గర్భంతో ఉండగా అలా ఎలా చేశావ్‌?: లావణ్య త్రిపాఠి సోదరి | Lavanya Tripathi Completed Sathi Leelavathi Movie During Pregnancy | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: ప్రెగ్నెన్సీలో మూడు నెలలు పని చేస్తూనే ఉన్న లావణ్య.. అలా ఎలా?

Aug 1 2025 5:37 PM | Updated on Aug 1 2025 5:52 PM

Lavanya Tripathi Completed Sathi Leelavathi Movie During Pregnancy

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అవుతోంది. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్‌డే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కి కాస్త గ్యాప్‌ తీసుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఓకే చెప్పిన ప్రాజెక్ట్‌ సతీ లీలావతి. గతేడాది డిసెంబర్‌లో లావణ్య ఈ సినిమాలో భాగమైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుపెట్టారు. మే నెలలో చిత్రీకరణ వేగవంతం చేశారు. మరోపక్క డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా కానిచ్చేశారు. 

గర్వంగా ఉంది
మొత్తానికీ సినిమాను ఇటీవలే విజయవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల క్రితమే సతీలీలావతి టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. అయితే ప్రెగ్నెన్సీతో ఉండగానే చాలా వరకు సినిమా షూటింగ్‌లో పాల్గొందట లావణ్య. ఈ విషయాన్ని లావణ్య అక్క శివాని త్రిపాఠి వెల్లడించింది. సతీలీలావతి టీజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. లావణ్య, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఫస్ట్‌ ట్రిమిస్టర్‌ (ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు) మొత్తం పని చేస్తూనే ఉన్నావు, అలా ఎలా చేయగలిగావు? ప్రతిసారిలాగే ఈసారి కూడా టాలెంట్‌తో చంపేశావు అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు లావణ్య థాంక్యూ అని రిప్లై ఇచ్చింది.

ప్రేమ పెళ్లి
వరుణ్‌ తేజ్‌, లావణ్య 'మిస్టర్‌' సినిమాలో తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో వివాహం జరగ్గా, హైదరాబాద్‌ గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలలో.. లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న లావణ్య.. ఓటీటీలో పులిమేక, మిస్‌ పర్ఫెక్ట్‌ వెబ్‌ సిరీస్‌లు చేసింది. 

 

చదవండి: ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్‌ నరసింహ'.. కలెక్షన్స్‌ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement