దాడులు చేసిన వారిని వదిలిపెట్టం | - | Sakshi
Sakshi News home page

దాడులు చేసిన వారిని వదిలిపెట్టం

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

● వైఎస్సార్‌సీపీని నమ్మి నిలబడిన వారికి అండగా ఉంటాం

● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు : మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మి నామినేషన్లు వేసిన ప్రతి కార్యకర్తకూ, అభ్యర్థికి తాము అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. బాబాయ్‌, అబ్బాయ్‌ మాటలు విని తమ వారిపై చేయి చేసుకున్న ప్రతి ఒక్కరికీ రాబోయే రోజుల్లో కార్యకర్తల తోనే ’డబుల్‌ ధమాకా’ (రెట్టింపు గుణపాఠం) రుచి చూపిస్తామని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, వారిని రక్షించే పరిస్థితి భవిష్యత్తులో ఎవరికీ ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి హైమావతి, 32 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసమే తాము గుల్లకుంట నుంచి జమ్మలమడుగు పట్టణానికి ఓట్లు మార్పించుకుని, జనరల్‌ ఏజెంట్లుగా అందుబాటులో ఉన్నామని చెప్పారు. అయితే, అధికార కూటమి ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు.. తమను ఇల్లు కదలకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కూటమి నాయకులు బెదిరింపులకు పాల్పడినా, ఆస్తులను ధ్వంసం చేస్తామని హెచ్చరించినా భయపడకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు ఎన్నికల బరిలో నిలిచారని అభినందించారు. కూటమి ప్రభుత్వం రాదనే భయం, తాము గెలవలేమనే నైరాశ్యంతోనే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలు గుండాలతో దాడులు చేయించి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: చైర్‌పర్సన్‌ అభ్యర్థి హైమావతి

జమ్మలమడుగు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి నాయకులు వందలాది మంది గుండాలతో పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించుకుని, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి హైమావతి అన్నారు. పట్టణంలోని 32 వార్డులు, 64 పోలింగ్‌ బూత్‌లలో ఉదయం నుంచే ఈ అరాచకం సాగిందని, దీనిపై పోలీసులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.ఓటు వేసేందుకు వచ్చిన సామాన్య ప్రజలను బెదిరించి, వారి చేతుల్లోని బ్యాలెట్‌ పేపర్లను లాక్కుని కూటమి నేతలే ఓట్లు వేసుకున్నారని విమర్శించారు.పోలీసులు కూటమి నేతలకు దాసోహమైతే, అధికారులు మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దొంగ గెలుపులు చూసి చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదమని, తాము ఓడినా గెలిచినట్లేనని అన్నారు. వెంటనే స్పందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జమ్మలమడుగులోని మొత్తం 28 వార్డులకు, చైర్‌పర్సన్‌ స్థానానికి రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పోరెడ్డి నరసింహారెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, నాయకులు వెంకట శివారెడ్డి, మల్కిరెడ్డి హనుమంతరెడ్డి, మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, లక్ష్మయ్య, ముల్లా జానీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement