జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

కడప ఎడ్యుకేషన్‌ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2వ తేదీని ‘వర్కింగ్‌ జర్నలిస్టుల కోర్కెల దినం’గా పాటించాలని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌(ఐజేయూ) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు.. ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయుడబ్లూజే) ఆధ్వర్యంలో శుక్రవారం కడపలో వర్కింగ్‌ జర్నలిస్టులు కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్‌ఓ మల్లికార్జునుడును కలిసి జర్నలిస్టుల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వర్కింగ్‌ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వర్కింగ్‌ జర్నలిస్టులు, మీడియా సంస్థలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు

● ప్రస్తుత మీడియా రంగంలో వచ్చిన సాంకేతిక, సామాజిక మార్పులను సమగ్రంగా సమీక్షించి వెంటనే మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలి.

● జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, మీడియా సంస్థలకు భద్రత కల్పించే విధంగా ప్రత్యేక కేంద్ర జర్నలిస్టుల భద్రతా చట్టం తీసుకురావాలి.

● వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులు, రక్షణలను పునరుద్ధరించాలి.

● ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న వర్కింగ్‌ జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ పథకాన్ని పునఃప్రారంభించాలి.

● ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఉద్యోగ విరమణ చేసిన సీనియర్‌ పాత్రికేయులకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలి.

● గతంలో జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలి.

● ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్లూజే జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రామసుబ్బారెడ్డి, వెన్ను శ్రీనివాస్‌, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ వెంకటరెడ్డి, వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినాథ్‌రెడ్డి, ఎలక్ట్రాన్‌ మీడియా అధ్యక్షుడు రమణారెడ్డి, ఐజేయూ నాయకుడు రామాంజనేయరెడ్డి, ఏపీయుడబ్లూజే సీనియర్‌ నాయకులు శివరాం, స్టాఫ్‌ రిపోర్టర్లు, కెమెరామెన్లు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద ఏపీయూడబ్లూజే

నాయకుల నిరసన, ర్యాలీ

డీఆర్‌ఓ మల్లికార్జునుడికి వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement