40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలా జరగలేదు | - | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలా జరగలేదు

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

మా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నామినేషన్‌ వేయలేని పరిస్థితి ఎప్పుడూ లేదు. నేను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడానికి ఉదయం వెళ్లాలని నిర్ణయించుకున్నాను. తెల్లవారక ముందే పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అడుగుతూ ఉంటే.. నామినేషన్‌ వేయడానికి పంపిస్తామని చెప్పి.. పంపించలేదు. సమయం మించిపోతుందని నామినేషన్‌ వేయటానికి వెళ్తున్న నన్ను పోలీసులు అడ్డుకున్నారు. మరో వాహనంలో నామినేషన్‌ వేయడానికి వెళ్తే.. మమ్మల్ని దారిలోనే లారీ, ట్రాక్టర్‌లు అడ్డుపెట్టి ఉప్పలపాడు వద్ద అడ్డుకున్నారు. మూడు గంటల లోపు నామినేషన్‌ వేయకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకుని కూటమి పాలకులకు పూర్తిగా సహకరించారు.

– పి.ఇందిర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, జమ్మలమడుగు

ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోంది?

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నా.. ఇటు పోలీసులు, అటు ఎన్నికల కమిషన్‌ గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. నేను కేవలం మరో నలుగురు మహిళలతో కమలాపురం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వెళ్తే.. అక్కడున్న టీడీపీ గూండాలు మమ్మల్ని మహిళలు అని కూడా విచక్షణ లేకుండా తిట్ల పురాణం అందుకున్నారు. చీరలు లాగుతున్నారు. గోర్లతో రక్తం వచ్చేలా రక్కారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారే తప్ప మా వద్దకు రాలేదు. ఇలా నామినేషన్లు అడ్డుకునే బదులు వారు నామినేట్‌ చేసుకోవచ్చు కదా? అంత దానికి ఇంత ప్రక్రియ ఎందుకు?

–మారుజోళ్ల కవిత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, కమలాపురం

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ప్రజాస్వామ్యం అభాసుపాలైంది.

నామినేషన్లు వేయడానికి వెళ్తున్న

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను.. అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతోనే ఈ దౌర్జన్యానికి

పాల్పడ్డారని అభ్యర్థులు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య ప్రక్రియను పోలీసుల అండతో ఖూనీ చేయడంపై వారు

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

– జమ్మలమడుగు/ కమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement