వేంపల్లె : ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–17 జిల్లాస్థాయి యోగా పోటీల్లో ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ క్యాంపస్ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు డైరెక్టర్ విజయప్రకాష్ పేర్కొన్నారు. కడపలోని డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. సాయి నరేంద్ర, మధు (ఆర్టిస్టిక్ ఫెయిర్), సుబ్బారావు (ట్రెడిషనల్ యోగా), యోషిత్ (ఆర్టిస్టిక్ సోలో) ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఓ. సుబ్బారావు, యోషిత్ (రిథమిక్ ఫెయిర్ యోగా) మరో ఇద్దరు ద్వితీయ స్థానాలు కై వసం చేసుకున్నారన్నారు.
యోగా శిక్షకులు అశోక్, శ్రీదేవి అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం వీరి విజయానికి దోహదపడిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, శిక్షకులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ ప్రకాష్, ఏఓ డాక్టర్ సి. రత్నకుమారి, అకడమిక్ డీన్ డాక్టర్ ఎస్. మహబూబ్ జిలానీ, ఎఫ్‌ఓ డాక్టర్ జి. రమేష్ కై లాష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ రమణారెడ్డి, దీపికలు అభినందించారు.


