రాంపూర్‌లో రైతు దారుణ హత్య

farmer murdered in Bimini - Sakshi

భీమిని(బెల్లంపల్లి): భీమిని మండలం మల్లీడి గ్రామపంచాయతీలోని రాంపూర్‌ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన జాపల్లి శ్రీనివాస్‌(42)దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం...శనివారం ఉదయం గ్రామస్తులు గ్రామ సమీపంలోని అతని కంది చేనులో శ్రీనివాస్‌ మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో భార్య, కుమార్తె, కుమారుడు, బంధువులు వెళ్లి చూడగా తన కంది చేనులోనే విఘతజీవుడై కనిపించాడు. దీంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. కాగా శ్రీనివాస్‌ మృతదేహం పక్కనే రక్తం మడుగు ఉండటం, మృతదేహం పక్కనే రక్తంతో కూడిన బనియన్‌ ఉంది. రక్తపు మరకలు అంటిన బండరాయి ఉండటంతో బండరాయితోనే మోది శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

విషయం తెలుసుకున్న తాండూర్‌ సీఐ జనార్ధన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను, కుటుంబ సభ్యులను వివరాలు అడిగారు. అనంతరం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ బృందంతో కుటుంబీకులు చెప్పిన అనుమానిత వ్యక్తుల పేర్ల ఇంటి వద్దే పోలీసు జాగిలం వెళ్లింది. దీనిపై పోలీసులు ఎందుకు హత్యకు గురయ్యాడో గల కారణాలు, నిందితులను పట్టుకుంటేనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌కు కూతురు దివ్య, కుమారుడు వంశీ ఉన్నారు. ఈ విచారణలో కన్నెపల్లి ఎస్సై లక్ష్మణ్, తాండూర్‌ ఎస్సై రవి, వైస్‌ ఎంపీపీ గడ్డం మహేశ్వర్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top