‘అరుంధతి’గా మెగా కోడలు.. నవ్వులు పూయిస్తున్న ‘సతీ లీలావతి’ ట్రైలర్‌ | Sathi Leelavathi Movie trailer Out | Sakshi
Sakshi News home page

అల్లుడెక్కడ... నవ్వులు పూయిస్తున్న సతీ లీలావతి’ ట్రైలర్‌

May 2 2026 12:21 PM | Updated on May 2 2026 12:53 PM

Sathi Leelavathi Movie trailer Out

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’.  ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. మే 8న ఈ మూవీ విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. భార్యాభర్తల మధ్య గొడవతో మొదలయ్యే ఈ కథలో భార్య లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి, భర్తగా దేవ్‌ మోహన్‌ నటించారు. 

‘20 ఏళ్ల నా పెంపకంలో కనబడని నవ్వు.. మూడేళ్ల మీ సంసార జీవితంలో నీ మొఖంలో కనిపిస్తుంది’ అంటూ నరేశ్‌.. లావణ్యతో చెప్పే డైలాగ్‌లో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. ‘ఇంతకీ అల్లుడెక్కడ?’ అని నరేశ్‌ అడగడం.. అతన్ని కిడ్నాప్‌ చేసి తెలియదు అన్నట్లుగా లావణ్య నటించడం..మధ్యలో ‘నికోలా సెబాస్టియన్‌’ పాత్ర ఎంట్రీ తో ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్‌ సాగింది. ఇక చివరిలో లావణ్య అరుంధతిగా మారి ‘నువ్వు నన్నేం చేయలేవురా’అనే డైలాగు చెప్పడం బట్టి చూస్తే.. సినిమాలో నవ్వులు పూయించే సన్నివేశాలు బాగానే ఉన్నట్లు అర్థమవుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement