మదనపల్లె టౌన్ : మదనపల్లెలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ పెట్రోలింగ్ పార్టీ ఇన్‌చార్జ్ సీఐ వై.బాబు ఆదివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా డీపీఈవో ఆదేశాల మేరకు మొబైల్ పెట్రోలింగ్ పార్టీ బృందం, ఎస్టీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా మదనపల్లె నుంచి అంగళ్లు వెళ్లే రోడ్డులోని స్థానిక టమోటా మార్కెట్ యార్డు ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీల్లో నీరుగట్టువారిపల్లెకు చెందిన ఎన్.భాస్కర్‌రెడ్డి (46) అక్రమంగా 15 బాటిళ్ల మద్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 2.7 లీటర్ల మద్యాన్ని (11 బిన్నీస్ గ్రేప్ బ్రాందీ, 4 ఓల్డ్ అడ్మిరల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, క్రైం నం.102/2026 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
బైక్ అదుపు తప్పి
యువకుడికి గాయాలు
చౌడేపల్లె : చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని చిన్నకొండామర్రి వద్ద రోడ్డుకు అడ్డుగా ఆవు రావడంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపు తప్పి పడి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముళబాగిల్ మండలంచీక్ పల్లెకు చెందిన పవన్ బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. బంధువులను చౌడేపల్లెలో వదలడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన అతన్ని చౌడేపల్లె 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ నుంచి
వైఎస్సార్‌సీపీలో చేరిక
కేవీపల్లె : మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ శ్రీనాథపురం కాలనీలో పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం గ్రామానికి చెందిన రెడ్డెమ్మ, మహీంద్ర ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి టి.సాహిత్‌రెడ్డి వారికి పార్టీ కండువాలతో సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి, ధర్మారెడ్డి, మహేష్‌రెడ్డి, వీరనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎంఎంఎస్ రుసుం గడువు పెంపు
మదనపల్లె సిటీ : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష రుసుం ఈనెల 6లోపు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. పరీక్ష ఈ నెల 29వ తేదీన జరుగుతుందన్నారు. నామినల్ రోల్‌కు సంబంధించి ప్రధానోపాధ్యాయులు తనిఖీ చేసి ధ్రువీకరించిన ధృవపత్రాలు అన్ని జతపరిచి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 9వ తేదీలోపు సమర్పించాలన్నారు.


