అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు : లావణ్య త్రిపాఠి | Lavanya Tripathi Speech at SathiLeelavathi Pressmeet | Sakshi
Sakshi News home page

అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు : లావణ్య త్రిపాఠి

May 7 2026 6:05 AM | Updated on May 7 2026 8:52 AM

Lavanya Tripathi Speech at SathiLeelavathi Pressmeet

– లావణ్య త్రిపాఠి

‘‘సతీ లీలావతి’ పూర్తి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం ఉంది’’ అని చెప్పారు హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి. దేవ్‌ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా, తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్‌ సమర్పణలో నాగమోహన్‌ నిర్మించిన ఈ సినిమా నెల 8న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను డైరెక్టర్‌ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలోని కామెడీని అందరూ ఎంజాయ్‌ చేస్తారు. కొన్నిచోట్ల భావోద్వేగాల సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలాగే మంచి సందేశం కూడా ఉంది. కానీ సందేశం ఏదో క్లాస్‌ చెబుతున్నట్లుగా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రిలేషన్స్‌ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు. ఇక కమల్‌హాసన్‌గారి ‘సతీ లీలావతి’తో మా చిత్రాన్ని పోల్చలేం. అదొక క్లాసిక్‌ చిత్రం. కానీ మా చిత్రంలో ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేయగల కామెడీ ఉంది’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement