Sathi Leelavathi
-
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 -
ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు అయిపోయింది. గతేడాది వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. పెళ్లికి ముందే ఓ సినిమాని లావణ్య పూర్తి చేయగా అది వాయిదాలు పడుతూ ఈ నెల ప్రారంభ వారంలో వచ్చింది. దీన్ని జనాలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకుడు. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ బాగోలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(మే 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. అంటే రిలీజైన 12 రోజులకే తీసుకొచ్చేస్తున్నారనమాట. తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.'సతీ లీలావతి' విషయానికొస్తే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. తల్లిదండ్రుల గొడవల కారణంగా చిన్నప్పటి నుంచి ఈమెలో ఓ రకమైన భయం ఏర్పడిపోతుంది. దీని నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఈమెకు సాయం చేస్తాడు. అలా ప్రేమలో పడి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ వివాహమైన మూడేళ్లకు తనకు విడాకులివ్వాలని లీలావతిని సేతు అడుగుతాడు. నర్స్ నికోలా(మడోన్నా సెబాస్టియర్)తో ప్రేమలో ఉన్నానని.. విడాకులిస్తే ఆమెనే వివాహమాడతానని చెప్తాడు.భర్త ప్రేమ వ్యవహారం తెలిసిన లీలావతి.. సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు సేతు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ కథలో లాయర్ తమలపాకుల (వీటీవీ గణేశ్), నిర్మాత మెట్ట రాజన్ (మెట్ట రాజేంద్రన్), దొంగ (సప్తగిరి) పాత్రల సంగతేంటి? చివరకు లీలావతి - సేతు విడిపోయారా? ఒక్కటయ్యారా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌ని ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు భారీ ప్రమోషన్స్ చేయడంతో ‘సతీ లీలావతి’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచాల మధ్య నేడు(మే 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా కోడలు సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. ఇంట్లో పెరెంట్స్ తరచూ గొడవలు పడడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఓ భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు(దేవ్ మోహన్)ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారి, నాన్న(నరేశ్) అనుమతిలో పెళ్లి కూడా చేసుకుంటుంది. మూడేళ్ల పాటు చక్కగా కాపురం చేసిన రామ్.. ఉన్నపళంగా విడాకులు కోరతాడు. ప్రస్తుతం తాను నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో రిలేషన్లో ఉన్నానని.. విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. విడిపోవడం ఇష్టంలేని లీలావతి..భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సేతు నేపథ్యం ఏంటి? నర్స్ నికోల అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భర్తను దక్కించుకునేందుకు లీలావతి ఏం చేసింది? లాయర్ తమలపాకుల(వీటీవీ గణేష్)కు ఆమె చెప్పిన అబద్దం ఏంటి? ఆమెకు దొంగ(సప్తగిరి), నిర్మాత మొట్ట రాజర్(మొట్ట రాజేంద్రన్) ఎలాంటి సహాయం చేశారు? చివరకు లీలావతి-రామ్‌సేతు విడాకులు తీసుకున్నారా ? లేదా తిరిగి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విడాకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయాయి. నేటి బిజీ లైఫ్‌లో చిన్న చిన్న విషయాలకు గొడవపడి విడిపోతున్న జంటలు చాలానే ఉంటున్నాయి. అలా విడిపోవడం కరెక్ట్ కాదని.. భార్యాభర్తల బంధానికి మరణంతోనే ముగింపు ఉండాలని సందేశం ఇచ్చిన చిత్రం ‘సతీలీలావతి’. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ఇచ్చిన మేసేజ్ నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఉంది కానీ..దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం కాస్త తడపడ్డాడు. జెన్‌జీ బ్యాచ్‌ని ఆకట్టుకునేలా లీలావతి, సేతుల మధ్య గొడవలను కాస్త వయెలెంట్‌గా చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఇద్దరి పరిచయం.. ప్రేమ, పెళ్లి, గొడవ..ఇదంతా కొంతవరకు ఆకట్టుకునేలా ఉన్నా.. ఎప్పుడైతే భార్య చేతిలో సేతు బంధి అవుతాడు..అప్పటి నుంచి కథనం మలుపు తిరుగుతుంది. కామెడీ కోసమే కొన్ని పాత్రలను ప్రవేశ పెట్టి.. అసలు కథను పక్కదారి పట్టించారు. అయితే ఆ కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల నవ్వించినా.. మరికొన్ని చోట్ల మాత్రం అనవసరం అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథనం కాస్త ఎంటర్టైనింగ్గా సాగుతుంది. లీలా తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను ఉపయోగించుకొని.. కాపురాన్ని ఎలా చక్కదిద్దుకుందనేది సెకండాఫ్ స్టోరీ. అయితే ఆమె వేసే ప్లాన్స్ మరీ సినిమాటిక్‌గా అనిస్తాయి. కిడ్నాప్ డ్రామాతో పాటు స్పైడర్ మ్యాన్ యాక్షన్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్ కాస్త భావోద్వేగానికి గురి చేస్తుంది.ఎవరెలా చేశారంటే.. లీలావతి పాత్రకి లావణ్య న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపిస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకుంది. కామెడీ కూడా బాగానే చేసింది. భర్త చేతిలో బంధీగా మారిన సేతు పాత్రలో దేవ్ మోహన్ ఉన్నంతలో బాగానే చేశాడు. నరేశ్, వీటీవీ గణేశ్, మడోన్నా, సప్తగిరితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మిక్కీ జే మేయర్ పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. బినేంద్ర మేనన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు : లావణ్య త్రిపాఠి
‘‘సతీ లీలావతి’ పూర్తి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం ఉంది’’ అని చెప్పారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా, తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలోని కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. కొన్నిచోట్ల భావోద్వేగాల సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలాగే మంచి సందేశం కూడా ఉంది. కానీ సందేశం ఏదో క్లాస్ చెబుతున్నట్లుగా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు. ఇక కమల్‌హాసన్‌గారి ‘సతీ లీలావతి’తో మా చిత్రాన్ని పోల్చలేం. అదొక క్లాసిక్ చిత్రం. కానీ మా చిత్రంలో ఆడియన్స్ ఎంజాయ్ చేయగల కామెడీ ఉంది’’ అని అన్నారు. -
చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మా బావ రామ్ చరణ్‌కి స్పెషల్ థాంక్స్ : లావణ్య త్రిపాఠి
‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అడగగానే మా కోసం ‘సతీ లీలావతి’ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది’ అన్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఆమె, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.దేవ్ మోహన్ మాట్లాడుతూ .. ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాతినేని సత్య, నాగ మోహన్, తాగుబోతు రమేష్ , సప్తగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
‘అరుంధతి’గా మెగా కోడలు.. నవ్వులు పూయిస్తున్న ‘సతీ లీలావతి’ ట్రైలర్
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. మే 8న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. భార్యాభర్తల మధ్య గొడవతో మొదలయ్యే ఈ కథలో భార్య లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి, భర్తగా దేవ్ మోహన్ నటించారు. ‘20 ఏళ్ల నా పెంపకంలో కనబడని నవ్వు.. మూడేళ్ల మీ సంసార జీవితంలో నీ మొఖంలో కనిపిస్తుంది’ అంటూ నరేశ్.. లావణ్యతో చెప్పే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘ఇంతకీ అల్లుడెక్కడ?’ అని నరేశ్ అడగడం.. అతన్ని కిడ్నాప్ చేసి తెలియదు అన్నట్లుగా లావణ్య నటించడం..మధ్యలో ‘నికోలా సెబాస్టియన్’ పాత్ర ఎంట్రీ తో ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్ సాగింది. ఇక చివరిలో లావణ్య అరుంధతిగా మారి ‘నువ్వు నన్నేం చేయలేవురా’అనే డైలాగు చెప్పడం బట్టి చూస్తే.. సినిమాలో నవ్వులు పూయించే సన్నివేశాలు బాగానే ఉన్నట్లు అర్థమవుతుంది. -
మెగా కోడలి కొత్త సినిమా.. క్రేజీ లవ్ సాంగ్ వచ్చేసింది
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సతీ లీలావతి మూవీ క్రేజీ లవ్ సాంగ్ విడుదలైంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి మధురం అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, చారులత మణి ఆలపించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట ఆడియన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు. -
గర్భంతోనే ‘సతీ లీలావతి’ షూటింగ్లో పాల్గొన్నా: లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. నాగ మోహన్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ–‘‘సతీ లీలావతి’ సినిమా ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. మూడు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. దర్శక–నిర్మాతల సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘కమల్‌హాసన్‌గారి ‘సతీ లీలావతి’ చిత్రంతో నా సినిమాను పోల్చను. కానీ ప్రేక్షకులందరూ రిలేట్ అయ్యేలా మా సినిమాను తీశాం’’ అని చెప్పారు తాతినేని సత్య. ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను’’ అని చెప్పారు నాగ మోహన్. నటుడు సప్తగిరి మాట్లాడారు. -
లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
'సతీ లీలావతి'గా మెగా కోడలు.. పెళ్లి పాట చూశారా?
వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ మూవీలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లో నాగ మోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చిత్తూరు పిల్లా అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!)పెళ్లి వేడుకలో వచ్చే ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పెళ్లిపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. నూతన్ మోహన్, కృష్ణ తేజస్వీ, రితేష్ జి రావు పాడారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ ఈ సంగీతమందిచారు. ఈ చిత్రంలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. The sound of love, joy, and celebration 💃🕺#ChittoorPilla lyrical video from #SathiLeelavathi is OUT NOW! 🎶- https://t.co/abxPxwEmbxA @MickeyJMeyer Musical 🎶Sung by 🎤 : @Nutana_Mohan, @krishnatejasvi_ & #RiteshGRaoLyrics by ✍: #Vanamali@ActorDevMohan @SatyaTatineni… pic.twitter.com/VM1IrkU1eh— Lavanya konidela tripathi (@Itslavanya) August 12, 2025 -
గర్భంతో ఉండగా అలా ఎలా చేశావ్?: లావణ్య త్రిపాఠి సోదరి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అవుతోంది. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్‌డే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కి కాస్త గ్యాప్ తీసుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఓకే చెప్పిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. గతేడాది డిసెంబర్లో లావణ్య ఈ సినిమాలో భాగమైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. మే నెలలో చిత్రీకరణ వేగవంతం చేశారు. మరోపక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా కానిచ్చేశారు. గర్వంగా ఉందిమొత్తానికీ సినిమాను ఇటీవలే విజయవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల క్రితమే సతీలీలావతి టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రెగ్నెన్సీతో ఉండగానే చాలా వరకు సినిమా షూటింగ్లో పాల్గొందట లావణ్య. ఈ విషయాన్ని లావణ్య అక్క శివాని త్రిపాఠి వెల్లడించింది. సతీలీలావతి టీజర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లావణ్య, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ ట్రిమిస్టర్ (ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు) మొత్తం పని చేస్తూనే ఉన్నావు, అలా ఎలా చేయగలిగావు? ప్రతిసారిలాగే ఈసారి కూడా టాలెంట్‌తో చంపేశావు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు లావణ్య థాంక్యూ అని రిప్లై ఇచ్చింది.ప్రేమ పెళ్లివరుణ్ తేజ్, లావణ్య 'మిస్టర్' సినిమాలో తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో వివాహం జరగ్గా, హైదరాబాద్ గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలలో.. లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న లావణ్య.. ఓటీటీలో పులిమేక, మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌లు చేసింది. చదవండి: ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే? -
ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. మొన్నీమధ్య భర్త వరుణ్ తేజ్‌తో కలిసి పుట్టబోయే బిడ్డ కోసం దుబాయిలో షాపింగ్ కూడా చేసొచ్చారు. అలానే లావణ్య బేబీ బంప్‌తో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సరే ఇదంతా పక్కనబెడితే ఈమె నటించిన లేటెస్ట్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మరోసారి హంగామా చేసిన నటి కల్పిక)టీజర్ బట్టి చూస్తుంటే ఇది భార్యభర్తల స్టోరీతో తీసిన ఫన్నీ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. భార్యగా లావణ్య, భర్తగా దేవ్ మోహన్ నటించారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే మనం ఇక కలిసుండలేం అని భర్త అంటే, అతడిని ఇంట్లోనే కట్టిపడేసి ఏం చేసిందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఇందులో లావణ్య, దేవ్ మోహన్‌తో పాటు వీటీవీ గణేశ్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ తదితరులు నటించారు.తాతినేని సత్య చాలాకాలం తర్వాత తెలుగులో ఈ సినిమాతో దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. ప్రస్తుతానికైతే టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో? ఇప్పటికైతే లావణ్య త్రిపాఠి చేతిలో ఉన్న తెలుగు సినిమా ఇదొక్కటే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత తెలుగులో మూవీస్ చేస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్) -
మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సతీ లీలావతి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం.(ఇది చదవండి: 'కొణిదెల లావణ్య త్రిపాఠి'గా మొదటి సినిమా ప్రకటన)భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలను తెలియజేస్తూ ఎమోషనల్ అంశాలతో సతీ లీలావతి సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. -
సతీ లీలావతి వినోదం
లావణ్యా త్రిపాఠి(Lavanya Tripathi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. మలయాళ నటుడు దేవ్ మోహన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. తాతినేని సత్య దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో ఎమ్. నాగమోహన్ బాబు, టి.రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ టీఎల్వీ ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామా ‘సతీ లీలావతి’. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో తెరకెక్కుతోంది. సోమవారం నుంచే రెగ్యులర్ చిత్రీకరణప్రారంభిస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఈ స్క్రిప్ట్ వినగానే నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందనిపించింది’’ అన్నారు నిర్మాతలు ఎమ్. నాగమోహన్ బాబు, టి. రాజేష్. -
'కొణిదెల లావణ్య త్రిపాఠి'గా మొదటి సినిమా ప్రకటన
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాను ప్రకటించారు. గతేడాదిలో వరుణ్ తేజ్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన ఆమె సుమారు ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. లావణ్య సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందంటూ కూడా నెట్టింట ప్రచారం జరిగింది. కానీ, నేడు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే, ఈ సినిమాతో కొణిదెల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ఉపయోగించడం విశేషం.'సతీ లీలావతి' అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నట్లు లావణ్య త్రిపాఠి ప్రకటించారు. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా ఒక వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంది. భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్యనే ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు తన వివాహం అయిన తర్వాత గ్లామర్ రోల్స్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపే మొగ్గుచూపుతుంది. ఈ క్రమంలోనే సతీ లీలావతి చిత్రంలో డిఫరెంట్ రోల్లో కనిపించనుంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్న ఇతర నటీనటులు ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు. -
చిన్నింటి నుంచి పతిని ఇంటికి తెచ్చుకున్న సతీ లీలావతి
హలో వరకూ అయితే ఓకే. కలిసి భోం చేద్దామా అన్నప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. ఈ సండే ఖాళీయేనా అని ఎంక్వయిరీ చేస్తే ప్రాబ్లమ్ ఇంకా పెద్దదైనట్టే. అర్ధరాత్రి ఒక ఫోన్. ఎవరూ లేనప్పుడు ఇంటికి రాకడ. అంటే ఏమని? నిండా మునిగామని. తప్పు చేయకుండా మనిషి ఉండడు.ఆకర్షణలో పడకుండా కూడా ఉండడు. అటువంటి సమయంలోనే మనం ఏంటి, ఎక్కడున్నాం, ఇది చేస్తే ఎంత సమస్య అనే ఇంగితాన్ని పాటించి సంయమనం వహించాలి. లేకుంటే, ఏమవుతుందిలే అని అనుకుంటే సమస్య పీకకు చుట్టుకుంటుంది. ఒక్కోసారి పీక తెగి పడవచ్చును కూడా. ఈ సినిమాలో హీరా ఒక అందమైన యువతి. దుష్టురాలు కాదు. దుర్మార్గురాలు కాదు. తను చాలా దయనీయమైన బాల్యాన్ని చూసింది కనుక కాస్త డబ్బున్నవాణ్ణి చూసి పెళ్లాడాలనుకుంటుంది. డబ్బున్నవాణ్ణి అని అనుకుంది తప్ప అతడు ఇది వరకే పెళ్లయినవాడా కాదా అన్నది చూసుకోలేదు. ఫలితంగా పెళ్లయిన రమేశ్ అరవింద్ ఆమెకు పరిచయం అవుతాడు. ఆమెను దగ్గరకు తీస్తాడు. ఆమెకు దాదాపు భార్య స్థానం ఇస్తాడు. దాదాపు అని ఎందుకు అనంటే ఈ సమాజంలో అంతకుమించి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి. పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు ఉండి వారికి అన్యాయం చేసి ఇంకొకరితో తిరుగుతానంటే లోకం ఊరుకోదు. వాతలు పెడుతుంది. ఇతను హీరాకు ఫ్లాట్ ఇచ్చిందీ, అక్కడకు రోజూ రాకపోకలు సాగిస్తున్నదీ, ఇంట్లో అబద్ధాలు చెప్పి తిరుగుతున్నదీ అన్నీ భార్య కల్పన దృష్టికి వస్తాయి. మొదట తిడుతుంది. ఆ తర్వాత కొడుతుంది. ఆ తర్వాత నేను కావాలా ఆమె కావాలా తేల్చుకో అని నిలదీస్తుంది. అతడేం చెప్తాడు? ఒకవైపు ఇద్దరు పిల్లలను కని, షేప్ అవుట్ అయ్యి, పూజలు పునస్కారాలు అంటూ తిరిగే పాతముఖం భార్య. మరో వైపు బాబ్ కట్‌తో, అందమైన డ్రస్సులతో, సన్నగా నాజుకుగా ఉన్న ప్రియురాలు. మనవాడు ఇటే మొగ్గుతాడు.ప్రియురాలే పానకం అనుకొని వెళ్లిపోతాడు.ఇప్పుడు ఏమిటి చేయడం?మునిగిన వాడికి చలివేయదు.కాని ఒడ్డున ఉన్నవారికి ఒకటే ఒణుకు. జైలు నుంచి పారిపోయిన దొంగ ఈజీగా పోలీసులకు చిక్కుతాడు. ఎందుకంటే అతడు సరాసరి ఇంటికి వస్తాడు కనుక వాళ్లు అక్కడే కాచుకుని ఉండి చేజిక్కించుకుంటారు. ఇంకో ఆడదాని మోజులో పడి వెళ్లిన మగవాడికి కూడా ఇల్లు పీకుతూ ఉంటుంది. పిల్లలు మనసులోకి వస్తుంటారు. ఆ పాత జీవితం తాలూకు గిల్ట్ ఏదో లాగుతూ ఉంటుంది. అందుకే కల్పన అతడి మీద పిల్లలను ఎక్కుపెడుతుంది. ఏ ఫ్లాట్‌లో అయితే రమేశ్ అరవింద్ హీరాతో ఉంటున్నాడో ఆ ఫ్లాట్‌కు పిల్లలను పంపించేస్తుంది. ఆ తర్వాత మామగారిని పంపించేస్తుంది. వాళ్లు అక్కడ తిష్ట వేస్తారు. ఈ పాత బంధాల పాశం కొత్తబంధపు మోజు వీటి మధ్య భర్త నలుగుతాడు. హీరా కూడా ఏమిటి ఈ తలనొప్పి అనుకుంటుంది. మరోవైపు రమేశ్ స్నేహితుడైన కమలహాసన్ పదే పదే ఈ బంధాన్ని డిస్కరేజ్ చేస్తుంటాడు. అప్పటికి రమేశ్ అరవింద్‌కు హీరా మీద మోహం, హీరాకు రమేశ్ అరవింద్‌తో అవసరం తీరిపోయాయి. అక్కడి నుంచి ముందుకు పోయేంత గాఢత, నిజాయితీ వారి బంధంలో లేదు. ఎప్పుడో వాళ్ల మనసుల్లో పగుళ్లు ఏర్పడిపోయాయి. ఈ సందర్భాన్ని కల్పన అదునుగా తీసుకుంటుంది. హీరాను అదివరకే ప్రేమించి ఉన్న దగ్గుపాటి రాజాతో ఆమెను కలుపుతుంది. వాళ్లు ఒకరికొకరు సన్నిహితంగా ఉండటం చూసి రమేశ్ అరవింద్ మనసు విరిగిపోతుంది. ఆమె తనకు ద్రోహం చేసినట్టు భావిస్తాడు. కాని తను మాత్రం తన భార్యకు చేసింది ద్రోహం కాదా?మధ్యలో వచ్చిన గాలివాన పూర్తిగా వెలిసిపోతుంది. రమేశ్ అరవింద్ లెంపలు వేసుకుని భార్య దగ్గరకు చేరుకుంటాడు. హీరా తన ప్రియుడితో కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్లిపోతుంది. పెళ్లి ఒక సిస్టమ్ కావడం వల్ల మాత్రమే మన దేశంలో గొప్పగా నిలబడలేదు. పెళ్లి వల్ల ఏకమైన స్త్రీ, పురుషులు కూడా ఆ సిస్టమ్ పట్ల తమ గౌరవాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఎన్ని చికాకులు, ఆకర్షణలు, పక్కచూపులు, పెను అపార్థాలు వచ్చినా పెళ్లిని కాపాడుకుంటూ ఉన్నారు. సతీ లీలావతులు నేరుగా కనపడతారు. పతి దేవుళ్లు నిశ్శబ్దంగా ప్రాధేయపడి ఇంటిని నిలబెట్టుకుంటారు.సతీ పతి మధ్య ఏ కష్టమైనా రావచ్చు. కాని ‘మూడో వ్యక్తి’ మాత్రం రారాదు.అలా వచ్చిన మరుక్షణం ‘పరస్పర విశ్వాసం’ అనే మస్కిటోమేట్ని వెలిగించి ఆ దోమను తరిమికొట్టాలి.లేకుంటే ‘నమ్మకం’ అనే బ్యాట్ ఆడించాలి. అదిగో ఆకర్షణ. టప్. 1995లో కమలహాసన్ తన స్వీయ నిర్మాణంలో బాలూ మహేంద్ర దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘సతీ లీలావతి’. తమిళంలో పెద్ద హిట్టయ్యి అదే పేరుతో తెలుగులో డబ్ అయితే ఇక్కడా పెద్ద హిట్ అయ్యింది. దీనికి మూలం భాగ్యరాజా ‘చిన్నిల్లు’ అని చెప్పుకోవచ్చు. ఇదే సినిమాను హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘బీవీ నంబర్ 1’గా తీస్తే అక్కడా హిట్ అయ్యింది. ఈ మధ్య దీనినే ఇవివి ‘కితకితలు’గా తీశారు. భర్త ప్రాణాల కోసం పోరాడిన పతివ్రతలు మనకు తెలుసు. కాని భర్తను భర్తగా దక్కించుకోవడానికి భార్య చేసే పోరాటమే ఈ సినిమా. దీనిని లైటర్ వెయిన్‌లో చెప్పడం వల్ల ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కమల్‌హాసన్ డాక్టర్‌గా శ్రీకాకుళం భాష మాట్లాడే స్నేహితుడిగా కనిపిస్తాడు. ఇతడి భార్యగా కోవై సరళ ఆశ్చర్యపరుస్తుంది. కమలహాసన్‌కు బాలూ డబ్బింగ్ చెప్పడం ఆనవాయితే అయినా నాగూర్ బాబూ అంతే బాగా చెప్పడం విశేషం. ఎయిర్‌పోర్ట్‌లో కమలహాసన్ రమేశ్ అరవింద్‌ను ఇబ్బంది పెట్టడం, హోటల్లో రమేశ్ అరవింద్ హీరాతో ఉండగా అతడి నడుము పట్టేయడం, క్లయిమాక్స్‌లో కోవై సరళ కమలహాసన్‌ను అపార్థం చేసుకోవడం ఇవన్నీ బాగా నవ్వు తెప్పిస్తాయి. నటి ఊర్వశి సోదరి అయిన కల్పన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె ‘ఊపిరి’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే మృతి చెందడం ప్రేక్షకులకు గుర్తు. – కె. బాలూ మహేంద్ర, కల్పన -
రెండో పెళ్లి చేసుకున్న నటి ఊర్వశి
ప్రముఖ నటి ఊర్వశి రెండో పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్‌ను ఆమె పునర్వివాహం చేసుకున్నారు. సివిల్ ఇంజనీర్ అయిన శివప్రసాద్‌కు నిర్మాణరంగ సంస్థ ఉంది. కొన్ని నెలల క్రితం రహస్యంగా వీరి వివాహం జరిగింది. ఈ విషయాన్ని కేరళకు చెందిన ఓ మేగజీన్ వెల్లడించింది. తన సోదరుడు కమల్‌కు శివప్రసాద్ మంచి మిత్రుడని, ఆయన తనకు బంధువులాంటి వాడని ఊర్వశి తెలిపారు. తమ కుటుంబం గురించి ఆయనకు బాగా తెలుసునని చెప్పారు. మలయాళ నటుడు మనోజ్ కె జయన్‌ను 2000లో ఊర్వశి వివాహం చేసుకున్నారు. 2008లో వీరిద్దరూ వీడిపోయారు. అప్పటినుంచి మళ్లీ సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో ఆమె నటించారు. కమల్ హాసన్‌తో ఆమె నటించిన సతీ లీలావతి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది.


