అధికారం చిరకాలం ఉండదు | - | Sakshi
Sakshi News home page

అధికారం చిరకాలం ఉండదు

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

● పోలీసులు దుర్మార్గానికి వత్తాసు పలకొద్దు

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి

కడపకార్పొరేషన్‌ : అధికారం చిరకాలం ఉండదన్న సత్యాన్ని పోలీసులు, టీడీపీ నాయకులు గ్రహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డితో కలిసి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు నామినేషన్‌ వేయకుండా దౌర్జన్యం చేయడంపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి రెడ్డితో కలిసి అంబేడ్కర్‌ సర్కిల్‌లో బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్పార్‌సీపీ నాయకులకు 144 సెక్షన్‌, 30 యాక్టు అమల్లో ఉందని పోలీసులు నోటీసులు ఇచ్చారని, టీడీపీ నాయకులు గుంపులుగా కట్టెలు, రాడ్లు పట్టుకొని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కడప చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి దాడులు చూడలేదన్నారు. ఎన్నికల్లో ఎలా కూడా చేయవచ్చని వారు తమకు నేర్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా పోలీసులు లెక్క చేయలేదన్నారు. ఈ దుర్మార్గానికి, అరాచకాలు, దౌర్జన్యానికి పోలీసులు మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఆదివారమైనా న్యాయంగా వ్యవహరించి నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని, చేతగానివాళ్లలా ఉండిపోవద్దని హితవు పలికారు. టీడీపీ జోనల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులరెడ్డి అఽధికారం, పోలీసుల అండ ఉందనే అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదని, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. కడప ప్రజలు రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని సహించరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌, రారష్ట్‌ర యువజన ప్రధాన కార్యదర్శి షేక్‌ ఉమైర్‌, మాజీ కార్పొరేటర్లు చంద్రహాసరెడ్డి, అక్బర్‌ అలీ, షఫీ, సీహెచ్‌ వినోద్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌, ఎస్పీలకు చెప్పినా స్పందన లేదు:

మాజీ డిప్యూటీ సీఎం

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయనీయడం లేదని, తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌, ఎస్పీలకు విన్నవించినా స్పందన లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష అన్నారు.ముంతాజ్‌ బేగం కుమారుడు మురాద్‌ను కత్తితో దాడి చేశారని, మరో అభ్యర్థి శ్యాంసన్‌ తల పగులగొట్టారన్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే ఓడిపోతామన్న భయంతోనే నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారన్నారు.

శిఖండి రాజకీయం చేయొద్దు:

టీడీపీ నాయకులకు దమ్ముంటే మగాళ్లలాగా రాజకీయం చేయాలని, శిఖండి రాజకీయం చేయొద్దని వైఎస్సార్‌సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే గెలవలేమని తెలిసి 2వేల మందిని తెచ్చి హత్యారాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ చేతగానితనానికి ఇది నిదర్శనమన్నారు.

బీహార్‌, తమిళనాడు నుంచి గ్యాంగ్‌లు : దీప్తిరెడ్డి

బీహార్‌, తమిళనాడు నుంచి వచ్చిన గ్యాంగ్‌లు కడపలో రౌడీయిజం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి అన్నారు. నిన్న 12నామినేషన్లు వేస్తే 6 మాత్రమే ఆమోదం పొందాయని, మిగిలిన ఆరు ఏమయ్యాయో తెలీదన్నారు. నిన్న డీఎస్పీని కలిసి టీడీపీ చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేశామని, ఈ రోజు ఎస్పీని కలిసేందుకు వెళితే ఆయన కలవకుండానే వెళ్లిపోయారన్నారు.

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి. రవీంద్రనాథ్‌రెడ్డి, నరేన్‌ రామాంజులరెడ్డి తదితరులు

అంబేడ్కర్‌ కూడలిలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాష, మేయర్‌ అభ్యర్థి దీప్తిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement