మా బావ రామ్‌ చరణ్‌కి స్పెషల్‌ థాంక్స్‌ : లావణ్య త్రిపాఠి | Lavanya Tripathi Talks About Sathi Leelavathi At Trailer Release Event | Sakshi
Sakshi News home page

మా బావ రామ్‌ చరణ్‌కి స్పెషల్‌ థాంక్స్‌ : లావణ్య త్రిపాఠి

May 2 2026 3:06 PM | Updated on May 2 2026 3:23 PM

Lavanya Tripathi Talks About Sathi Leelavathi At Trailer Release Event

‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అడగగానే మా కోసం ‘సతీ లీలావతి’ట్రైలర్‌ రిలీజ్‌ చేయడానికి ఒప్పుకున్న  మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది’ అన్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఆమె, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దేవ్ మోహన్ మాట్లాడుతూ .. ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాతినేని సత్య, నాగ మోహన్, తాగుబోతు రమేష్ , సప్తగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement