ఏ డిగ్రీ అభ్యర్థి అయినా టెట్‌కు అర్హుడే

Any degree candidate deserves to TET - Sakshi

    నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం

     బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అర్హత మార్కులు 40

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన టెట్‌–2017 నిబంధనలకు కొన్ని సవరణలో చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు (జీఓ4) జారీచేసింది. బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీ చేసిన వారు మాత్రమే టెట్‌కు అర్హులని ఇదివరకు నిబంధన పెట్టగా బీటెక్‌ డిగ్రీతో బీఈడీ చేసిన తమకూ అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు వారికీ అవకాశం కల్పించేలా ఏ డిగ్రీ చేసినా టెట్‌కు అర్హులేనని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల్లో అర్హత మార్కుల విషయంలోనూ సవరణ చేసింది. అందరికీ ఒకే మాదిరిగా 40 మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించింది. దీంతో పాటు భాషోపాధ్యాయ పోస్టులకు గతంలోని నిబంధనను సవరిస్తూ పరీక్షలో 150 ప్రశ్నల్లో ఆయా లాంగ్వేజ్‌లకు సంబంధించి 60 ప్రశ్నలుండేలా నిర్ణయం తీసుకుంది.

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top