చిత్తూరు జిల్లాలో పోరుమామిళ్ల వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో పోరుమామిళ్ల వాసి మృతి

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

వి.కోట : కారు బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెంది, ఇద్దరు గాయాల పాలైన సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని చైన్నె–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవేలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఇస్మాయిల్‌(67), అతని కుమారుడు, భార్యతో కలసి తమ సొంత కారులో నెల్లూరుకు వెళ్లి తిరిగి బెంగళూరుకు పయనమయ్యారు. చైన్నె–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవేలో వెళుతుండగా వి.కోట మండల పరిధిలోని ఎగువపల్లి గ్రామ సమీపాన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వేగాన్ని నియంత్రించలేక కారు బోల్తాపడి నుజ్జునుజ్జయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇస్మాయిల్‌ మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయబడిన అతని భార్య, కుమారుడిని చికిత్స నిమిత్తం కుప్పం పీఈఎస్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.

కారు బోల్తాతో ఘటన ఇద్దరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement