Entertainment
-
డిజిటల్ జోరు..!
కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్ సంస్థలు తమ బడ్జెట్లో దాదాపు సగభాగాన్ని డిజిటల్కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అడ్వర్టైజింగ్ పరిశ్రమలో డిజిటల్ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్‌పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది. 2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్ ఆడియన్స్‌ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్‌కి సానుకూలాంశంగా ఉంటోంది. టెలికం అత్యధిక కేటాయింపులు.. టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్‌కి కేటాయిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, స్టార్టప్‌లు మొదలైనవి ఎక్కువగా ఆన్లైన్ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్ వీడియోలు, సోషల్ కామర్స్‌లపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా హవా...డిజిటల్ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్లైన్ వీడియోలు 29%, పెయిడ్ సెర్చ్ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్లైన్ వీడియో, సోషల్ మీడియా, పెయిడ్ సెర్చ్‌లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్ మీడియాకు కేటాయిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అకౌంట్ డైరెక్టర్ సాయి సిద్ధార్థ్ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్ అడ్వర్టైజింగ్ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఓటీటీ.. బంపర్ హిట్
డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవల (ఓటీటీ) ముందు నేడు సినిమా థియేటర్లు, టీవీలు చిన్నవైపోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వీక్షకులను కాపాడుకునేందుకు టీవీ చానళ్లు తంటాలు పడుతున్నాయి. వీటికి అందనన్నట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్, యూట్యూబ్, జీ5, సోనీలివ్, ఆహా.. ఇలా ఓటీటీల జాబితా చాలా పెద్దదే. ఓటీటీ సేవలకు 4జీ టెలికం ఊతమిస్తే.. కరోనా విపత్తు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలుల కుస్తీపట్లకు వేదికైన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వీక్షకులు ఉన్నది భారత్‌లోనేనని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రా, ఎన్ఎక్స్టీ, స్మాక్‌డౌన్ ఇలా ప్రతి ఫార్మాట్‌కు సంబంధించి షోలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 2019లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మాట్లను భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనార్హం. చేతిలో స్మార్ట్‌టీవీ మాదిరిగా ఓటీటీ పరిశ్రమ విస్తరిస్తోంది. విస్తరణ వ్యూహాలు.. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ‘శివరాపల్లి’ వెబ్‌సిరీస్ అదరగొడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ షోలలో ‘పంచాయత్’ ఒకటి. మొదట హిందీలో వచ్చిన ఈ షో ఆ తర్వాత తమిళంలోకి ‘తలైవెట్టియాన్ పాళయం’పేరుతో అనువదించగా, అక్కడా దుమ్ము దులుపుతోంది. ఆ తర్వాత శివరాపల్లి పేరుతో గత నెలలో విడుదలై క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 8,500 టైటిళ్లను ఆఫర్ చేస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను వేగంగా ప్రైమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. సెలబ్రిటీ షోల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’, ‘రాకెట్ బోయ్స్’, షార్క్ ట్యాంక్ ఇండియా, మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యూజర్లను 3.3 కోట్లకు పెంచుకోవడం గమనార్హం. 5.5 కోట్ల యూజర్లు కలిగిన జియోహాట్‌స్టార్ అయితే.. రిలయన్స్ జియోకి ఉన్న 42 కోట్ల కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. సాధారణంగా ఒక వెబ్‌సిరీస్‌లో 6–7 షోలు ఉంటే.. 100 వరకు ఎపిసోడ్లతో సి రీస్ తీసుకురావాలని నిర్మాతలను కోరుతోంది. తద్వారా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచుకోవాలని అనుకుంటోంది. విలీనాలు.. కొనుగోళ్లుభారీ మార్కెట్, అదే సమయంలో గణనీయమైన పోటీ నేపథ్యంలో ఓటీటీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న డిస్నీ హాట్‌స్టార్.. తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న జియో సినిమాస్‌తో చేతులు కలపడం పరిశ్రమలో స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడినట్టయింది. పరిశ్రమలో ఇప్పుడు జియోహాట్‌స్టార్ నంబర్ 1 ప్లేయర్. జీతో విలీనం అయ్యేందుకు సోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీ పెరగడంతో అమెజాన్ లైట్ పేరుతో ఒక్కరు/ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ చార్జీల నమూనాను తీసుకొచ్చింది. అలాగే, 2024లో ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసి.. దీనిపై ఉచిత కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది.భారీగా ఆదాయం.. 2024లో ఓటీటీ సంస్థలు రూ.35,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో యూజర్ల సబ్‌్రస్కిప్షన్ చార్జీలతోపాటు ప్రకటనల ఆదాయం కలిసి ఉంది. ఇందులో 40 శాతం యూట్యూబ్‌కే రావడం గమనార్హం. 2022లో 11.2 కోట్ల ఓటీటీ యూజర్లు కాస్తా, 2023లో 9.6 కోట్లకు తగ్గారు. దీంతో మరింత కంటెంట్‌తో, చౌక ప్లాన్లతో ఓటీటీలు 2024లో యూజర్లను 12.5 కోట్లకు పెంచుకున్నాయి. కెనక్టెట్ టీవీల (ఇంటర్నెట్ అనుసంధానం కలిగినవి) కొనుగోళ్లు పెరుగుతుండడం ఓటీటీలకు మరింత డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్‌కు బదులు పెద్ద సైజు టీవీ తెరలపై షోలను వీక్షించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమ ఆదాయం 2022లో రూ.21,600 కోట్లుగా ఉంటే, 2023లో రూ.30,300 కోట్లకు, 2024లో రూ.35,600 కోట్లకు వృద్ధి చెందింది. వృద్ధికి భారీ అవకాశాలు.. 90 కోట్ల టీవీ వీక్షకులతో పోల్చి చూస్తే.. 12.5 కోట్ల వీక్షకులు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మందిని చేరుకునేందుకు గణనీయమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2024 నాటికి 65 కోట్ల మంది ఉంటారని అంచనా. 5 కోట్ల కనెక్టెడ్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే ఓటీటీల విస్తరణకు దండిగా అవకాశాలున్నాయన్నది విశ్లేషుకుల అభిప్రాయం. తొమ్మిదేళ్ల క్రితం ఫస్ట్ గేర్‌లోకి ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యూజర్లకు వేగంగా చేరువ కాగా, దేశంలోని ఇతర ప్రాంతాల వారికీ తమ కంటెంట్‌ను చేరువ చేయాల్సి ఉందంటున్నారు. ఇందుకు వీలుగా ప్రకటనలతో కూడిన తక్కువ సబ్‌్రస్కిప్షన్ ప్యాక్‌లు సాయపడతాయని చెబుతున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
టీవీ స్టార్ టు మాస్టర్‌చెఫ్
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి చాలా మంది ఇష్టపడరు. ‘ఎందుకొచ్చిన రిస్కు’ అని కొందరు భయపడతారు. ‘ఏమైనా సరే’ అని కొందరు ధైర్యంతో బయటికి వస్తారు. విజేతలుగా నిలుస్తారు. టీవీ స్టార్ తేజస్వీ ప్రకాష్ సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌లో భాగం కావడం ద్వారా కొత్త దారిలోకి వచ్చింది.‘సెలబ్రిటీ చెఫ్ ద్వారా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి అవకాశం వచ్చింది. పరిచయం లేని వంటకాలతో ప్రయోగాలు చేయడం సరదాగానే కాదు కష్టంగానూ ఉంటుంది. అయితే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ కాగలం’ అంటుంది తేజస్వి.సోనీ టీవి ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ పుణ్యమా అని మరచి పోయిన ఎన్నో వంటకాలను, వంట లకు సంబంధించి బాల్య జ్ఞాపకా లను గుర్తు చేసుకునే అవకాశం ఆమెకు వచ్చింది. టీవీ స్టార్ తేజస్వి ‘చెఫ్ స్టార్’గా కూడా బోలెడు పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్‌తో, హారర్ లుక్‌తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్‌కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది. -
డెబ్బై మూడేళ్ల బామ్మ... మాధురితో పోటీపడి డ్యాన్స్ చేసింది!
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది. ఛోబీ అనే బామ్మ ‘దేవదాస్’ సినిమాలోని మాధురి దీక్షిత్ పాపులర్ పాట ‘మార్ డాలా’కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. రియాల్టీ షో జడ్జీలు మాధురి దీక్షిత్, సునీల్షెట్టీలకు ఛోబీ డ్యాన్స్ బాగా నచ్చింది. ‘మనసులో ఏది అనిపిస్తే అది చేయాలి. భయం అవసరం లేదు... అని మీరు మాకు చెబుతున్నట్లుగా ఉంది’ అని బామ్మను ప్రశంసించింది మాధురి. ఆ తరువాత బామ్మతో కలిసి మాధురి దీక్షిత్ డ్యాన్స్ చేసింది. ‘మాధురి అంటే డ్యాన్స్‌కు మరో పేరు. ఆమె పాపులర్ పాటకు డ్యాన్స్ చేయాలంటే సాహసం మాత్రమే కాదు. ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ, సాహసం మూర్తీభవించిన ఛోబీజీకి అభినందనలు’. ‘మాధురితో పోటీపడి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి. -
18 ఓటీటీలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినందుకుగాను 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయనున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వీటికి సంబంధం ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడి యా ఖాతాలను దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొంది. తొలగించే 10 యాప్‌లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్, 3 యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేవి. వేటుపడిన 18 ఓటీటీలివే.. డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రీఫ్లిక్స్, ఎక్స్ప్రైమ్, నియోన్ ఎక్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రబ్బిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ ఎక్స్, మోజోఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ప్లే వంటి ఓటీటీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు. తొలగించిన వాటిలో 12 ఫేస్బుక్ ఖాతాలు, 17 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 16 ఎక్స్ ఖాతాలు, 12 యూట్యూబ్ ఖాతాలు సోషల్ మీడియా ద్వారా అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి. -
Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు...
యూట్యూబ్ ‘సిల్వర్ ప్లే బటన్’ను సొంతం చేసుకోవడం అనేది అంత వీజీ కాదు. లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ప్రతిష్ఠాత్మకమైన సిల్వర్ ప్లే బటన్ సొంతం అవుతుంది. అయితే పాకిస్థాన్‌లోని గిల్గిత్–బల్టిస్థాన్ ప్రాంతంలోని ఖప్లూ నగరానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే పిల్లాడు మాత్రం తన యూట్యూబ్ చానల్ ‘సిరాజీ విలేజ్ వ్లోగ్స్’తో ‘సిల్వర్ ప్లే బటన్’ను అవలీలగా సాధించాడు. సిరాజ్ చానల్‌కు లక్షమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చెల్లి ముస్కాన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సిరాజ్ చేసిన వీడియోలు పాపులర్ అయ్యాయి. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌ను సిరాజ్ అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. -
ఓటీటీని ఆస్వాదిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్కాస్ట్ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇలా.. ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు. స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది. -
సి.ఎం.ఆర్. ప్రచారకర్తగా మృణాల్ ఠాకూర్
హైదరాబాద్: ప్రముఖ వస్త్ర స్వర్ణాభరణాల సంస్థ సి.ఎం.ఆర్.షాపింగ్ మాల్ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మృణాల్ ఠాకూర్ నియమితులయ్యారు. తెలుగువారి ప్రతి వేడుకలో భాగమైన సి.ఎం.ఆర్.కు ప్రచారకర్తగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని మృణాల్ ఠాకూర్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుభ కార్యాలకు ప్రత్యేక పట్టువ్రస్తాలు, యువత మెచ్చే సరికొత్త ఫ్యాషన్స్, అద్భుతమైన డిజైన్లతో కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయన్నారు. ‘‘మృణాల్ ఠాకూర్ మా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సంతోషంగా ఉంది. ప్రపంచ స్థాయి ఫ్యాషన్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త కలెక్షన్స్ మా వద్ద లభిస్తాయి’’ అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ తెలిపారు -
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్‌కు ఓనర్‌ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్‌డే ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
SONY: భారత్ మార్కెట్‌కు ప్రాధాన్యత
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో ఇతర అవకాశాలను అన్వేషించనున్నట్లు జపనీస్ దిగ్గజం సోనీ తాజాగా వెల్లడించింది. దేశీ మార్కెట్లో వృద్ధి అవకాశాలరీత్యా మరొక కొత్త ప్రణాళికకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలంలో భారీ వృద్ధికి వీలున్న దేశీ మార్కెట్లో సొంత కార్యకలాపాలకూ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అత్యంత అవకాశాలున్న భారత్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్లు సోనీ ప్రెసిడెంట్, సీవోవో, సీఎఫ్‌వో హిరోకీ టొటోకీ పేర్కొన్నారు. వెరసి వివిధ అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేశారు. కొత్తగా అవకాశం లభిస్తే పాత ప్రణాళికస్థానే అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ‘జీ’తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో హిరోకీ భారత్ మార్కెట్లో కంపెనీ వ్యూహాలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గత పెట్టుబడుల ప్రణాళికలు లేదా ఆలోచనల్లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవని వెల్లడించారు. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) ద్వారా దేశీయంగా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు హీరోకీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
భారత్ యూఏఈ దోస్తీ జిందాబాద్
అబుదాబి: యూఏఈ, భారత్ మైత్రి ప్రపంచానికే ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. మంగళవారం అబూదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘అహ్లాన్ (హలో) మోదీ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాదాపు 50,000 మంది పాల్గొన్న కార్యక్రమం ‘హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ’, ‘వుయ్ లవ్ మోదీ’, ‘ భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిపోయింది. స్టేడియం బయట మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ సాదర స్వాగతం పలికారు. ప్రేక్షకులనుద్దేశించి మోదీ ఏమన్నారంటే... ‘‘యూఏఈ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చి మీరంతా చరిత్ర సృష్టించారు. భారత్‌లోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. అందరి హృదయాలను యూఏఈ కలిపింది. ఇక్కడి ప్రతి ఒక్కరి శ్వాస, గుండె చప్పుడు, స్వరం, ప్రతి గళం ‘భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్’ అని నినదిస్తోంది. ఇరు దేశాల మైత్రి ప్రపంచానికే ఒక మోడల్‌గా మారింది. 21వ శతాబ్ది మూడో దశకంలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. రెండు దేశాల భాగస్వామ్యం అన్ని రంగాల్లోనూ సమున్నత శిఖరాలకు చేరుతోంది. రోజు రోజుకూ ఈ బంధం మరింత బలపడాలని భారత్ మనసారా కోరుకుంటోంది. ప్రతిభ, సృజన, సంస్కృతిలో మన అనుబంధం దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. భారతీయ భాషల్లో అంతర్భాగంగా కలిసిపోయిన అరబిక్ పదాలను ప్రస్తావించారు. ఆ పదాలను మోదీ ఉచ్ఛరించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది ‘140 మంది భారతీయుల సందేశాన్నిమోసుకొచ్చా. అదేంటంటే.. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది. ఈ పదేళ్లలో ఏడు సార్లు ఇక్కడికొచ్చా. ఈరోజు కార్యక్రమం నా స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయేద్’ నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఇది నాకు మాత్రమే కాదు 140 కోట్ల భారతీయులకు గర్వకారణం. సుఖమయ జీవనం, సులభతర వాణిజ్యానికి ఇరు దేశాలు కృషిచేస్తున్నాయి. 2047 కల్లా ‘అభివృద్ధి చెందిన భారత్’ ప్రతి ఒక్క భారతీయుడి లక్ష్యం. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే. ప్రధానిగా మూడోదఫా పాలనలో భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుస్తానని గ్యారెంటీ ఇస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తర్వాత స్టేడియంలో ఓపెన్‌టాప్ బ్యాటరీ వాహనంలో స్టేడియంలో అంతా కలియతిరిగారు. ప్రేక్షకులకు అభివాదం చేశారు. జాతీయ జెండాలతో, సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో విచ్చేసిన జనంతో స్టేడియం భారతీయతను సంతరించుకుంది. మోదీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కొన్ని వాక్యాలు మాట్లాడారు. -
అయ్ బాబోయ్ ఇదేంటండీ!
‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ఆ జాబితాలో అర్జంటుగా చేర్చదగ్గ వెర్రి ఇది. కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలోని కాంట్రాక్ట్–బేస్డ్ ఫిజీషియన్ అభిషేక్ తన ప్రి–వెడ్డింగ్ షూట్ కోసం అందరిలాగా ఆహ్లాదకరమైన, అందమైన ప్రదేశాన్ని ఎంచుకోలేదు. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌నే ఎంచుకున్నాడు. ఈ వీడియోలో బెడ్‌పై పడుకున్న పేషెంట్‌కు సర్జరీ చేస్తున్నట్లు డాక్టర్ నటిస్తుంటే, కాబోయే శ్రీమతి సర్జరీకి తనవంతుగా సహకరిస్తున్నట్లు నటించింది. (ఉత్తుత్తి) ఆపరేషన్ పూర్తికాగానే (ఉత్తుత్తి) పేషెంట్ లేచి ‘ఇప్పుడు నాకు ఫరవాలేదు’ అన్నట్లుగా కూర్చోవడం మరో వినోదం. ఆపరేషన్ థియేటర్లో కెమెరాలు, లైట్లతో హడావిడి చేస్తున్న వ్యక్తులు కనిపిస్తారు.ఈ వీడియో వీర లెవెల్లో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా సదరు డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ వీడియో పుణ్యమా అని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లో΄ాల నుంచి వెర్రితలలు వేస్తున్న ప్రి–వెడ్డింగ్ షూట్ల వరకు ఎన్నో విషయాలపై గరం గరంగా నెటిజనులు చర్చ చేస్తున్నారు. -
సోనీపై ఎన్సీఎల్టీకి జీ
న్యూఢిల్లీ: ప్రతిపాదిత విలీన డీల్‌ను రద్దు చేసుకోవాలన్న సోనీ నిర్ణయంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) వెల్లడించింది. అలాగే 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 748.5 కోట్లు) టెరి్మనేషన్ ఫీజు కట్టాలన్న సోనీ నోటీసులపై కూడా తగు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ సమాచారమిచ్చింది. జపాన్‌కి చెందిన సోనీ గ్రూప్ భారత విభాగం (కల్వర్ మ్యాక్స్), జీల్ విలీన ప్రతిపాదన రద్దయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం విలీన కంపెనీ సారథ్య బాధ్యతలను జీ సీఈవో పునీత్ గోయెంకాకు అప్పగించడాన్ని ఇష్టపడకపోవడం వల్ల సోనీ గ్రూప్ ఈ డీల్‌ను రద్దు చేసుకుంది. ఆర్థిక మంత్రికి సుభాష్ చంద్ర లేఖ.. విలీన డీల్ నుంచి సోనీ వైదొలగడానికి కొద్ది రోజుల ముందు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఈ ఒప్పందం కుదరకుండా చేసేందుకు ప్రయతి్నస్తోందంటూ అందులో ఆరోపించారు. జీ నిధులను దురి్వనియోగం చేశారంటూ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకాపై సెబీ చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో సెబీ విచారణ జరపరాదని తాను అనడం లేదని, కాకపోతే సరిగ్గా డీల్ కుదిరే సమయంలో సెబీ ఇందుకు సంబంధించిన నోటీసులివ్వడానికి కారణమేమిటనేదే తన ఆందోళన అని చంద్ర పేర్కొన్నారు. జీల్ మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్థిక మంత్రి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యరి్ధంచారు. -
జీ–సోనీ విలీన డీల్ రద్దు!!
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్, సోనీ గ్రూప్ భారత విభాగ విలీన డీల్ ఊహాగానాలకు అనుగుణంగానే రద్దయింది. సోనీ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)కు నోటీసు పంపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఆర్బిట్రేషన్‌కు తెర తీసినందుకు గాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) బ్రేకప్ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ‘సోనీ గ్రూప్ కార్పొరేషన్లో భాగమైన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్) సంస్థ .. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనానికి సంబంధించి 2021 డిసెంబర్ 22న ప్రకటించిన ఒప్పందాలను రద్దు చేస్తూ, నోటీసులు ఇచ్చింది’ అని సోనీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. విలీన సంస్థకు ఎవరు సారథ్యం వహించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ విషయమై సోనీ నుంచి నోటీసులు వచి్చనట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ తెలిపింది. ‘విలీన ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు వన్‌టైమ్ ప్రాతిపదికన, మళ్లీ మళ్లీ ఖర్చులకు దారి తీసే చర్యలు కూడా తీసుకున్నాం’ అని తెలిపింది. డీల్ రద్దు వ్యవహారంపై చట్టపరంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనల పాటింపునకు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు జీల్ 2023 సెపె్టంబర్ వరకు దాదాపు రూ. 367 కోట్లు వెచి్చంచింది. ఇదీ జరిగింది.. ఎస్‌పీఎన్‌ఐలో జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021 డిసెంబర్లో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 24 నెలల్లోగా విలీనం జరగాలి. అలా జరగకపోవడంతో నెల రోజుల పాటు జనవరి 21 గడువు పొడిగించారు. డీల్ సాకారమై ఉంటే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించేది. విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీల్ ప్రమోటర్లయిన గోయెంకా కుటుంబానికి 3.99 శాతం వాటాలు ఉండేవి. 70 పైగా టీవీ చానల్స్, రెండు వీడియో స్ట్రీమి ంగ్ సరీ్వసులు, రెండు ఫిలిమ్ స్టూడియోలతో భార త్లో అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా ఉండేది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే, ఈలో గా జీ ప్రమోటర్లయిన సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు .. సీఈవో పునీత్ గోయెంకాలపై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో వారిని లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండకూడదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో గోయెంకాకు స్టే లభించింది. కానీ, ప్రాథమికంగా డీల్ కింద విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పగించాలని భావించినప్పటికీ ఈ పరిణామాలతో ఆ అంశంపై సందిగ్ధత నెలకొంది. గోయెంకాను సీఈవోగా కొనసాగించడాన్ని సోనీ ఇష్టపడటం లేదని, ఆయన వెనక్కి తగ్గటం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై నిర్దిష్ట డెడ్‌లైన్‌లోగా ఇరుపక్షాలూ అంగీకారానికి రాకపోవడంతో డీల్ రద్దు కానుందంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడేంటి.. ఆదాయాలు, లాభాల క్షీణతతో కొన్నాళ్లుగా జీ ఆర్థిక పనితీరు తగ్గుతూ వస్తోంది. సోనీతో డీల్ రద్దు అయిన నేపథ్యంలో జీల్‌కి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ భారత మీడియా వ్యాపార విలీనమైతే ఏర్పడే భారీ సంస్థతో పోటీపడేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకోవాలి. కొన్ని క్రికెట్ ఈవెంట్ల ప్రసారం కోసం డిస్నీలో భాగమైన స్టార్‌తో జీల్‌కి ఒప్పందం ఉంది. దీని కోసం నాలుగేళ్ల వ్యవధిలో 1.32–1.44 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాలి. సోనీతో డీల్ రద్దు అయినందున ఈ ఒప్పందంపైనా ప్రభావం పడొచ్చు. మరోవైపు, ప్రాంతీయ భాషల్లో జీల్‌కి ఉన్న కంటెంట్, టీవీ చానల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి సోనీ కూడా భారత్‌లో తన కార్యకలాపాల వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ – సీఎంఈపీఎల్) విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీల్‌తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్ను విలీనం చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ గ్రూప్ రెండేళ్ల క్రితం డీల్ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జీ–సోనీ డీల్‌కు బ్రేక్?
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) – సోనీ భారత విభాగం విలీన ప్రయత్నాలకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థకు జీ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించే విషయంపై సోనీ సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నిర్దిష్ట షరతులను పాటించలేదనే కారణంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సోనీ గ్రూప్ భావిస్తున్నట్లు తెలిపారు. డీల్ కుదుర్చుకునేందుకు నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే జనవరి 20లోగా రద్దు నోటీసును పంపించే అవకాశం ఉందని వివరించాయి. వివరాల్లోకి వెళ్తే.. జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ తమ భారత విభాగాన్ని, జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సాకారమైతే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజంగా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. సదరు ఒప్పందం ప్రకారం జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తనయుడు, సీఈవో పునీత్ గోయెంకానే విలీన సంస్థకు కూడా సారథ్యం వహించాలి. కానీ, ఈలోగా చంద్ర, గోయెంకాలు తమ అధికారాన్ని దురి్వనియోగం చేసి సొంత అవసరాల కోసం నిధులను మళ్లించారంటూ సెబీ ఆరోపించడంతో డీల్ పురోగతిపై సందేహాలు రేకెత్తాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన వివాదంగా పరిగణిస్తున్న సోనీ.. విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పజెప్పడానికి విముఖంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, ముందుగా అనుకున్న ప్రకారం సీఈవోగా తనని కొనసాగించాల్సిందేనంటూ గోయెంకా పట్టుబడుతున్నట్లు వివరించాయి. ఈ నేపథ్యంలోనే డీల్‌ను సోనీ రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. -
తొలిసారిగా...ఓ చారిటీ ఈవెంట్లో వర్మ...
సాక్షి, హైదరాబాద్ : ఓ వైపు తెలంగాణ ఎన్నికల రణక్షేత్రం అంతకంతకూ వేడెక్కుతూ పూటకో మలుపులు తిరుగుతోంది. అయినప్పటికీ‘‘తెలంగాణ రాజకీయం పట్ల ఆసక్తి కలగడం లేదు. ఇక్కడ డ్రామా లేదు’’ అని తను గతంలో అన్న మాటల్ని పునరుద్ఘాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం, శపధం సినిమా రూపొందిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న మిక్స్ అండ్ మింగిల్ మెగా క్రిస్మస్ కార్నివాల్ పోస్టర్ని బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో శనివారం రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. తొలిసారి ఒక సేవా కార్యక్రమానికి నిధుల సేకరణకు మద్ధతు తెలుపుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సేవ చేయను..కానీ సపోర్ట్ చేస్తాను... ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను మిషన్ భధ్రత పేరుతో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను వ్యక్తిగతంగా సేవ చేయననే మరోసారి చెప్పారు. అయితే చేసేవారికి మద్ధతు తెలపాలనే ఉద్దేశ్యంతోనే తొలిసారిగా ఈ తరహా ఈవెంట్‌కి వచ్చానన్నారు. అయితే ఇకపై కూడా ఇలా మద్ధతు ఇవ్వడం అనేది కొనసాగుతుందా అంటే నీలిమ ఆర్య ( కార్యక్రమ నిర్వాహకురాలు) లాంటి ఫ్రెండ్ అడిగితే కావచ్చునన్నారు. ఆసక్తి ఆంధ్రపైనే... తెలంగాణ రాజకీయాల్లో డ్రామా లేదని, అందుకే తాను ఇక్కడి విషయాలు అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు వర్మ. ఆంధ్ర రాజకీయాలే తప్ప తెలంగాణ రాజకీయాలపై సినిమాలు ఎందుకు తీయడం లేదు అన్న ప్రశ్నకు బదులిస్తూ తన కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉందన్నారు. ఇలాంటి ఈవెంట్లకు రావడం ద్వారా సమాజానికి భిన్నంగా ఉండే తన జీవనశైలి నుంచీ తాను కాస్త బయటపడుతున్నట్టుగా సాధారణ జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టుగా అనుకోవచ్చునా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తే... అది కేవలం అపోహ మాత్రమేనని తాను ఎన్నటికీ మారనని స్పష్టం చేశారు. వర్మ మేకప్‌తో, మెదడుతో మాట్లాడరు... అందుకే ఈ కార్యక్రమానికి వివాదాస్పద దర్శకుడు, సేవా కార్యక్రమాల పట్ల బహిరంగంగానే విముఖత చూపే రామ్‌గోపాల్ వర్మ అనే దర్శకుడ్ని ఎంచుకోవడం పట్ల ఆయన ఫ్రెండ్ నీలిమ ఆర్య స్పందించారు. ఆయన ముఖానికి మేకప్ ఉండదని, అంతేకాదు ఆయన మైండ్‌తో కాకుండా హృదయంతో మాట్లాడతారని అందుకే తాను ఆయన్ను ఎంచుకున్నానని చెప్పారు. మిషన్ భధ్రత పేరుతో అమ్మాయిలకు ఇన్నర్‌వేర్ ఉచితంగా పంపిణీ చేయబోతూ, నిధుల సేకరించే ఈవెంట్‌కి వర్మను పిలవడం ట్రోల్స్‌కు గురవదా? అంటే అయినా పర్లేదు అనుకున్నానని, ఈ విషయమై వర్మ కూడా ముందే తనను హెచ్చరించారని నీలిమ స్పష్టం చేశారు. అయితే తాను వర్మ విషయంలో నమ్మిన దానికి తగ్గట్టుగా మాత్రమే నడుచుకున్నానన్నారు. ఆయనను మరిన్ని చారిటీ ఈవెంట్లకు కూడా పిలిచే అవకాశం ఉందన్నారు. -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
నాడు ‘చిన్న సినిమాల శ్రీదేవి’... నేడు ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’...
ఆమె ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కనిపించలేదు. అయితే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో మార్నింగ్ షోలలో కనిపిస్తూ రచ్చ చేసేది. 1990, 2000 దశాబ్ధాలలో ఆమె తన హవా చాటింది. ఆమె సినిమాలను యువకులు ఎగబడి చూసేవారు. ఆ సమయంలో ఆమె ఏకంగా 250 సినిమాలు చేసింది. అందుకే ఆమెను కొందరు అభిమానులు ‘చిన్న సినిమాల శ్రీదేవి’ అంటూ అభివర్ణించేవారు. సప్నా సప్పూ.. బాలీవుడ్ నటి. పెద్ద సినిమాల్లో ఆమె ఎప్పుడూ కనిపించిందేలేదు. 1990, 2000 దశాబ్ధాలలో హిందీ, గుజారాతీ భాషలలో ఏకంగా 250 సినిమాలు చేసింది. ఆ రోజుల్లో ఆమె సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలలో మార్నింగ్ షోలలో సందడి చేసేవి. ఆమె తెరమీద కనిపించగానే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయేవారు. అయితే 2013లో సప్నా సప్పూ వివాహం చేసుకుంది. తరువాత ఆమె సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పేసింది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆర్థికంగా చితికి పోయిన ఆమె తిరిగి సినిమాల్లో కనిపించడం ప్రారంభించింది. ఓటీటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. మిథున్ చక్రవర్తితో మొదలు పెట్టి.. 1998లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో ‘గూండా’ సినిమాతో సినిమాల్లో కాలు మోపిన ఆమెకు ఇప్పుడు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. సినీ జగత్తులో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. ఇందుకోసం ఆమె అనేక త్యాగాలు చేయాల్సివచ్చింది. వాటి గురించి చెప్పేందుకు ఆమె ఏమాత్రం సందేహించదు. ఈ విషయాల గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నేను కెరియర్ తొలినాళ్లలో ప్రొడ్యూసర్లతో పాటు ప్రేమికుల కోసం అనేక ‘త్యాగాలు’ చేశాను. పెళ్లయిన తరువాత కూడా నా భర్త నన్ను మరింత ‘శాక్రిఫైజ్’ చేసేలా బలహీనపరిచాడు. చివరికి నేను జీవితాన్ని సరైన పద్ధతిలో నడపాలని భావించి తన కుమారుని కోసం తిరిగి ‘శాక్రిఫైజ్’ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్తకు విడాకులిచ్చారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. భర్తనుంచి విడిపోయి ముంబై తిరిగి వచ్చిక ఆమెను ఆర్థిక సమస్యలు చుట్టిముట్టాయి. ఆమెకు ఏ పనీ దొరకలేదు. అటు సినామాల్లో, ఇటు టీవీల్లో ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె మరింత నిస్సహాయురాలిగా మారింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. అయితే కుమారుని ముఖం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించింది. తన కుమారుడు టైగర్ ఇంకా చాలా చిన్నవాడు. వాడి ఆలనాపాలనా చూడాలి. వాడిని బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఆమె తెలిపింది. వెబ్ సిరీస్‌లో బిజీ.. 2019లో పలు ఓటీటీ ప్లాట్ఫారంలతోపాటు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లలో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షక జనం ఆమెను మరచిపోలేదు. వివిధ ప్లాప్ఫారాల వెబ్ సిరీస్‌లలో ఆమెను ‘ఎక్స్ట్రా సర్వర్’గా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ఆమెకు ‘సర్వర్ క్రషర్’, ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’ అనే బిరుదులు ఇచ్చేసింది. 2020లో వచ్చిన ‘ఆప్ కా సప్నా భాభీ’ మెగాహిట్గా నిలిచింది. దీనిలో ఆమె కీలకపాత్ర పోషించింది. తరువాత ఆమె ‘సౌతల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అనంతరం ఆమె నటించిన పాపింగ్ టామ్ సీజన్ రిలీజ్ అయి, అభిమానుల ఆదరణను పొందింది. దీనికి సస్నానే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె నటించిన ఎల్ఎల్డీ(లవ్, లస్ట్, డ్రామా), సప్నాకే అంగూర్, సప్పూ బాయీ తదితర వెబ్ సిరీస్‌లు ప్రేక్షకాదరణ పొందాయి. ఫ్యాన్స్ కూడా ఆమె షోలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆమెపై ఈర్ష్య పెంచుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వీరి గురించి ఆమె మాట్లాడుతూ ‘ఎవరిలో నాపై ద్వేషభావం ఉందో వారే ఇబ్బంది పడతారు. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళతాను’ అని ఆమె స్పష్టం చేసింది. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతుంటారు. ఇది కూడా చదవండి: భర్త లేకుండా పార్టీ.. సింగర్స్ జంట విడాకులు తీసుకోనుందా?