
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు సమీపంలో సాయిబాబాగుడి దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజనేయులు(24), శివకుమార్ (27) దుర్మరణం చెందారు. వీరు బైకుపై వస్తుండగా స్కార్పియో వాహనం ఢీ కొన్నట్లు కొండాపురం ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని దుగ్గుపల్లె వద్ద పంప్ హౌస్‌లో నాలుగురోజుల నుంచి అక్కడ పని చేసి తిరిగి కొండాపురానికి బైకుపై వస్తుండగా లావనూరు వద్ద స్కార్పియో వాహనం ఢీ కొంది. రామంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. శివకుమార్‌ను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందినవారని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం