ఉచిత బీమాకు తూట్లు | - | Sakshi
Sakshi News home page

ఉచిత బీమాకు తూట్లు

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

ఉచిత బీమాకు తూట్లు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు రైతులపై పైసా భారం పడకుండా, ప్రభుత్వమే వంద శాతం పంటల బీమా ప్రీమియం సొమ్మును స్వయంగా చెల్లించేది. పంటలు దెబ్బతిన్న వెంటనే ఈ–క్రాప్‌ ఆధారంగా సకాలంలో పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలకే జమ చేసేది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఉచిత బీమా విధానానికి తూట్లు పొడిచింది. ‘బీమా ప్రీమియం సొమ్మును అన్నదాతలే సొంతంగా చెల్లించుకోవాలి’ అంటూ సరికొత్త నిబంధన తెచ్చి రైతుల నెత్తిన భారీ భారం మోపింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది రైతులు ప్రీమియం సొమ్మును ఎప్పుడు, ఎలా చెల్లించాలో తెలియక, అవగాహన లేక ఇన్స్యూరెన్స్‌ చేసుకోలేకపోయారు. తీరా ఇప్పుడు విపత్తు వచ్చి పంటలు దెబ్బతింటే అటు ఇన్సూరెన్స్‌ రాక, ఇటు ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సి డీ చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మిగిలిన రూ.865.1 లక్షల బకాయిలను, కరువు సహాయక చర్యలను తక్షణమే చేపట్టి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement