ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా ఉండడం వేస్ట్‌: తరుణ్‌ భాస్కర్‌ | Director Tharun Bhascker About Marriage Divorce Relationship | Sakshi
Sakshi News home page

వాళ్లు విడాకులు తీసుకోకుండా.. టైం వృథా చేస్తున్నారు: స్టార్‌ డైరెక్టర్‌

Nov 10 2026 6:35 PM | Updated on Nov 10 2026 7:19 PM

Director Tharun Bhascker About Marriage Divorce Relationship

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తాజాగా 'ఈ నగరానికి ఏమైంది 2'తో ప్రేక్షకులను పలకరించడానికి మళ్లీ వస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్‌ పెంచేశారు. తాజాగా తరుణ్ భాస్కర్.. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి వైరల్‌ అవుతున్నాయి.

'ఈ నగరానికి ఏమైంది 2' లాగే 'పెళ్లి చూపులు' సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారా? అని ఓ యాంకర్‌ ప్రశ్నించగా.. 'నాకు ఆ సీక్వెల్ వద్దు. ఈ సినిమాకి వచ్చిన ఒత్తిడికే నేను తట్టుకోలేకపోతున్నా. రిజల్ట్ బాగుండాలని కోరుకుంటున్నా కానీ.. అంచనాలు లేకుండా పని చేయడంలో ఒక హాయి ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలని ఉంది' అని తరుణ్ భాస్కర్ బదులిచ్చారు.

ఎవడి చావు వాడు చస్తాడు
పెళ్లి, పెళ్లి చూపుల గురించి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'నా ఉద్దేశ్యంలో ఏ మనిషికైనా సహవాసం ఉండాలి. ఇప్పుడు జెన్ జీ వాళ్లు పెళ్లి మ్యాటర్‌ని.. సిచ్యువేషన్ షిప్ అని ఏదో అంటున్నారు. పెళ్లి అనేది మనం ఇష్టపూర్వకంగా చేసుకునేది. ఎవరైనా కలిసి బతుకుదాం అనుకుంటున్నారంటే వారిని అలాగే ఉండనివ్వండి. వాళ్లు సంతోషంగా ఉంటారు. ఎవడి చావు వాడు చస్తాడు. ఇప్పుడు చాలా కుటుంబాలలో పెళ్లి చేసుకున్న వాళ్లు మాట్లాడుకోకుండా..  ఇష్టం లేకపోయినా కలిసి జీవిస్తూ అవస్థలు పడుతున్నారు. అలాగే జీవితాంతం భరిస్తున్నారు.  నేను డివోర్స్ తీసుకోకుండా ఉన్నాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ అదంతా సమయం వృథా అంతే' అని అన్నారు.

కాగా విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఈఎన్ఈ రిపీట్(ఈ నగరానికి ఏమైంది రిపీట్‌). 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి స్టార్‌ హీరో సూర్య..?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement