ఎయిర్ ఏసియాతో ప్రపంచాన్ని చుట్టేయండి!!!

AROUND THE WORLD WITH AIRASIA - Sakshi

బిజీ లైఫ్‌లో పరుగులు పెట్టి అలసిపోయారా.. ల్యాప్‌టాప్‌  స్క్రీన్లతో  తృప్తి పడతున్నారా?ఇలా ఎంతకాలం?  లాప్‌టాప్‌  స్క్రీన్లలో మాత్రమే ప్రపంచాన్ని ఎందుకు చూడాలి? బయటకు వెళ్లి అన్వేషించండి! మీకు ఎయిర్‌ ఏసియా అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎయిర్‌ ఏసియా ఆక​‍ర్షణీయమైన  ధరలతో ప్రపంచాన్ని చుట్టి రండి.. అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకోండి..!!!

మెల్‌బోర్న్‌
యారా నది ఒడ్డున ఒద్దికగా అందంగా రూపుదిద్దుక్ను నగరం మెల్‌బోర్న్‌.  ఆస్ట్రేలియా ఖండంలోని ఆధునిక మెట్రోపాలిస్ మెల్‌బోర్న్‌ను "మార్వెలస్ మెల్‌బోర్న్‌" అని కూడా పిలుస్తారు.   ఇక్కడ భోజనమైనా, రిలాక్సింగ్‌ కోసం అయినా, షాపింగ్  అయినా ఏదైనా ప్రతీదీ చాలా ఆకర్షణీయంగా కళాత్మంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రాఫిటీ లైన్‌వేస్‌(గోడలమీద చిత్రకారులు గీసిన గోడబొమ్మలు), విక్టోరియన్ భవనాలు, కృత్రిమ పార్కులు, తోటలు, పాత ట్రామ్‌నెట్‌వర్క్‌లాంటి చూడవలసిన​  ముఖ్య విషయాలు.

సిడ్నీ
అద్భుతమైన వాతావరణంతో అలరారే కాస్మోపాలిటన్ దిగ్గజ నగరంసిడ్నీ. ఐకానిక్‌ బీచ్‌లు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు దీని సొంతం. ఆస్ట్రేలియాలో ఎక్కువగా సందర్శించే నగరం సిడ్నీనే. అర్బన్‌ గ్లామర్‌తో పాటు సహజ సౌందర్యం ఉట్టిపడే శ్రేష్టమైన నగరం సిడ్నీ. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, డైనమిక్ ఆర్ట్స్, కల్చరల్‌ ల్యాండ్‌ స్కేప్స్‌,  అవుట్‌ డోర్‌ ల్యాండ్‌ స్కేప్స్‌, ఆసక్తికరమైన షాపింగ్ ప్రాంతాలు సిడ్ని మహానగరం సొంతం.

కౌలాలంపూర్
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ అత్యాధునికమైన, భిన్నమైన నగరం. మీరు ఖచ్చితంగా లవ్‌లో పడిపోయే నగరాల్లో ఇదొకటి. అద్భుతమైన ఈ నగరంలో ప్రాచీనమైన బీచ్‌లు, అద్భుతమైన షాపింగ్ ప్రాంతాలు, ప్రపంచ స్థాయి వంటకాలతోపాటు ఇక్కడి నైట్‌ లైఫ్‌ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అంతేకాదు ఇక్కడి పచ్చదనం మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. అన్నట్టు..ఇక్కడి స్ట్రీట్‌ పుడ్‌ను  మర్చిపోవద్దు. ఇండియన్‌ వంటకాలతో పాటు థాయ్, చైనీస్, మాలే వంటకాల మిశ్రమంగా ఉండే ఇక్కడి స్ట్రీట్‌ ఫుడ్‌ తిని తీరాల్సిందే..

సింగపూర్‌
సింగపూర్‌లో కేవలం ఆకాశహర్మ్యాలు,  షాపింగ్ మాల్స్  మాత్రమే కాదండీ. ఇంకా  చాలా ప్రత్యేకతలున్నాయి. కుటుంబంతో సెలవులను ఎంజాయ్‌ చేయడానికి అద్భుతమైన ప్లేస్‌ సింగపూర్‌. అన్ని వయసుల వారిని సమానంగా ఆకట్టుకునే అద్భుతనగరం ఇది. ఇక్కడి నైట్‌ లైఫ్‌, ఆశ్చర్యపరిచే నాచురల్‌ లాండ్‌స్కేప్స్‌ వైవిధ్యమైన సంస్కృతుల మేళవింపుతో అలరారే చిత్రరూపదర్శిని (కలేడోస్కోప్‌) సింగ్‌పూర్‌ అని నిరూపిస్తాయి.

హవాయి
అమెరికా  ఉష్ణమండల స్వర్గంగా అలరారే  హవాయి  ప్రతీ టూరిస్టుకు వెరీ వెరీ స్పెషల్‌.  ఓహు సర్ఫింగ్  మొదలు మాయి అద్భుతాలకు, హోనోలులు-హవాయ్ అందాలకు హవాయి ద్వీపం చాలా ప్రత్యేకమైనది. అందమైన బీచ్‌లు, అద్భుతమైన అరణ్యాలు, అపారమైన జలపాతాలతో హనీమూన్‌ వెళ్లే జంటలకు సాహసాలు చేయాలనుకునేవారికి,  సర్ఫర్స్‌కి ఇదే స్పెషల్‌ డెస్టినేషన్‌. తెల్లటి ఇసుక, మణి జలపాతాలను ఆస్వాదించాలంటే హవాయి దీవులలో అడుగు పెట్టండి! ఒక విధంగా చెప్పాలంటే భూమిపై అత్యంత అద్భుతమైన ప్రదేశం హవాయి!! మై మరపించే హవాయి అందాలు వీక్షించి తరించాల్సిందే..

జకార్త
ఇండోనేషియా నడిబొడ్డున వెలసిన విశాలమైన నగరం జకార్త. నోరూరించే వంటకాలు, ఆకర్షణీయమైన సందర్శనా స్థలాలు, షాపింగ్‌మాల్స్‌, అద్భుతమైన నైట్‌ లైఫ్‌తో టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకునే నగరమిది. మోడర్‌ రిక్రియేషన్స్‌, మోడరన్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులకు జకార్త నెలవు. తీవ్ర వైరుధ్యాలతో ఉన్న డైనమిక్ నగరం. ఇండోనేషియాలోని వివిధ సంస్కృతులు, నేపథ్యాల ప్రజలను ఈ నగరంలో మనం చూడొచ్చు.  ఇక్కడి విభిన్నమైన  భోజనం మీ మనసులో చెరగని ముద్ర వేస్తుంది.

మనీలా
"మనీలా" అంటే "పుష్పించే మడ అడవుల ప్రదేశం". మళ్లీ మళ్లీ సందర్శించాలనుకునే  ఆకర్షణ ఈ మెగా నగరం సొంతం. విభిన్న సంస్కృతుల మేళవింపుతో మీకు స్వాగతం పలుకుతుంది. ఉల్లాసభరితమైన ఇండీ మ్యూజిక్‌తో మనీలా నిజమైన ఆసియా మెగాసిటీగా వర్ధిల్లుతున్న ప్రదేశం.

ఆక్‌లాండ్‌
దేనికీ కొరతలేని, అన్నిటికీ పుష్కలమైన ప్రదేశం ఆక్‌లాండ్‌. అతిథులకు మంచి ఆతిథ్యం దొరికే ప్రదేశం ఆక్‌లాండ్‌.మిరుమిట్లు గొలిపే నౌకాశ్రయాలు, అద్భుతమైనవారసత్వ ప్రదేశాలు, ఓపెన్‌ థియేటర్లతోపాటు,  స్థానికుల వినోద భరితమైన అనేక కార్యక్రమాలు అన్నీ ఇక్కడ స్పెషలే.  కెఫేలు, చక్కటి భోజన రెస్టారెంట్లు, ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్స్‌ సందర్శకులతో నిత్యం  నిండి ఉంటాయి. స్కై డైవింగ్, జెట్ బోటింగ్, బంగీ జంప్‌  అదనపు ఆకర్షణలు.  అంతేకాదండోయ్‌.... అనేక రకాల, విశిష‍్టమైన వైన్‌కు ఆక్‌లాండ్‌ పెట్టింది పేరు.

లాంగ్‌ కావి
సుందరమైన బీచ్ లకు ప్రసిద్ది చెందింది లాంగ్‌కావి. ముఖ్యంగా ఉష్ణమండలం. 'ది జ్యువెల్ ఆఫ్‌కెడా' గా పిలిచే లాంగ్‌కావి ప్రశాంతత కోరుకునే వారికి స్వర్గంలాంటిది. మొత్తం 99 ద్వీపాల​కు నెలవై ప్రధాన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సూర్యాస్తమయం సమయంలో బీచ్‌ వాక్‌,  బీచ్ బార్లు, నోరు ఊరించే వంటకాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.   ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌, మడ అడవులు, వృక్షజాలం, జంతుజాలం, మనోహరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారే లాంగ్‌కావీని తప్పనిసరిగా సందర్శించండి!

చైనా
విస్తారమైన భూభాగం, అందమైన ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన సంస్కృతి చైనాలో మనకు కనిపించే ప్రధాన అంశాలు. సుదీర్ఘ తీరరేఖలు, అందమైన లోయలు, నిటారుగా ఉన్న పర్వతాలు, ఎడారులు, క్రిస్టల్ సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, ఉష్ణమండల సతతహరిత అడవులు ఈ దేశానికి లభించిన వరాలు. ఈ సుందరమైన సౌందర్యం, ప్రత్యేకమైన సంగీతం, నాటకం, ప్రసిద్ధ వంటకాలు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటి ప్రపంచంలోనే గొప్ప ప్రాచుర్యం పొందిన ఆకర్షణలు  చాలానే ఉన్నాయి.

తైవాన్‌
ఉప ఉష్ణమండల చిన్న ద్వీపం తైవాన్‌. ఆదిమ సంస్కృతితో, అద్భుతమైన, ఆకుపచ్చ ద్వీపం మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలిచే తైవాన్ రంగురంగుల పండుగలకు నెలవు. అందమైన తూర్పు తీరం, మర్మమైన సుదూర దీవులు, ముఖ్యంగా అందమైన పర్వతాలు హిచ్‌ హైకర్స్‌కి మంచి అవకాశాన్ని అందిస్తాయి.

జపాన్‌
పురాతన సంస్కృతి​, సహజ ప్రకృతి దృశ్యాలతోపాటు మిరుమిట్లు గొలిపే ఆధునిక సంసృతికి చక్కటి మేళవింపు జపాన్‌. ఈ సున్నితమైన కలయికే మీలాంటి సందర్శకుల హృదయాలను చూరగొంటుంది. అందమైన దేవాలయాలు, విగ్రహాలు, పరిపూర్ణ సహజ ప్రకృతి దృశ్యాలు, ఇంకా యమ్మీ యమ్మీ సుఫీతో  ప్రేమలో పడకుండా ఉండలేరంటే నమ్మండి..

దక్షిణ కొరియా
ఆధునిక, వేగవంతమైన సాంకేతిక పురోగమనాల కోసం అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన  దేశం దక్షిణ కొరియా. సహజ అందాలతో, దాని సంప్రదాయాలను  అబ్బురంగా కాపాడుకుంటుంది. పారిశ్రామిక, పట్టణీకరణ,  విలాసవంతమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సాంస్కృతిక భిన్నత్వానికి ప్రసిద్ధి చెందింది. 5వేల వేళ్ల నాటి  సంస్కృతి , చరిత్రతో అలరారుతున్న దక్షిణ కొరియా తప్పనిసరిగా సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top