలో ఎలాంటి ఆవేశపూరిత ప్రసంగాలు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. -
బాండ్లు.. బాబు, పవన్ మోసం ప్రజలకు తెలియాలి: పెద్దిరెడ్డి
సాక్షి చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి తీసుకుని వెళ్ళాలి అని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మున్సిపాలిటీ, పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల్లో వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్సార్సీపీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ మాత్రమే కాకుండా 143 హామీలు ఇచ్చారు. ప్రతీ ఇంటికి ఇంత ఇస్తాం.. అంత ఇస్తాం అని టీడీపీ ప్రచారం చేసింది. వాటితో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి తీసుకుని వెళ్ళాలి. ప్రతీ ఇంటికి వీరి మోసాలు తెలియాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. కరోనా సమయంలో కూడా ఎక్కడా వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. కానీ, కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు చెడ్డ పేరు తెచ్చుకుంది. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. గతంలో రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. కరెంట్ ఛార్జీలు పెంచమని రామారావు హామీ ఇస్తే.. ఆ మాటను కూడా తుంగలో తొక్కి ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.2014లో కూడా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు. తల్లికి వందనానికి 13వేల కోట్లు అవసరమైతే కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. ఇక ఉచిత బస్సు అని చెప్పి అది స్థానికంగా మాత్రమే అని మెలికలు పెట్టారు.. అది కూడా ఇంకా అమలు కాలేదు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు గ్రామ గ్రామానా వివరించాలి’ అని పిలుపునిచ్చారు. -
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. టీడీపీ నేతలకు పోలీసుల వత్తాసు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. నాగమల్లేశ్వరరావు ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరావు కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని భావిస్తున్నాను. నాగమల్లేశ్వరరావు పైన జరిగిన దాడి రాజకీయపరమైన హత్యాయత్నం. దాడికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయి. అంబటి మురళి పైనే కేసు నమోదు చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. దాడికి రెచ్చగొట్టేలా మాట్లాడిన ధూళిపాళ్లపై కేసు పెట్టలేదు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. వైఎస్సార్సీపీ నేతల పైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారు. నాగమల్లేశ్వరావుపై దాడి చేసిన నిందితులకు సన్మానం చేసినా చేస్తారు.పెదకూరపాడు మాజీ ఎంపీపీని ఏడాది క్రితం దారుణంగా కొట్టారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేస్తే చర్యలేవి?. గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్‌పైన దాడి జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉన్నాడు అడ్డుకోలేదు. ప్రజాస్వామ్యయుతమైన హక్కులను వైఎస్సార్సీపీ నేతల్ని వినియోగించుకోనివ్వడం లేదు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయింది. వైఎస్ జగన్ ఇప్పటివరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే మామిడి యార్డు మూసివేశారు.చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ఇది. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. అందుకే ప్రజలకు చెబుతున్నాం. వైఎస్సార్సీపీని చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారు. మిర్చి రైతుల కంట కన్నీరు కారుతుంది. ప్రైవేటు కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం.రైతులు పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్పీ అంటున్నాడు. ఆయన పోలీసా లేక రాజకీయనాయకుడా?. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా అంటే అది లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కొద్దీ మేము రాటు తేలేలా చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు. అందుకే ఆయనొస్తే పది మంది బయటకు రావటం లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు. ప్రజల గురించి ఆలోచించడం జగన్‌కు అలవాటు. అందుకే జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదు. దాడులపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
టీటీడీ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే తిట్ల పురాణం
సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ నిబంధనలను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తుంగలో తొక్కేశారు. తనతో పాటు ఉన్న అనుచరుల అందరిని ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలని హంగామా సృష్టించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ సిబ్బందిపై తిట్ల పురాణం లంకించుకున్నారు. ఆయనతో పాటు 12 మందికి ప్రోటోకాల్‌ను టీటీడీ కేటాయించింది.అదనంగా జనరల్ బ్రేక్ ఇచ్చిన వారిని కూడా ప్రోటోకాల్‌లో తనతో పాటు పంపాలంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టీటీడీ సిబ్బందిపై గొడవపడి మరి ప్రోటోకాల్ దర్శనానికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే థామస్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. -
అలా ప్రశ్నిస్తావా?.. చంద్రబాబు కోసం సేనాని సంచలన నిర్ణయం
నేనే పాతికేళ్ల పాటు చంద్రబాబు పల్లకి మోయాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఎన్నాళ్ళు సీఎంగా ఉన్న ఆయన గుమ్మం ముందు కాపలాకు సిద్ధమయ్యాను.. అలాంటిది చంద్రబాబును, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే ఎలా ఊరుకుంటాను అన్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఏమైనా గానీ పార్టీలో ఎదగాలంటే పార్టీ అధినేత కనుసన్నల్లో.. ఆయన మనసెరిగి ప్రవర్తిస్తేనే ముందుకు వెళ్లగలరు.. ఉన్నతమైన స్థానాలు పొందగలరు. అలాకాకుండా అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయబద్ధమైన కావచ్చు ప్రశ్నలు సంధిస్తే మాత్రం ఖర్చయిపోతారు అని జనసేన అని రుజువు చేస్తున్నారు.వాస్తవానికి సేనాని పొత్తు లేకపోతే మొన్నటి ఎన్నికల్లో కూటమికి అధికారం దక్కేది కాదు. కానీ, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో క్యాబినెట్లో పవన్ కళ్యాణ్‌కు ఏపాటి ప్రాధాన్యం దక్కుతుంది అన్నది జనం మొత్తానికి తెలుసు. ఇది ఎలా ఉంటే గ్రామాల్లో పట్టణాల్లో మండలాల్లో జన సైనికులను తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. జన సైనికులను రాజకీయ కార్యకర్తలుగా కన్నా డబ్బులు ఇస్తే వచ్చే కూలీలుగానే ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకుని చంద్రబాబు వద్ద తాబేదారుగా పని చేస్తున్నపుడు మధ్యలో మీరు ఎందుకు గొంతెత్తుతారు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.అంతేకాకుండా ప్రభుత్వం తరఫున జనసేనకు రావలసిన నామినేటెడ్ పదవులు విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నది. ఎక్కడ ఏ విభాగంలో నామినేటెడ్ పోస్టులు నియామకాలు జరుగుతున్నా అక్కడ జన సైనికులకు కచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. మంచి పోస్టులు ప్రాధాన్యం ఉన్న పోస్టులన్నీ తెలుగుదేశం వాళ్ళు తన్నుకుపోతుండగా మిగిలిపోయిన చిన్నా చితకా పదవులు నామ్ కే వాస్తే జన సైనికులకు దక్కుతున్నాయి. భారీ వేట అనంతరం సింహం తినగా మిగిలిన ఎముకలు బొమికలు దక్కించుకుని కుక్కలు నక్కలు పండగ చేసుకున్నట్లుగా జన సైనికుల పరిస్థితి ఉంది.మొన్న కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 14 పదవులకు గాను 12 పదవులు తెలుగుదేశానికి కేటాయించారు. ఆ పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారు. మిగిలిన రెండు పోస్టులు జనసేనకు చెందిన కాపు నేతలకు ఇచ్చారు. మొత్తం 14 పోస్టుల్లో దాదాపుగా 90 శాతం పదవులు తెలుగుదేశం వారే తీసుకోవడాన్ని అక్కడి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు అవమానకరంగా భావించారు.తమ పార్టీని ఇంత చిన్నచూపు చూడటమా.. మరీ బిచ్చం వేసినట్లు రెండంటే రెండు పదవులు ఇస్తారా అంటూ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. వాస్తవానికి ఇలాంటి పదవులు పంపిణీ జరిగేటప్పుడు జనసేన, తెలుగుదేశం నాయకులు మధ్య సమన్వయం అవసరం. ఇరుపార్టీల నాయకులు చర్చించుకుని పదవులు పంచుకోవాలి. అయితే, రాష్ట్రంలో జనసేనకు పవన్ కళ్యాణ్ మినహా మరో నాయకుడు లేరు. నాగబాబు అప్పుడప్పుడు కనిపించి వెళ్లడమే తప్ప పార్టీలో ఆయనకు అధికారం లేదు.. బాధ్యత కూడా లేదు. దీంతో తమ కష్ట నష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా కార్యకర్తలకు నాయకులకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్‌ను కలవడం అసాధ్యం. దీంతో టీవీ రామారావు అలాంటి సీనియర్ నాయకులు ఇలా తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటారు.కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముఖంగా బయట పెట్టినందుకు టీవీ రామారావుపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశమే పవన్ కళ్యాణ్‌కి ఉంటే ఇలాంటి అంశాలను నోట్ చేసుకొని.. కార్యకర్తలు నాయకులతో చర్చించి తమకు రావాల్సిన పదవులు వాటాను తెచ్చుకునేవారు. కానీ, పవన్‌కు పార్టీ మీద, కార్యకర్తల మీద ఎలాంటి ఆపేక్ష లేనట్లు ఈ సస్పెన్షన్‌తో అర్థమవుతుంది. నేనే చంద్రబాబుకు మరో పాతికేళ్ళు బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ప్రశ్నించడానికి మీరు ఎవరు?. పదవులు కానీ ఇంకేమైనా ప్రయోజనాలు కానీ చంద్రబాబు దయాదాక్షిణ్యలతో ఇస్తే తీసుకోవాలి తప్ప ప్రశ్నిస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. టీవీ రామారావు వంటి సీనియర్ నాయకుడికే పార్టీలో రక్షణ లేకపోతే కిందిస్థాయిలో ఉండే తమకు ఇంకేం ఉంటుందని మండల స్థాయి నాయకులు లోలోన కుమిలిపోతున్నారు-సిమ్మాదిరప్పన్న. -
ఏపీలో నారా సైకో పాలన సాగుతోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణా జిల్లా: బీసీ మహిళ హారికను చంపాలని చూశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హారికను చంపడానికి వచ్చినవారికి పోలీసులు సహకరించారన్నారు. పచ్చగూండాలకు పోలీసులు సపోర్ట్ చేశారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఉన్మాద చర్య. బీసీ మహిళపై ఇంత బరితెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా?. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మీ అరాచకాలన్నీ గుర్తు పెట్టుకుంటాం.ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు?. ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు?. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది.విడదల రజిని మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. సూపర్ సిక్స్ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హేయం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలయినా బీసీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి.వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది? -
ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన మూకలు దాడి చేసిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. హారిక ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడికి పాల్పడ్డారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణమన్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది.?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు...ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు దీనికేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు?. ఈ అకృత్యాలకు కచ్చితంగా ప్రజా కోర్టులో తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది’’ అని వరుదు కళ్యాణి హెచ్చరించారు. -
‘సుపరిపాలన తొలి అడుగు’లో తమ్ముళ్ల తోపులాట..!
తిరుపతి జిల్లా: ‘సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏమో కానీ ‘తెలుగు తమ్ముళ్ల తోపులాట’ కార్యక్రమం మాత్రం సజావుగా సాగుతోంది. ఈరోజు(శనివారం, జూలై 12) తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలోని టీడీపీ ఆఫీస్ వద్ద సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించగా అది రసాభాసాగా మారింది. టీడీపీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శంకర్‌రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల తోపులాట చోటు చేసుకుంది. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ మాజీ ఎంపీపీ బట్ట రమేష్ ఆందోళనకు దిగారు. తనకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదని రమేష్ డిమాండ్ చేశారు. పార్టీలు మారే రమేష్‌ను గౌరవించేది లేదంటూ మరో వర్గం సైతం ఆందోళనకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యార్లగడ్డ వర్సెస్ పొట్లూరి కృష్ణాజిల్లాలోని గన్నవరం కేసరపల్లి వేదికగా తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ మాజీ ఏఎంసీ చైర్మన్ పొట్లూరి బసవరావు వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు విడిపోయారు. ఇది కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన అంశమే కావడం గమనార్హం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ. పర్యటిస్తున్న సమయంలో యార్లగడ్డ పర్యటనను బసవరావు వర్గం బాయ్‌కాట్ చేసింది. గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద బసవరావు వర్గం సమావేశమైంది. దాంతో పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ కోసం కష్టపడితే గెలిచాక ప్రక్కకి నెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం గ్రామ పార్టీ నాయకులు, ,కార్యకర్తలు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తే తమకు సమాచారవ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారని బసవరావు వర్గం నిలదీసింది.ఎమ్మెల్యే యార్లగడ్డ వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని అంటున్నారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తూ కనీస సమాచారం ఇవ్వరా?????గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారు. -
జడ్పీ చైర్పర్సన్ హారిక కారుపై పచ్చమూకల దాడి
గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. గంటకు పైగా కదలకుండా చుట్టుముట్టి..గుడివాడలో టీడీపీ, జనసేన గూండాల ఉన్మాద చర్యలకు పోలీసులు సహకరించారు. జడ్పీ చైర్ పర్సన్ హారిక కారును గంటకు పైగా కదలకుండా చేసినా పోలీసులు నామమాత్రంగానే వ్యవహరించారు. తన కారును చుట్టుముట్టినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడంపై హారిక అసహనం వ్యక్తం చేశారు. .జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం పై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి వేధింపులు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోలీసులను పెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా.. ఓ కేసులో పీఎస్ విచారణకు హాజరైన ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టడంపై వైఎస్సార్సీపీ మండిపడుతోంది. సాక్షి, కృష్ణా జిల్లా: రాజకీయ కక్షలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులపైకి పోలీసులను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తుండడంపై ఆర్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు. పలు కేసుల్లో ఈ మధ్యే బెయిల్ మీద బయటకు వచ్చిన.. కోర్టు ఆదేశాలు మేరకు క్రైమ్ నంబర్ 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణ కోసం గన్నవరం పీఎస్‌కు వెళ్లారు. మధ్యాహ్నాం 12గం. సమయంలో ఆయన స్టేషన్‌కు వెళ్లి విచారణ కోసం సంతకాలు చేశారు. అయితే అప్పటికి విచారణ అధికారి రాలేదు. గత నాలుగు రోజులుగా వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కాస్త త్వరగా విచారించి వంశీని పంపించాలని ఆయన అనుచరులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.అయితే అధికారి రానిది తామేమీ చేయలేమని కిందిస్థాయి సిబ్బంది చెప్పారు. అలా.. మూడు గంటలు గడిచింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఆయన పీఎస్‌లో బెంచీపై అలా కూర్చుని ఉండిపోయారు. చివరకు అధికారి ఇవాళ రాడని.. మళ్లీ విచారణ ఎప్పుడనేది లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ పరిణామంతో ఆయన అనుచరులు ఒకింత అసహనానికి గురయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వంశీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఆ సమయంలో వంశీ వారిని సముదాయించారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆస్పత్రికి వెళ్లారాయన. ఇదీ చదవండి: ఇంత అణచివేతనా? ఇది పోలీసుల రాజ్యమా? లేక.. -
ఆ వాస్తవాన్ని చంద్రబాబు సర్కార్ దాస్తోంది: మేరుగు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం చావులకు చంద్రబాబే కారణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిస్టిలరీల నిర్వాహకులంతా టీడీపీ వారేనని.. మద్యం తయారీకి యథేచ్ఛగా స్పిరిట్‌ను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.‘‘ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ మద్యమే. టీడీపీ నాయకుల ధన దాహానికి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఈ కల్తీ మద్యం దందా వెనుక టీడీపీలోని కీలక నేతలే ఉన్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు...కల్తీ మద్యం తాగి ఇటీవల అనేక మంది హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు’’ అని మేరుగ నాగార్జున ఆరోపించారు. -
‘డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోంది’
కర్నూలు జిల్లా: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముందుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా నిలదీస్తామన్నారు. పత్తికొండలో సీపీఐ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలు చేయకుండా ఇప్పుడు పీ4 అంటూ ప్రజలను మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఒకవైపు అన్యాయం చేస్తూ.. మరొకవైపు బనకచర్ల ఆనడం పట్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోందని, జగన్ అప్పులు చేస్తున్నాడని గగ్గోలు పెట్టిన బాబు, ఇప్పుడు ఏం చేస్తున్నట్లు అని రామకృష్ణ ప్రశ్నించారు. -
తిరుమలపై ఇంత పెద్ద నింద వేస్తారా?
టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన. టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉందిటీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు. -
పోలీసు రాజ్యమా?.. బాబు నియంతృత్వ రాజ్యమా?
ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారుసాక్షి, గుంటూరు: ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో శనివారం ఆయన సుదీర్ఘమైన ఓ పోస్ట్ ఉంచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ఒక పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టశాత్తూ మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే, అసలు మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలోనా? అనే సందేహం కలుగుతోంది’.‘ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు’.‘దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్దతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండొద్దు’. అదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు. పద్దతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరు.. వివరాలు చూస్తే..👉 ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చియార్డు.దారుణంగా ధరలు పతనం కావడంతో, మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చియార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చియార్డు సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు.👉ఏప్రిల్ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా. రామగిరి.‘టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైయస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపైనా కేసు పెట్టారు.👉జూన్ 11. 2025. ప్రకాశం జిల్లా పొదిలి.‘ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.👉జూన్ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి.‘గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేయడంతో పాటు, ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు.👉జూలై 9, 2025. బంగారుపాళ్యం. చిత్తూరు జిల్లా.‘ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యంలోని మార్కెట్‌యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశపెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.‘ప్రతి కేసుకు సంబంధించి ఒక ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్భంధం విధిస్తున్నారు. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు’.రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరాడేది కూడా విపక్షమే. కానీ మా పార్టీని కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అణిచివేసే ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబుగారు నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. ఆ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్ పీపుల్ వాయిస్‌ను నొక్కేస్తున్నారు’. విధంగా అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’.CM @ncbn suppressing dissent with state machineryThe right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025 -
మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే: బొత్స
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసినా ఆరాచకం, అల్లకల్లోలమే మిగిలిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్నీ దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్‌లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు అంటూ మండిపడ్డారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఏ వర్గం సంతృప్తిగా లేదు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టం ఆవిరి అయిపోతుంది. రైతులకు ప్రభుత్వం సాయం అందడం లేదు. రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే. మిర్చి, పొగాకు, ఆక్వా ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి. వైఎస్ జగన్ రైతుల గురించి మాట్లాడితేనే వాళ్ల బాధలు తెలుస్తాయి. ప్రభుత్వం స్పందించే నాటికి పుణ్యకాలం గడిచిపోతోంది. ఎక్కడికక్కడ దోపిడీ నడుస్తోంది.మంత్రుల దోపిడీ..వైఎస్ జగన్ చిత్తూరు వెళ్ళాక కూటమి నేతలకు ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన వచ్చింది. సీజన్ అయ్యాక పర్యటన ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. అంతా అయిపోతే ఇప్పుడు మీరెందుకు ఢిల్లీ వెళ్లారు. పొగాకు రైతులకు కూడా ఇదే అన్యాయం జరిగింది. మిర్చి రైతుల సమస్య అంశంలో కూడా ఇదే జరిగింది. ఈ ప్రభుత్వంలో అంతా దోపిడీనే.. మంత్రుల అవినీతి ఎక్కువైందని చంద్రబాబు అన్నారు. వారి అనుకూల పత్రికలు కూడా అవే వార్తలు రాశాయి. రాజు ఎలాంటి వాడు అయితే మంత్రులు కూడా అలాగే ఉంటారు. ప్రభుత్వంలో మంత్రుల తీరు, పాలనను ఆక్షేపిస్తున్నాను. చంద్రబాబు సరిగ్గా ఉంటే అందరూ బాగుంటారు..డ్రగ్స్ సిటీగా విశాఖ..గంజాయిని అరికడతాం అని ప్రగల్భాలు పలికారు. గంజాయి పోయి ఇప్పుడు విశాఖలోకి డ్రగ్స్ వచ్చాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రగ్స్‌లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు. అభివృద్ధిలో విశాఖను ఏమీ చేయలేకపోయారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. యోగాంధ్ర వలన విశాఖకు ఉపయోగం ఏమిటి?. విశాఖలో జరుగుతున్న భూ బాగోతంపై సీఎం, గవర్నర్‌కు లేఖ రాస్తాను. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది. ఇష్టారీతిన అప్పులు చేశారు. మీరు జగన్ ఇచ్చినట్టు ప్రజలకు ఏమైనా ఇచ్చారా?. ఏపీలో ప్రభుత్వ తీరు మాటలు గొప్ప ఊరు దిబ్బలా ఉంది. రాష్ట్రానికి పన్నుల రాబడి ఎందుకు తగ్గింది?. ప్రజల్లో కొనుగోలు శక్తి లేక ఆదాయం తగ్గుతోంది.సింగయ్య మృతి ఘటనలో కూడా పోలీసులపై ఒత్తిడి చేసి మరి స్టేట్మెంట్ ఇప్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై అకృత్యాలు పెరిగాయి. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవం పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏపీఎండీసీ నుంచి తెచ్చిన రుణాల అవకతవకలపై మాట్లాడుతాను. తప్పులను ఎత్తి చూపుతాం. విశాఖలో పార్కులు కబ్జా చేస్తున్నారు. ఇష్టానుసారంగా టీడీఆర్ కుంభకోణాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ హయాంలో తప్పులు జరిగాయని మాటలు చెప్పారు. ఆ మాటలపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.కూటమి నేతల దోపిడీ, ఆరాచకం..సంవత్సర కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో ప్రజలకు వివరిస్తా. నాడు-నేడు స్కీం ఆపడం మంచిది కాదు. అనకాపల్లిలో లిక్కర్ మాఫియా బయట పడింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో లిక్కర్ మాఫియా నడుస్తోంది. ఎవరి పని వారిని చేసుకోనిస్తే ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో అధికారులకు స్వతంత్రం లేదు. సామాన్యుడికి ఐదు వెళ్ళు నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. కూటమి నేతల దోపిడీ, ఆరాచకాలను ఎందుకు అరికట్టడం లేదు. సంవత్సరంలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు. కూటమి హామీలు విని ప్రజలు మోసపోయారు. కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఫీడ్ బ్యాక్ తెప్పించుకోండి. మాట ఇచ్చాం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
ప్రభుత్వమే కామందుగా మారితే ఎలా?
‘రైతన్నలారా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూ సేకరణకు దిగుతోంది. మీకు నష్టం ఖాయం. అందువల్ల ఎవరూ ప్రభుత్వానికి భూములివ్వొద్దు’ పెదపరిమి గ్రామంలో ఒక వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ మైక్ పెట్టుకుని మరీ చేస్తున్న ప్రకటన. రెడ్‌బుక్ పాలన కాబట్టి ఇలాంటి వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగి ఉండాల్సింది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. పైగా అందరూ ఆసక్తిగా వింటున్నారు. తొలివిడత భూసేకరణలో భాగమైన రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడం వారి మెదళ్లల్లో కదులుతోందేమో!.రాజధాని అమరావతి పేరుతో ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఇంకో 36 వేల ఎకరాలు కావాలంటూ రంగంలోకి దిగింది. ఇది కాస్తా చాలా గ్రామాల్లో తీవ్ర అలజడికి కారణమైంది. తొలి విడతలో సేకరించిన భూమిలో 20 వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకపోవడం మళ్లీ భూమి కావాలని అనడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల ఆందోళనలు, అనుమానాలను తీర్చే ప్రయత్నమేదీ చేయడం లేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు కూడా భూములిస్తే రైతులకు నష్టమేనని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నలభై వేల ఎకరాలు తీసుకున్నా ప్రభుత్వానికి మిగిలేది పదివేల ఎకరాలేనని, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల వంటి వాటికి సరిపోగా కొంత భూమిని మాత్రమే అమ్ముకోగలమని చెబుతోంది. విజయవాడ సమీపంలో ఇప్పటికే ఒక విమానాశ్రయం ఉండగా కొత్తగా ఇంకోదాని అవసరమేంటి? కొత్తగా సేకరించే భూముల్లో 2500 ఎకరాలు అదానీ సంస్థకు కట్టబెట్టేందుకూ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.నాడా దొరికిందని గుర్రాన్ని కొంటారా?ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భూములివ్వమని రైతులు సైకిళ్లపై ప్రచారం చేస్తూంటే ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు.. అందరూ ఒప్పుకున్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. కామాంధులకు భూదాహం ఎక్కువంటారు. కానీ, ప్రభుత్వమే భూదాహంతో వ్యవహరిస్తే, కామాంధులాగా మారితే ఏం చేయాలి!. ప్రజావసరాల కోసం ప్రభుత్వం భూమి తీసుకోవడం తప్పుకాదు. కానీ, ఆ అవసరాలు ఎంత అన్నదానిపై స్పష్టత ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వాధినేతల ఇష్టాలకు తగ్గట్టుగా భూములు సమీకరించి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయిపోతుందని, కోట్ల రూపాయల లాభం వస్తుందని మభ్యపెడితేనే ప్రమాదం. నిజానికి ప్రభుత్వం తనకు అవసరమైన భూములను మంచి ధరకు రైతుల నుంచి ఖరీదు చేసి భవనాలు నిర్మించుకున్నా లక్షల కోట్ల వ్యయం కాదు.హైదరాబాద్ ఆయా రాజధానులకు ప్రభుత్వాలు ఎంత భూమి సేకరించారన్నది పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం భూదాహం ఎంతన్నది స్పష్టమవుతుంది. వేల ఎకరాల భూమి సేకరించి ఏకమొత్తంగా లక్షల కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చేదేమీ ఉండదు. రాజధానిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమంలో ప్రైవేటు సంస్థలే ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఎనెన్నో గేటెడ్ కమ్యూనిటీలు సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లేదు? అలా కాకుండా అన్నీ తామే చేస్తామంటే ఎలా? ఎప్పటికి కావాలి?.ప్రపంచ బ్యాంక్ షరతు..అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఎప్పుడిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. వేల కోట్ల వ్యయమయ్యే మౌలిక సదుపాయాల వృద్ధి ఎప్పటికయ్యేనో తెలియదు. గిరాకీ వస్తే మంచిదేకానీ.. ప్రభుత్వమిచ్చే ప్లాట్లతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగకపోతే? అప్పుడు వారు ఎంత నష్టపోతారో తలచుకుంటేనే బాధ కలుగుతుంది!. ఈ నేపధ్యంలోనే ఒక సాధారణ రైతు.. మైక్ పట్టుకుని భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. రెడ్‌బుక్ అరాచకం ఈ రైతుపైనా జరుగుతుందేమో తెలియదు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి పెట్టిన షరతులలో భూముల అమ్మకం కూడా ఒకటి ఉందట. దాని ప్రకారం భూములు ఎప్పటి నుంచి అమ్ముతారని ఆ బ్యాంకు అడుగుతోందని కథనాలు వచ్చాయి. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల లెక్కన అమ్ముకోవచ్చునని అధికారులు ప్రపంచబ్యాంకుకు తెలిపారట. ఇదసలు సాధ్యమయ్యేదేనా?. ఈ ధరకు కొనగలిగే సంస్థలెన్ని? ఇదే వాస్తవమైతే ఈపాటికి వందల ఎకరాలు అమ్మి ఉండాలి కదా!. ప్రజలను మభ్య పెట్టినట్లు ప్రపంచ బ్యాంకును కూడా మాయ చేయాలని అనుకుంటున్నారా?.మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు రూ.30వేలు మాత్రమే ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. కొత్తగా భూములు సమీకరించే చోట గ్రామస్తులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు రూ.20 వేలు చెల్లిస్తే, ప్రధానమంత్రి కిసన్ యోజన కింద ఇంకో రూ.ఆరు వేలు వస్తాయని వీరంటున్నారు. అంటే.. భూములు తమ వద్దే ఉన్నా రూ.26 వేలు వస్తూండగా.. ప్రభుత్వానికి ఇస్తే వచ్చేది రూ.30 వేలు మాత్రమేనని వివరిస్తున్నారు. కేవలం రూ.4 వేల అదనపు ప్రయోజనం కోసం భూమిపై తమ హక్కులను ఎందుకు కోల్పోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు, కొనుగోలుదారులు.. బాగా నష్టపోయారు. అందువల్లే ఆయా గ్రామసభలలో రైతులు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌ను, అధికారులను నిలదీస్తున్నారట. కొన్ని చోట్ల వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అయినా రైతుల ఆమోదం దొరికినట్లు అధికారులు రాసేసుకుంటున్నారట. భూములు లాక్కుని తమకు బిచ్చగాళ్లగా చేయవద్దని కొందరు మొర పెట్టుకుంటున్నారు.గతంలో సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం అదానీకి భూములు కేటాయిస్తే.. ఏపీని రాసిచ్చేస్తున్నారని నోరు పారేసుకున్న టీడీపీ మీడియా ఇప్పుడు అదానీ స్పోర్ట్స్ సిటీ గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ఆయా సంస్థలకు ఎంత మొత్తానికి భూములు కేటాయిస్తున్నది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ఎకరాకు రూ.20 కోట్లకుపైగా వెచ్చించడానికి సిద్దపడకపోతే ఏం చేస్తారో తెలియదు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నాలుగింటికి రెండున్నర ఎకరాల చొప్పున ఇస్తారట.అంతర్జాతీయ స్థాయిలో నిజంగా ఆ సెంటర్లు ఏర్పాటైతే ఈ స్థలం సరిపోతుందా? ప్రస్తుతం భూదాహంతో తహతహలాడిపోతున్న ప్రభుత్వ పెద్దలు లేచింది లేడికి ప్రయాణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతమంటే తమ సొంత జాగీరన్నట్లుగా భావిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వేల కోట్ల అప్పులు సమీకరించిన ప్రభుత్వ నేతలకు ఇప్పుడు సలహాలు ఇచ్చినా వినే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం ఉంది. అమరావతి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలం! కొసమెరుపు ఏమిటంటే ఈ అదనపు భూమి సమీకరణపై మంత్రివర్గంలో తర్జనభర్జనపడి నిర్ణయం వాయిదా వేయడం!.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ @పెద్దమ్మ భాషా పితామహ..
రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
బాబోరు మళ్లీ ఏసేశారు..!
చంద్రబాబు మళ్లీ ఏసేశారు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన చలవ తన గొప్పతనమే అని చెప్పుకోవడం ఆయనకు జన్మతః వచ్చిన దురలవాటు. హైదరాబాదులో రింగ్ రోడ్డు ఏర్పాటు.. ఐటీ అభివృద్ధి. . పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణం.. నగరంలో ఇతరత్రా ప్రాజెక్టుల తో పాటు ఫార్మా ఇండస్ట్రీ వంటివన్నీ తానే తీసుకొచ్చానని ఎన్నో మార్లు చంద్రబాబు చెప్పారు. అసలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి కూడా తానే స్ఫూర్తి అని ఎన్నోమార్లు చెప్పుకున్నారు.దేశంలో నేషనల్ హైవేస్ నిర్మించాలని నాటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చింది కూడా తానేనని బాబు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. పీవీ సింధు. పుల్లెల గోపీచంద్ వంటివారికి ప్రోత్సాహం కూడా తానే ఇచ్చానన్నారు.. దేశంలో వెయ్యి.. రెండు వేల నోట్లను రద్దు చేయాలని మోదీకి చెప్పింది కూడా తానేనన్నారు. బాబు ప్రకటనలు చూసి నవ్వుకునేవాళ్ళు నవ్వుకున్నారు.. అది వేరే విషయం.ఇలా దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పైగా తను ఏం చెప్పినా తానా తందానా అనడానికి సొంతంగా మీడియా కూడా ఉందాయే. కాబట్టి ఆయన ఆటలు అలా సాగుతున్నాయి మాటలు అలా ముందుకు వెళుతున్నాయి. దేశంలో సంక్షేమ పథకాలను తెచ్చిందే తెలుగుదేశం అని కూడా చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు.కానీ అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో ఐటీ పార్క్‌కు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటివి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయి. కానీ ఇవన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది అంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను సైతం చంద్రబాబు ఎత్తుకొచ్చారు.ప్రపంచ జనాభా తగ్గుతోందంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా అంటే భారం కాదు.. జనమే ఆస్తి అంటూ కొత్త రాగం అందుకున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో జనాభా రేటు తగ్గుతోంది. కానీ, జనాభానే దేశాభివృద్ధికి కీలకం. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో యువత ఎక్కువ ఉంటే.. ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో బహుమతులు కూడా ఇస్తున్నారు. హంగేరిలో పెద్దకుటుంబాలకు కార్లు ఇస్తున్నారు. చైనాలో ఆర్థిక సాయం అందిస్తున్నారు.సమైక్య రాష్ట్రంలో జనాభా నియంత్రణ కోసం పని చేశాం. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని నేనే చట్టం తీసుకొచ్చా. (కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా 1994 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించింది.. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు).ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాభా భారం కాదు.. జనమే ఆస్తి. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడికు ఒక్కడే తనయుడు నారా లోకేష్. నారా లోకేష్‌కు ఒక్కడే కొడుకు.. దేవాన్ష్!!. మరి జనాభా పెంచండి..అని బోడి సలహాలు ఇచ్చే చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు ఎందుకు ఎక్కువమంది పిల్లల్ని కనమని చెప్పలేదు. ఒకే ఒక్కడిని ఎందుకు కన్నాడు..బాబు రూల్స్ పెడతారు.. పాటించరు.. ఆయన నీతులు వల్లిస్తారు.. పాటించరు.-సిమ్మాదిరప్పన్న -
‘మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ ఏమయ్యారు?
విశాఖ: కాకినాడ జీజీహెచ్ రంగరాయ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యంత అమానుష ఘటనపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇది ఏపీలో జరిగిన కీచక పర్వమని మండిపడ్డారు. ల్యాబ్ అసిస్టెంట్ కల్యాణ్ చక్రవర్తి.. మహిళల శరీర ఫోటోలు తీసి పంపడం అత్యంత దారుణమన్నారు. దీన్ని అడ్డం పెట్టకని నెలరోజులక పైగావారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు సైత పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం(జూలై 11) ప్రెస్మీట్లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తేవకపోతే కనుమరుగు అయ్యేది. మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?, 50 మంది మహిళలను నెల రోజుల నుంచి వేధిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. 50 మంది మహిళలను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గాలు హోమ్ మంత్రి అనిత కంటికి కనిపించవా?, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలక ప్రభుత్వం వాడుకుంటుంది’ అని విమర్శించారు.నలుగురు సస్పెన్షన్ కాకినాడ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ఘటనలో నలుగుర్ని సస్పెండ్ చేశారు. వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. ఈ నలుగురిపై కేసు నమోద చేసి దర్యాప్త చేపట్టారు పోలీసులు. -
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఫరీద్ పేట సమీపంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపీని కర్రలు, రాళ్లతో కొట్టి దుండగులు హత్య చేశారు.పట్టపగలు నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ గుండాలే హత్య చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తారు గోపీ వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను దండగులు హత్య చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. -
మూడు కోతుల్లా మూసుకున్న బాబు, లోకేష్, పవన్
సాక్షి, ప్రకాశం: పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ లేదని.. ఈ పాలనలోనూ పేదపిల్లల చదువుకు మోకాలడ్డుపెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే మ్యానిఫెస్టో రీకాలింగ్ పేరిట అని చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె అన్నారు.శుక్రవారం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖమంత్రి అంటే ఎలా ఉండాలో ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్‌ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది లోకేష్ కార్యకర్తలు కాదు... జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు. -
ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్‌కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్‌కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్‌ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు. -
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేధింపు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి,నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేల వేధింపులు తాళ లేక ఆ పార్టీ నేతలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపుల్ని భరించలేక జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాషా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. కోవూరు నియోజకవర్గంలోనీ విడవలూరు మండలం ముదువర్తి గ్రామ పార్టీ కార్యాలయంలో ఇమామ్ భాషా మీడియాతో మాట్లాడారు. ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన అవమానాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.