Bhojpuri Actress Priyanka Pandit Breaks Silence On Leaked MMS Viral Video - Sakshi
Sakshi News home page

Priyanka Pandit: ప్రైవేట్‌ వీడియో లీక్‌.. కావాలనే చేశారు, నా కెరీర్‌ నాశనం చేశారు

Feb 20 2023 8:04 PM | Updated on Feb 21 2023 8:43 AM

Priyanka Pandit Breaks Silence on MMS Viral Video, My Career Got Ruined - Sakshi

లీకైన వీడియోల్లో ఉన్నది నేను కాదు, నా కెరీర్‌ నాశనం చేశారు..

ఒకప్పుడు అభిమాన తారలను వెండితెరపై చూసి సంబరపడిపోయేవాళ్లు.. కానీ సోషల్‌ మీడియా వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు యాక్టర్స్‌. నటీమణులైతే తమ ఫోటోలను, డ్యాన్స్‌ వీడియోలను పంచుకుంటూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. అలాంటి వారిలో భోజ్‌పురి నటి ప్రియాంక పండిత్‌ కూడా ఒకరు. గ్లామరస్‌ ఫోటోస్‌తో అభిమానులను అల్లాడిస్తుంది ప్రియాంక. కానీ గతేడాది ఆమె పేరిట ప్రైవేట్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయింది.

తనే కాదు, చాలామంది భోజ్‌పురి నటీమణుల పోర్న్‌ వీడియోలు నెట్టింట లీకయ్యాయి. కానీ ఎవరూ బయటకు వచ్చి దాన్ని ఖండించలేదు. అయితే ప్రియాంక మాత్రం దాన్ని ఎంతమాత్రం సహించలేదు. ఆ వైరల్‌ వీడియోల్లో ఉన్నది తాను కాదని, అనవసరంగా తన ప్రతిష్ట దిగజార్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. 'నా ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. దీనివల్ల నా కెరీర్‌ నాశనమైంది' అని ఆవేదన వ్యక్తం చేసింది. దిల్‌ మత్‌ దేనా మేరీ సౌతాన్‌ కో, బెహనోజీ, మేరే ప్యార్‌ కో తుమ్‌ భులాతో న డోగే, పోలీస్‌గిరి వంటి చిత్రాలు చేసింది ప్రియాంక.

చదవండి: నా పెళ్లి సంబంధాలు చెడగొట్టారు: పోసాని కృష్ణమురళి
హీరోతో లవ్‌ బ్రేకప్‌.. నోరు విప్పిన హీరోయిన్‌

Advertisement
 
Advertisement
Advertisement