– మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా,
జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి
కడప అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషాకు శనివారం ఉదయం పోలీసులు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కుట్రలు, బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని, మా అభ్యర్థుల నామినేషన్ల హక్కులను కాపాడుకుంటాం అని నాయకులు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


