ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్ | Actor Prabhas Latest Instagram Story Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Prabhas Instagram Story Viral: ప్రభాస్ నుంచి త్వరలో గుడ్ న్యూస్.. ఏమై ఉండొచ్చు?

May 17 2024 11:22 AM | Updated on May 17 2024 3:03 PM

Actor Prabhas Instagram Story Latest Viral

డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్‌ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడం తక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?

(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)

'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.

'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్‌లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement