స్వగ్రామానికి వస్తూ.. అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి వస్తూ.. అనంతలోకాలకు

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

తొండూరు : స్నేహితులతో సరదాగా గడిపి, సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న ఆ యువకుడిని మార్గమధ్యలోనే మృత్యువు కబళించింది. మరికొద్ది సేపట్లో కళ్లముందుకు వస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో శోకం అలుముకుంది. బైక్‌ అదుపుతప్పి కిందపడిన ప్రమాదంలో ఓ యువకుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన తొండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు గ్రామానికి చెందిన ఎర్రబల్లి ప్రతాప్‌ (30) అనే యువకుడు వీరాపునాయునిపల్లి గ్రామంలో జరిగిన ’దొడ్డి దేవర’ కార్యక్రమానికి స్నేహితుల ఆహ్వానం మేరకు వెళ్లాడు. అక్కడ జరిగిన విందులో పాల్గొని అందరితో కలిసి సంతోషంగా గడిపాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి వేళ తన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు.

ఈ క్రమంలో తొండూరు మండలంలోని సంతకొవ్వూరు – పాలూరు మార్గమధ్యలో, పాలూరు సమీపంలోని గంగమ్మ గుడి వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు, శరీరానికి బలమైన గాయాలైన ప్రతాప్‌, సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అప్పటివరకు తమతో ఎంతో ఆనందంగా గడిపిన ప్రతాప్‌ క్షణాల వ్యవధిలో శవమై కనిపించడంతో స్నేహితులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి భార్య సుహాసిని ఐదునెలల గర్భిణిగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ అదుపుతప్పి కిందపడి యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement