‘నంద్యాల’ బాటలో సుగవాసి! | - | Sakshi
Sakshi News home page

‘నంద్యాల’ బాటలో సుగవాసి!

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

సాక్షి ప్రతినిధి, కడప : నంద్యాల రాఘవరెడ్డి బాటను సుగవాసీ ప్రసాద్‌బాబు పట్టారు. సర్‌ ప్రక్రియలో భాగంగా రాఘవరెడ్డి కామనూరు నుంచి ప్రొద్దుటూరు అర్బన్‌కు ఓటు మార్పు కోసం దరఖాస్తు, ఆపై హైకోర్టు ఉత్తర్వులతో మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసినట్లుగా.. అచ్చం అలాగే తెలుగుతమ్ముళ్లు ఎత్తుగడ వేస్తున్నారు. రాయచోటి అర్బన్‌లో ఓటు హక్కు ఉన్న ప్రసాద్‌బాబు గాలివీడుకు మార్పు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకొని.. ఆపై హైకోర్టును ఆశ్రయించి, జెడ్పీటీసీగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాయచోటి మున్సిపాలిటీలో 35వ వార్డులో డోర్‌ నంబర్‌ 54/13–ఏ, ఓటరు వరుస సంఖ్య 226లో ఇప్పటికీ సుగవాసీ ప్రసాద్‌బాబు ఓటు ఉంది. కాగా, గాలివీడు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అర్బన్‌ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారు మున్సిపాలిటీలో పోటీ చేయాల్సి ఉంది. అలా కాకుండా రూరల్‌ పరిధిలోకి మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నానని, చట్టంలో ఉన్న లొసుగులు ఆసరాగా చేసుకొని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులతో జెడ్పీటీసీగా నామినేషన్‌ దాఖలు చేశారు. మొన్న మున్సిపల్‌ నామినేషన్ల సందర్భంగా ప్రొద్దుటూరులో టీడీపీ చైర్మన్‌ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి పోటీ చేసినట్లుగా.. అదే విధంగానే ఉత్తర్వులు పొందిన సుగవాసీ ప్రసాద్‌బాబు జెడ్పీటీసీగా పోటీ చేశారు. ఇలానే జమ్మలమడుగు మున్సిపల్‌ చైర్మన్‌ టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల జ్యోతి హైకోర్టు ఉత్తర్వులతో నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం. సర్‌ ప్రక్రియ పూర్తి కాకుండా, ఓటరు జాబితాలో ఓటు లేకుండా, నామినేషన్‌ చేసిన వారి జాబితాలో నంద్యాల రాఘవరెడ్డి, చదిపిరాళ్ల జ్యోతి, సుగవాసీ ప్రసాద్‌బాబు ఉండిపోయారు. ఇంకొకరికి వచ్చే అవకాశాన్ని.. హైకోర్టు ఉత్తర్వుల ద్వారా.. వీరు హైజాక్‌ చేశారని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు.

చట్టం.. అధికార పార్టీకి చుట్టం!

చట్టం, న్యాయం అధికార పార్టీకి చుట్టంగా మారాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా స్థానిక సంస్థల ఎన్నికలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి మున్సిపల్‌ నామినషన్లలో ప్రొద్దుటూరు టీడీపీ చైర్మన్‌ అభ్యర్థిగా బచ్చల వీరప్రతాప్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. శాసీ్త్రనగర్‌, ప్రొద్దుటూరులో నివాసం ఉన్నట్లుగా అందులో పొందుపర్చారు. తాజాగా ప్రొద్దుటూరు జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా గోపవరం పంచాయతీకి చెందిన వ్యక్తిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నిబంధనలు, నియమావళి వంటివి చెప్పుకొనేందుకే అని.. అధికార పార్టీకి చెందిన వ్యక్తులైతే.. అధికారులు పాటించడం లేదని పలువురు వాపోతున్నారు. నంద్యాల రాఘవరెడ్డి, చదిపిరాళ్ల జ్యోతి, సుగవాసీ ప్రసాద్‌బాబు, బచ్చల వీరప్రతాప్‌ ఉదంతాలే అందుకు నిదర్శనంగా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

రాయచోటి అర్బన్‌ నుంచి గాలివీడుకు ఓటు మార్పు

సర్‌ ప్రక్రియలో సుగవాసీ ప్రసాద్‌బాబు దరఖాస్తు

ఓటరు లిస్టు ప్రచురితం కాకమునుపే స్థానిక సంస్థల నోటిఫికేషన్‌

ఆపై హైకోర్టు ఉత్తర్వులతో జెడ్పీటీసీగా నామినేషన్‌ దాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement