పులివెందులలో టీడీపీ గూండాలు వీరంగం | - | Sakshi
Sakshi News home page

పులివెందులలో టీడీపీ గూండాలు వీరంగం

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

పులివెందుల : కొన్ని వేల మంది టీడీపీ గూండాలు పులివెందుల మున్సిపాలిటీపై పడి దొంగ ఓట్లు వేసుకునేందుకు వచ్చారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి.. ముఖ్యంగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం నుంచి, అలాగే అనంతపురం జిల్లా నుంచి కూడా వచ్చారని పేర్కొన్నారు.

ఈ మున్సిపాలిటీకి సంబంధించిన అసలైన ఓటర్లతో ఓట్లు వేయించకుండా.. పూర్తిగా ఫేక్‌ ఓటర్లతో దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఆదివారం ఉదయం ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడారు. తాము కొన్ని రోజులుగా స్పెసిఫిక్‌గా పేర్లు పెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్‌కు కంప్లయింట్‌ ఇచ్చామన్నారు. పార్థసారథిరెడ్డి, బీటెక్‌ రవి, శ్రీనాథరెడ్డి, పుత్తా చైతన్యారెడ్డి, శేషారెడ్డి, తదితర వారి పేర్లను పెట్టి కంప్లయింట్‌ ఇచ్చామన్నారు. కానీ ఆదివారం ఉదయం చూస్తే వైఎస్‌వీఆర్‌ఎం బాలికల జూనియర్‌ కళాశాల వద్ద ఉదయాన్నే శేషారెడ్డి, శ్రీనాథరెడ్డి, పార్థసారథిరెడ్డి వీళ్లందరూ కూడా రోడ్డు మీద కర్రలు పట్టుకుని.. అక్కడికి వెళ్లే పోలింగ్‌ ఏజెంట్లను, అక్కడికి వెళుతున్న అభ్యర్థులను అడ్డుకున్నారన్నారు. తాము కొన్ని రోజులుగా మొరపెట్టుకుంటున్నా.. వీరందరి పేర్లు చెప్పినా వాళ్లను మున్సిపాలిటీలోకి ఏ రకంగా అనుమతిస్తారని, వాళ్లు మున్సిపాలిటీలో ఓటర్లే కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ఎస్పీ నిద్రపోతున్నట్లా అని ప్రశ్నించారు. ఉదయం 4 గంటల నుంచి ఎస్పీ, కలెక్టర్‌, ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠాకు ఫొటో ఎవిడెన్స్‌తో సహా నా ఫోన్‌ నుంచి ఫొటోలు పెట్టానని, మెసేజ్‌లు పెట్టానన్నారు. గడిచిన కొన్ని రోజులుగా నేను ఎవరి మీద అయితే చెబుతున్నానో వాళ్లను ఏమాత్రం అడ్డుకోలేదని, వాళ్లందరూ మున్సిపాలిటీలోకి వేలాది మందితో వచ్చారని, వీరికి పోలీసులే సహకరిస్తున్నారని తెలిపారు. ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు జరపడమని అనిల్‌ చంద్ర పునేఠా దృష్టికి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా.. ఎటువంటి రెస్పాన్స్‌ లేదని, ఇది స్టేట్‌ స్పాన్సర్డ్‌ వాయిలెన్స్‌, రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్‌ చేస్తున్న వాయిలెన్స్‌ అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.

వెఎస్‌వీఆర్‌ఎం కాలేజీ వద్ద రౌడీయిజం

ఎన్‌టీవీ మీడియా మిత్రులు వైఎస్‌వీఆర్‌ఎం కళాశాల వద్దకు ఉదయం 5.30 గంటలకే పోలింగ్‌ ఏజెంట్లు లోపలికి వెళతారో ఆ టైంలో న్యూస్‌ కవర్‌ చేయడానికి వెళితే వారి ఫోన్లు, కెమెరాలను లాక్కొని విరగొట్టడం, వాళ్లపై చేయి చేసుకోవడం, ఇవన్నీ పుష్పనాథరెడ్డి, పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయని ఎంపీ తెలిపారు. పులివెందుల ఓటర్లపై, తమ పోలింగ్‌ ఏజెంట్లపై దాడి చేస్తారు, చివరకు మీడియా వాళ్ల మీద కూడా దాడి చేస్తారు, ఇవన్ని కెమెరాలలో బంధిస్తున్నారని చెప్పి, ఎటువంటి పరిస్థితులలో పులివెందులలో పోలింగ్‌ జరుగుతుందో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలన్నారు. డీఐజీ అనే వ్యక్తి కండువా వేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకంటే ఎక్కువగా టీడీపీ కోసం కృషి చేస్తున్నారన్నారు. 2025లో కూడా జెడ్పీటీసీ ఎన్నికలలో ఆయన దగ్గరుండి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎలెక్షన్లు చేసి పోయారని, మరి ఇవాళ కూడా ఆయన అదే పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు, డీజీపీ, లోకేష్‌ ఆదేశాలను ఈయన ఇక్కడ ఉండి అమలు చేస్తున్నారన్నారు. అధికారం ఉండేది ప్రజలకు మేలు చేయడానికి, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరపడానికి కానీ.. ఇలా దాడులు, దౌర్జన్యాలు చేసి గెలిచామని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుందన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయన్నారు.

పోలీసులే మ్యూట్‌ స్పెక్టేటర్స్‌

పులివెందుల మున్సిపాలిటీలో పోలీసులు మ్యూట్‌ స్పెక్టేటర్స్‌ వాళ్లు అంతకు మించి చేసేదేమి లేదన్నారు. కొన్ని చోట్ల పోలీసులే అడ్డుకుంటున్నారన్నారు. మహిళలు ఓటరు స్లిప్పులు పట్టుకొని వస్తే వాళ్లను పోలింగ్‌ బూత్‌లకు డీఎస్పీ పంపించడం లేదన్నారు. ఎందుకంటే ఆల్‌రెడీ వారి ఓట్లను.. దొంగగా టీడీపీ వారే వేసుకుంటున్నారు కాబట్టి.. డీఎస్పీ వాళ్లను లోపలికి పంపించడం లేదని పేర్కొన్నారు. ఇది స్టేట్‌ ఆఫ్‌ అఫైర్స్‌ ఇన్‌ ద పులివెందుల మున్సిపాలిటీ స్టేట్‌ స్పాన్సర్డ్‌ వాయిలెన్స్‌ ఇక్కడ ఉందని, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. మరి కొద్దిసేపట్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు వస్తారు, వచ్చిన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆయనకు వివరించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన

అల్లరి మూకలు

ఫేక్‌ ఓటర్లతో దొంగ ఓట్లు వేయించుకుని

నెగ్గే ప్రయత్నం

పేర్లతో సహా ఫిర్యాదు చేసినా వారిని అడ్డుకోలేదు

ఓటర్లు, ఏజెంట్లు, మీడియాపై దాడి

ఓట్లు వేయడానికి మహిళలనూ డీఎస్పీ పంపించలేదు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement