దౌర్జన్యాలకు ఎగబడి.. దాడులకు తెగబడి | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలకు ఎగబడి.. దాడులకు తెగబడి

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

పులివెందుల రూరల్‌ : స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు ఎగబడి.. దాడులకు తెగబడ్డారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కనీసం నామినేషన్‌లు వేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మకై ్క.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఏమిటని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు కావడంతో పులివెందుల మండల పరిధిలోని 5 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న నామినేషన్‌ కేంద్రానికి వెళ్తుండటంతో.. టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నామినేషన్‌ వేసేందుకు కూడా వెళ్లనీయకుంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించాలని టీడీపీ నాయకులతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. టీడీపీ గూండాలు నామినేషన్‌ పత్రాలను చించివేసేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులతో ఘర్షణ పడ్డారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఓబుళరెడ్డి, నాయక్‌, మస్తాన్‌లు టీడీపీ నాయకులతో గొడవపడి తప్పించుకుని నామినేషన్‌ వేసేందుకు నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీడీపీ నాయకులు అడ్డగించినా, అభ్యర్థులను పోలీసులు లోపలికి పంపించారు. కానీ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల వద్ద సపోర్టర్స్‌తోపాటు సాక్ష్యం లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు రాకుండా.. టీడీపీ నాయకులు నామినేషన్‌ కేంద్రాల వద్ద గుంపులుగా అలాగే ఉండిపోయారు. అలాగే పోలీసులు కూడా టీడీపీ నాయకులు గుంపులుగా ఉన్నా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చంద్రగిరి ఎంపీటీసీ అభ్యర్థి మస్తాన్‌ నామినేషన్‌ వేసేందుకు వెళుతుండటంతో టీడీపీ నాయకులు దాడి చేయడంతో.. పోలీసులు ఆయనను తీసుకెళ్లి పోలీసు క్వార్టర్స్‌లో బంధించారు. వేంపల్లెలో కూడా ఇలాగే అభ్యర్థులను అడ్డుకున్నారు.

వైఎస్సార్‌సీపీ తరపున టీడీపీ అభ్యర్థులే

నామినేషన్లు

పులివెందుల ఎంపీటీసీ స్థానాలకు టీడీపీకి చెందిన అభ్యర్థులే వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. కొత్తపల్లె ఎంపీటీసీ స్థానానికి టీడీపీకి చెందిన చంద్రశేఖరరెడ్డి, బాలనాగప్రసాద్‌, ఎర్రబల్లె–1 నందా ప్రకాష్‌లు వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.

వైఎస్సార్‌సీపీ తరఫున టీడీపీ

వారే నామినేషన్లు

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను అడ్డుకున్న టీడీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement