Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Scenes Of Police Attack On Mla Kethireddy Pedda Reddy House Have Gone Viral
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌

సాక్షి, అనంతపురం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్‌పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్‌సీపీ లీగల్‌ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు.

Actor Prabhas Instagram Story Latest Viral
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్‌ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడమే ఎక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్‌లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌)

AP Elections 2024: May 17th Politics Latest News Updates In Telugu
May 17th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 17th AP Elections 2024 News Political Updates11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్‌ అభ్యర్థులుజాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్‌లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్‌ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.ఎస్పీ అమిత్‌, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్‌ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్‌లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్‌ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్‌ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్‌ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్‌ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్‌ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్‌ఎస్‌2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్‌ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్‌.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్‌ జగన్‌6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్‌ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌2019కి మించి 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంజూన్‌ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్‌ ప్రతినిధులతో సమావేశం

Lok Sabha Elections 2024: PM Modi Satires On INDIA Alliance
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ

ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్‌ హ్యాట్రిక్‌ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్‌బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్‌ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్‌లల్లాను టెంట్‌కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌ మార్చాలనుకుంది. కాంగ్రెస్‌ వస్తే రామ్‌ లల్లాను మళ్లీ టెంట్‌ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్‌, పవార్‌.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్‌ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్‌ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్‌ అన్నారు. మత నిర్జవ‍్స్త్రన్లకు ల్యాబ్‌గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.

Case Filed On Tdp Ex Mla Chintamaneni Prabhakar
చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు

సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్‌లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్‌స్టేషన్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్‌ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్‌ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్‌ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్‌ అతడి తండ్రి డేవిడ్‌ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్‌ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్‌కు వచ్చి సీఐ, ఎస్‌ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

IPL 2024 Playoffs Scenario: RCB May Not Qualify Even If They Beat CSK How
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరదు! అదెలా?

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టేబుల్‌ టాపర్‌గా ముందుగానే టాప్‌-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్‌ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్‌కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్‌కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్‌కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్‌ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్‌కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్‌కేను దాటి ప్లే ఆఫ్స్‌ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. ‌చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్‌ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్‌ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్‌

Air passenger traffic in the country is projected to touch 418 million in the current financial year
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్‌, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్‌ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్‌ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల​్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.

TV Host Padma Lakshmi Said Please Stop Saying Chai Tea
అలాంటి పదబంధాలను ఉపయోగించొద్దు! నటి పద్మాలక్ష్మి

ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్‌ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్‌, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!చాలామంది 'చాయ్‌ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్‌ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్‌ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు. అలాగే చాలామంది 'గీ బట్టర్‌' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్‌ చాలామంది ఏటీఎం మిషన్‌ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం. ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్‌ టెల్లర్ ‌మిషన్‌). అలాంటప్పుడు మళ్లా మిషన్‌ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టారు. మరో నెటిజన్‌ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్‌లోని స్టార్‌బక్స్‌ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్‌ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్‌ పెట్టాడు. (చదవండి: బ్లింకిట్‌ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!)

Jr NTR Approach To High Court For Land Issue
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌

హైదరాబాద్‌, సాక్షి: టాలీవుడ్‌ అగ్రనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీలో ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ఒక ప్లాట్‌ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే,ఆ ల్యాండ్‌పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు.1996లో ఆ ల్యాండ్‌ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీత లక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్‌ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్‌ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్‌ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీత లక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ను ఎన్టీఆర్‌ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్‌గా తారక్ ఉన్నారు.అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్‌ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్‌ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్‌‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్‌‌ లాయర్‌‌ తెలిపారు. అయితే డాకెట్‌‌ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Political analysts on polling percentage
AP: పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుంది

సాక్షి, అమరావతి: పరిపాలన నచ్చితే ప్రజలు తమ మద్దతు ఓట్ల రూపంలో చూపిస్తారని, అందుకు అనుగుణంగానే పోలింగ్‌ శాతం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌కు, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్‌కు ప్రజలు వరు­సగా రెండుసార్లు అధికారం కట్టబెట్టటాన్ని ఇందుకు నిదర్శ­నంగా ఉదహరి­స్తున్నారు. ఇప్పుడు ఏపీ­లోనూ అదే ట్రెండ్‌ కనిపిస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట నిల­బెట్టుకున్న జగన్‌ ప్రభుత్వానికి మరోసారి పట్టం గట్టడం ఖాయమని, అందుకనే పోలింగ్‌ శాతం పెరిగిందని విశే­్లషిç­Ü్తున్నారు. పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తోందనే ప్రచారంలో నిజం లేదని సీని­యర్‌ రాజకీయ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చితే నిస్సంకోచంగా మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.ఈ మంచి కొనసాగేలా..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలను అమలు చేయడంతోపాటు పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతో పెద్ద ఎత్తున పోలింగ్‌కు తరలి వచ్చారని, ఈ మంచి కొనసాగాలని కోరుకుంటున్నారనేందుకు పోలింగ్‌ శాతం పెరగడమే రుజువని సీనియర్‌ రాజకీయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 2019లో కంటే 2024లో పోలింగ్‌ శాతం పెరగడం వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలన్న ఆకాంక్షలకు సంకేతమని పేర్కొంటున్నారు.వైఎస్సార్‌ పాలనే రుజువు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 69.8 శాతం పోలింగ్‌తో దివంగత వైఎస్సార్‌ అధికారం చేపట్టారు. 2004 నుంచి 2009 వరకు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో 72.7 శాతం పోలింగ్‌తో ప్రజలు మరోసారి వైఎస్సార్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు.విద్య, వైద్య రంగాలలో తొలిసారిగా పెను మార్పులు తెచ్చిన వైఎస్సార్‌కు జేజేలు పలికారు. పోలింగ్‌ శాతం పెరగడం వల్ల వైఎస్సార్‌కు ప్రజల మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కళ్లెదుట కనిపించిన వాస్తవమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2004కు మించి 2009లో పోలింగ్‌ 2.9 శాతం పెరిగింది.కేసీఆర్‌కు రెండుసార్లు అధికార పగ్గాలు..రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2014 ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా కేసీఆర్‌ అధికారం చేపట్టారు. కేసీఆర్‌ పాలన నచ్చడంతో 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్‌తో మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.సానుకూల ప్రచారంతో..ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్‌తో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించారు. ఐదేళ్ల సీఎం జగన్‌ పాలన నచ్చడంతో పాటు పథకాలన్నీ కొనసాగాలని ప్రజలు కోరుకోవడంతో ఈదఫా పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారని, అందుకే పోలింగ్‌ శాతం 81.86 శాతానికి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్లీ సీఎంగా జగనే ఉండాలని ప్రజలు భావిస్తున్నారనేందుకు గత ఎన్నికల కంటే పోలింగ్‌ అదనంగా 2.09 శాతం పెరగడం సంకేతమని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్లుగా మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే ఓటుతో ఆశీర్వదించాలని, సైనికులుగా తోడుగా నిలవాలని, పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని సీఎం జగన్‌ ఎన్నికల్లో సానుకూల ప్రచారం చేయడం ప్రజలకు నచ్చిందని, అందుకే ఓట్ల రూపంలో జేజేలు పలికారని సీనియర్‌ రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement